భయంకరమైన పీడకలలు ఎందుకు వస్తాయో తెలుసా?
Samatha
28 December 2025
కలలు కనడం అనేది సహజం. కొందరు రాత్రి సమయంలో ఎక్కువ కలలుకంటే మరికొంత మంది పట్టపగలు కూడా కలలు కంటారు.
ఇక కలల్లో కొంత మందికి తమ పూర్వీకులు, పువ్వుల తోటలు, ఇష్టదైవం, తమ ఫ్రెండ్స్, బంధువులు ఇలా కొందరు కన
ిపిస్తుంటారు.
కానీ కొంత మందికి మాత్రం పదే పదే భయంకరమైన పీడకలలు వస్తుంటాయి. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? భయంకరమైన కలలు ఎందుక
ు వస్తాయో, దాని గురించి తెలుసుకుందాం.
నిద్రపోయినప్పుడు, మెదడు పూర్తిగా విశ్రాంతి తీసుకోని సమయంలో కలలు వస్తుంటాయి. ఈ సమయంలో కనుగుడ్లు వేగంగా కదలడం, మెదడులోని కణాలు చురుకుగా పనిచేస్తాయంటే.
ఇక పీడకలలు అనేవి, మెదడులోని అమిగ్దాలా అనే భాగం భయం, ప్రమాద సంకేతాలు ప్రాసెస్ చేస్తుంది. ఇది నిద్రలో అతిగా స్పందించినప్పుడు పీడ కలలు వస్తాయంట.
అంతే కాకుండా ఒత్తిడి , ఆందోళన, వ్యక్తిగత జీవితంలోని సమస్యలు కూడా పీడకలలు రావడానికి కారణం అవుతాయని చెబుతున్నారు నిపుణులు.
కొన్ని సార్లు గతంలో జరిగిన సంఘటనలు మీరు పదే పదే గుర్తు చేసుకున్నా, అవి మిమ్మల్ని పీడకలల రూపంలో వెంటాడుతూనే ఉంటాయంట.
అలాగే నిద్ర సరిగ్గా లేకపోవడం, అలసట, వంటి వాటి వలన కూడా పీడ కలలు అనేవి ఎక్కువగా వస్తాయని చెబుతున్నారు నిపుణులు.
మరిన్ని వెబ్ స్టోరీస్
నల్ల పసుపు గురించి తెలుసా? దీనిని తింటే కలిగే లాభాలు ఇవే!
బంధం బలపడితే.. భాగస్వామి మీ నుంచి ఆశించనివి ఇవే!
గ్రీన్ టీ ఇలా తాగారో అంతే.. మీ బండి షెడ్డుకే!