Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వాట్సాప్‌తో ఆటో బుక్ చేసుకునే సదుపాయం..

ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడం ఒక టాస్క్ అయితే, రైలు ప్రయాణం తరువాత ఆటో, క్యాబ్ చేసుకోవడం మరో టాస్క్. ట్రైన్ దిగగానే.. ఆటో, ట్యాక్సీ కావాలా? అంటూ ఒకేసారి డ్రైవర్లు మీద మీద పడిపోతుంటారు.

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వాట్సాప్‌తో ఆటో బుక్ చేసుకునే సదుపాయం..
Indian Railways
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 14, 2023 | 10:01 PM

ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడం ఒక టాస్క్ అయితే, రైలు ప్రయాణం తరువాత ఆటో, క్యాబ్ చేసుకోవడం మరో టాస్క్. ట్రైన్ దిగగానే.. ఆటో, ట్యాక్సీ కావాలా? అంటూ ఒకేసారి డ్రైవర్లు మీద మీద పడిపోతుంటారు. అయితే, దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని కోయంబత్తూర్ రైల్వే స్టేషన్‌లో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. రైల్వే స్టేషన్‌లోనే వాట్సాప్, క్యూఆర్ కోడ్ ద్వారా ఆటోలను బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింది.

తమిళనాడులో చెన్నై రైల్వే స్టేషన్ తరువాత అంతటి రద్దీ గల స్టేషన్ కోయంబత్తూర్ రైల్వే స్టేషన్. ఇక్కడ మౌలిక వసతులను మెరుగుపరుస్తోంది రైల్వే శాఖ. ఇందులో భాగంగానే ఇప్పటికే ప్రయాణికుల వసతి కోసం ఆధునిక ఎయిర్ కండీషన్డ్ గదిని ప్రారంభించారు. ఇప్పుడు వాట్సాప్, క్యూఆర్ కోడ్ ద్వారా ఆటోలను బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. అయితే, కోయంబత్తూరులో కార్యకలాపాలు సాగిస్తున్న ఉరు క్యాబ్స్(oor cabs) సంస్థ ఈ కాంట్రాక్ట్‌ను పొందింది. ఉర్ క్యాబ్స్ యాప్ ద్వారా గానీ, క్యూఆర్ కోడ్‌ని స్కాన్‌ చేసి వాట్సాప్ ద్వారా గానీ ఆటోను బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది రైల్వే శాఖ.

అంతేకాదు.. ప్రయాణికులు 8094880980 నెంబర్‌కి టెక్స్ట్ మెసేజ్ చేసి కూడా ఆటోను బుక్ చేసుకోవచ్చు. డ్రైవర్‌కి, ప్రయాణికులకు ఆమోదయోగ్యమైన ధరకే ప్రయాణం సాగించవచ్చు అని రైల్వే అధికారులు తెలిపారు. కాగా, ఈ సదుపాయాన్ని దేశ వ్యా్ప్తంగా అమలు చేసేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..