Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi-Joe Biden Conversation: ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో ఫోన్‌ సంభాషణ.. పలు కీలక ఒప్పందాలపై చర్చ

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో సంభాషించారు. ఈ సంభాషణ సందర్భంగా, ఇరువురు నాయకులు ఎయిర్ ఇండియా, బోయింగ్ ఒప్పందాన్ని చారిత్రాత్మకమైన..

PM Modi-Joe Biden Conversation: ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో ఫోన్‌ సంభాషణ.. పలు కీలక ఒప్పందాలపై చర్చ
Joe Biden - Modi
Follow us
Subhash Goud

|

Updated on: Feb 14, 2023 | 10:51 PM

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో సంభాషించారు. ఈ సంభాషణ సందర్భంగా, ఇరువురు నాయకులు ఎయిర్ ఇండియా, బోయింగ్ ఒప్పందాన్ని చారిత్రాత్మకమైనది, పరస్పర ప్రయోజనకరమైన సహకారానికి గొప్ప ఉదాహరణగా పేర్కొన్నారు. ఇది కాకుండా జో బైడెన్‌తో జరిగిన ఈ సంభాషణలో భారత-అమెరికా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ప్రధాని మోదీ సంతృప్తిని వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన ఈ ఫోన్‌ సంభాషణ రెండు దేశాల మధ్య మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అన్ని డొమైన్‌లలో పటిష్టమైన వృద్ధికి కారణమైన భారత్-అమెరికా సమగ్ర గ్లోబల్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ పెరగడం పట్ల మోడీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా, బోయింగ్ మధ్య ఒక మైలురాయి ఒప్పందాన్ని ప్రకటించడాన్ని వారు స్వాగతించారు. ఇది రెండు దేశాలలో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడంలో సహాయపడే పరస్పర ప్రయోజనకరమైన సహకారానికి ప్రకాశవంతమైన ఉదాహరణగా అభివర్ణించారు. భారతదేశంలో విస్తరిస్తున్న పౌర విమానయాన రంగం కారణంగా ఏర్పడే అవకాశాలను ఉపయోగించుకోవాలని బోయింగ్, ఇతర యూఎస్‌ కంపెనీలను ప్రధాని ఆహ్వానించారు.

వార్తా సంస్థ పీటీఐ వివరాల ప్రకారం.. భారతదేశంలో పౌర విమానయాన రంగాన్ని విస్తరించాలని, అవకాశాలను ఉపయోగించుకోవాలని ప్రధాని మోదీ బోయింగ్, ఇతర అమెరికన్ కంపెనీలను ఆహ్వానించారు. మరోవైపు, ఈ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రశంసించారు. ఈ ఒప్పందాన్ని చారిత్రాత్మకంగా అభివర్ణించారు. అమెరికా తయారీలో ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని బైడెన్‌ అన్నారు. ఎయిరిండియా, బోయింగ్ మధ్య ఒప్పందం, కొనుగోలును ప్రకటించడం గర్వంగా ఉందని అన్నారు. ప్రధాని మోడీతో కలిసి భారత్, అమెరికాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తానని జో బైడెన్‌ స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య శక్తివంతమైన ప్రజా సంబంధాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు. భారతదేశం కొనసాగుతున్న G20 ప్రెసిడెన్సీ సమయంలో దాని విజయాన్ని నిర్ధారించడానికి ఇద్దరు నాయకులు సంప్రదింపులు జరుపుకోవడానికి అంగీకరించారు.

ఇరు దేశాలలో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు సహాయపడే పరస్పర ప్రయోజనకరమైన సహకారానికి ఒక ప్రకాశవంతమైన ఉదాహరణగా ఎయిర్ ఇండియా, బోయింగ్ మధ్య మైలురాయి ఒప్పందాన్ని నాయకులు స్వాగతించారు. భారతదేశంలో విస్తరిస్తున్న పౌర విమానయాన రంగం కారణంగా ఏర్పడే అవకాశాలను ఉపయోగించుకోవాలని బోయింగ్, ఇతర యూఎస్‌ కంపెనీలను మోడీ ఆహ్వానించారు. అంతరిక్షం, సెమీ కండక్టర్లు, రక్షణ, ఇతర రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయాలనే నిర్ణయాన్ని వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి