ఆరోగ్యాన్ని వెళ్లడిస్తున్న గోర్లు.. ఎలా ఉంటే ఏ సమస్యలు ఉన్నట్లో చూడండి!

Samatha

29 December 2025

గోళ్ల రంగు అనేది ఆరోగ్యాన్ని వెల్లడిస్తాయి.  కాగా ఇప్పుడు మనం ఏ రంగు గోర్లు ఏ వ్యాధిని సూచిస్తాయి అనేది తెలుసుకుందాం.

గోర్లు పెళుసులుగా , గోళ్లపై అసాధారణ మచ్చలు కనిపిస్తే, తప్పకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే గోళ్ల ఆరోగ్యం ఊపిరితిత్తులు, అలెర్జీల సమస్యలను సూచిస్తాయంట.

కాగా, ఇప్పుడు మనం గోర్లు ఏ రంగులో ఉంటే ఏ వ్యాధి ఉన్నట్లు అనేది ఇప్పుడ చూద్దాం. దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

మీ గోర్లు అయితే పసుపు రంగులో ఉంటే, మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్, శ్వాస కోశ సమస్యలు, మధుమేహ వ్యాధి సమస్యలు ఉన్నట్లే అంటున్నారు నిపుణులు.

అలాగే మీ గోర్లు చాలా తెల్లగా పాలిపోయినట్లు ఉంటే, మీలో రక్తహీనత సమస్య , కాలేయ వ్యాధి, గుండె సమస్యలు ఉన్నట్లు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

అదే విధంగా నీల రంగు గోర్ల ఉంటే, ఇది తీవ్రతమైన హెచ్చరికగా పరిగణించాలంట. రక్తంలో తక్కువ ఆక్సిజన్, పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల సమస్యలను సూచిస్తుందంట.

అలాగే గోళ్ల రంగు మాత్రమే కాకుండా, గోర్ల నిర్మాణం కూడా వ్యాధులను తెలియజేస్తుందంట. మందమైన, పెళుసుల గోర్లు సోరియాసిస్, థైరాయిడ్ సమస్యలను సూచిస్తాయి.

మీ గోర్లు గనుక చాలా మృదువు గా, పెళుసులుగా ఉంటే, మీ శరీరంలో తగిన పోషకాలు లేవు, ప్రోటీన్ లోపం వంటి సమస్యలను సూచిస్తాయంట