AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేసవిలో దోమలు, బల్లులతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ సింపుల్ చిట్కాలతో వెంటనే తరిమేయండి..!

వేసవిలో ఇంట్లో దోమలు, బల్లుల బాధ ఎక్కువవుతుంది. ఈ ఇబ్బందులను కొన్ని సహజమైన పద్ధతులతో తేలిగ్గా తగ్గించుకోవచ్చు. రోజూ ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటే, ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతోనే ఈ సమస్యలను సులువుగా నివారించవచ్చు. దీనివల్ల ఇంటి వాతావరణం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

వేసవిలో దోమలు, బల్లులతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ సింపుల్ చిట్కాలతో వెంటనే తరిమేయండి..!
Home Pest Control Tips
Prashanthi V
|

Updated on: Apr 14, 2025 | 10:32 PM

Share

వేసవిలో కీటకాలు, బల్లుల బాధ ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణమేంటో తెలుసా..? వేసవిలో వేడి ఎక్కువగా ఉండటం వల్ల కీటకాలు, బల్లులు ఎక్కువగా బయటకు వస్తాయి. ఇవి ఇంట్లోకి చేరి మనకు ఇబ్బంది కలిగిస్తాయి. ఇంటిని మురికిగా చేస్తాయి. కొన్ని సందర్భాలలో ఇవి వ్యాధులు కూడా పుట్టించవచ్చు.

ఇంటిని ప్రతి రోజు శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. ఇంటిని రోజూ కాస్త ఊడ్చడం, తుడిచే అలవాటు చేస్తే కీటకాలు, బల్లులు దూరంగా ఉంటాయి. తినే పదార్థాలు బయట ఉంచకుండా చూడాలి. తిన్న వెంటనే పాత్రలు కడగాలి. చెత్త వెంటనే తీసివేయడం వల్ల దుర్వాసన రాదు. ఇంటి వాతావరణం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

కీటకాలు చిన్న రంధ్రాల ద్వారా లోపలికి వస్తాయి. తలుపులు కిటికీలు దగ్గర ఉన్న రంధ్రాలను మూసివేయాలి. మస్కిటో నెట్ వేయడం వల్ల కీటకాలు రావు. వెంటిలేషన్ కూడా తగ్గకుండా చూడాలి. ఇలా చేస్తే ఆహ్లాదంగా కూడా ఉంటుంది.

కీటకాలు కొన్ని వాసనలను ఇష్టపడవు. వేప ఆకులు, రేగుట ఆకులు వంటి మూలికలు ఇంట్లో ఉంచితే అవి దూరంగా ఉంటాయి. సహజమైన క్రిమి నివారణ ద్రావణాలు దుకాణాల్లో దొరుకుతాయి. వాటిని ఉపయోగించడం వల్ల హాని లేదు.. ప్రయోజనం ఉంటుంది.

ఉల్లిపాయ పొట్టు, వెల్లుల్లి తొక్కలు, గుడ్డు పెంకులు బలమైన వాసన కలిగి ఉంటాయి. ఇవి బల్లులు కీటకాలను తరిమికొడతాయి. ఇంట్లోని మూలల దగ్గర వాటిని ఉంచితే మంచి ఫలితాలు వస్తాయి.

నిమ్మకాయతో వెనిగర్ కలిపిన నీటిని తయారు చేసి పిచికారీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. కీటకాలు ఎక్కువగా ఉండే ప్రదేశాలు.. వంటగది, బాత్రూమ్, కిటికీల చుట్టూ దీనిని పిచికారీ చేయాలి. ఇది సులభమైన పరిష్కారం.

తినే పదార్థాలపై ఎప్పుడూ మూతపెట్టాలి. బహిరంగ ఆహార వాసన కీటకాలను ఆకర్షిస్తుంది. దీనివల్ల ఆహారం పాడవుతుంది. వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

కర్పూరం వేసిన చోట కీటకాలు దూరంగా ఉంటాయి. అల్మారాల్లో స్టోర్ రూమ్‌లలో ఉంచాలి. అలాగే నిమ్మగడ్డి మొక్కలు పెంచితే కూడా కీటకాలు దూరంగా ఉంటాయి. అవి వాటి వాసనను ఇష్టపడవు.

వేసవిలో ఇంటిని కీటకాలు, బల్లుల నుండి కాపాడటానికి ఈ చిట్కాలు చాలా ఉపయోగపడుతాయి. ఇవి సులభంగా చేయవచ్చు. ఇలాంటివి అనుసరించడం వల్ల మన ఇంటి వాతావరణం శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటుంది.