కాలేజీ బస్సులో క్షుద్రపూజలు.. భయానక దృశ్యం చూసి భయంతో పరుగులు తీసిన విద్యార్థులు..
కాలేజీ యజమాన్యం మరొక బస్సు పంపించి విద్యార్థులను అక్కడి నుంచి తరలించారు. ఘటనకు సంబంధించిన కారణాలపై ఆరా తీస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో క్షుద్రపూజలు, భూతవైద్యం ఘటనలు అనేకం బయటపడుతున్నాయి. తరచూ గుప్తనిధుల కోసం దుండగులు క్షుద్రపూజలు చేస్తున్న ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి ఈ క్రమంలోనే తాజాగా అలాంటి ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా నూజివీడు సమీపంలో కాలేజీ బస్సులో క్షుద్ర పూజలు కలకలంరేపాయి. చాట్రాయి మండలం కృష్ణారావుపాలెం సమీపంలో విసన్నపేటకు చెందిన వికాస్ కాలేజీ బస్సులో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు సిబ్బందిని, స్థానికుల్ని భయాందోళనకు గురిచేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే…
ఏలూరు జిల్లా నూజివీడు సమీపంలో నిలిపివుంచిన కాలేజీలో బస్సులు పసుపు, కుంకుమ, వివిధ రకాలైన పూజా సామాగ్రితో విచిత్ర పూజలు చేసినట్టుగా కనిపించింది. ప్రతి రోజూ కృష్ణారావుపాలెం సెంటర్ ఆంజనేయస్వామి గుడి దగ్గర పార్కింగ్ చేస్తారు. అయితే విద్యార్థులు వెళ్లే వికాస్ కాలేజీ బస్సులో నిమ్మకాయలు, అన్నంముద్దలు, ముగ్గులు వేసి అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు. ఆ మర్నాడు కాలేజీకి వెళ్లేందుకు బస్కెక్కి విద్యార్థులు, సిబ్బంది చూసి భయపడిపోయారు.
నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, అన్నం ముద్దలతో పూజలు చేసిన ఆనవాళ్లు చూసి కాలేజ్‌కు వెళదామని బస్సు ఎక్కడానికి వచ్చిన విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. వికాస్ కాలేజీ యజమాన్యం మరొక బస్సు పంపించి విద్యార్థులను అక్కడి నుంచి తరలించారు. ఘటనకు సంబంధించిన కారణాలపై ఆరా తీస్తున్నారు.
మరిన్ని ఏపీ న్యూస్ కోసం ఇక్కడ..