ఘరానా దొంగ..! పానీపూరీ తిన్నాడు.. వ్యాపారి ఖాతానే ఖాళీ చేశాడు.. ఎలాగో తెలిస్తే షాకవ్వాల్సిందే..

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రోడ్డులో ఉన్న లోకేష్ పానీపూరీ దుకాణానికి వెళ్లి తన స్నేహితులతో కలిసి మూడు ప్లేట్ల పానీపూరీ తిన్నాడు...నిందితుడు విశాల్‌ను అదుపులోకి తీసుకున్ని విషయం మొత్తం కక్కించారు. దీంతో కేసుకు సుఖాంతం అయింది.

ఘరానా దొంగ..! పానీపూరీ తిన్నాడు.. వ్యాపారి ఖాతానే ఖాళీ చేశాడు.. ఎలాగో తెలిస్తే షాకవ్వాల్సిందే..
Pani Puri Merchants
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 14, 2023 | 1:37 PM

పానీపూరీ తినేందుకు వచ్చిన ఓ యువకుడు వ్యాపారిని నిలువునా ముంచేశాడు.. ముందుగా పానీపూరి కొన్నట్లుగా నటించి వ్యాపారి ఖాతాను ఖాళీ చేసేశాడు..పక్కా పథకంతో చోరీకి స్కెచ్‌ వేశాడు చోర్‌గాడు. కానీ, కేటుగాడి ప్లాన్‌ బెడిసి కొట్టింది.. అవగాహనా రహిత్యంతో అతి దారుణంగా పోలీసులకు దొరికిపోయాడు.. ఇప్పుడు ఇక ఖాకీలు పెట్టే చిప్పకూడు తినాల్సి వచ్చింది. ఈ ఘటన బెంగాళూరు పట్టణంలో చోటు చేసుకుంది. తన అతి తెలివితేటలు ప్రదర్శించి పానీపూరి వ్యాపారిని మోసం చేయబోయి..జైలుకు వెళ్లాడు. అయితే, అపరిచిత వ్యక్తికి ఫోన్ ఇచ్చే ముందు పాస్ వర్డ్ టైప్‌ చేసేముందు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో ఈ ఘటనే నిదర్శనం.

బెంగళూరుకు చెందిన విశాల్ (19) అనే యువకుడు తన స్నేహితులతో కలిసి పానీపూరి తినేందుకు వెళ్లాడు.. కొల్లేగాల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రోడ్డులో ఉన్న లోకేష్ పానీపూరీ దుకాణానికి వెళ్లి తన స్నేహితులతో కలిసి మూడు ప్లేట్ల పానీపూరీ తిన్నాడు. సదరు వ్యాపారి ఫోన్ తీసుకుని డబ్బు చెల్లిస్తానని చెప్పి వేరొకరికి ఫోన్ చేశాడు. డబ్బులు పంపించి ఒక్కసారి చెక్ చేసుకోమని చెప్పాడు.. ఈ క్రమంలోనే వ్యాపారి తన ఫోన్ పే ఓపెన్ చేస్తుండగా పాస్ వర్డ్ చూసుకున్నాడు.

కొంత సేపటి తర్వాత తన ఫోన్‌లో సర్వర్‌ సమస్య వచ్చిందని, చెక్‌ చేసుకునేందుకు మీ ఫోన్‌ ఒకసారి ఇస్తారని అడిగాడు.. వ్యాపారి ఫోన్‌ తీసుకున్న కేటుగాడు..అతని ఖాతాకు 30 వేలు పంపి 120 రూపాయలు చెల్లించాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో భయాందోళనకు గురైన వ్యాపారి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. ఈ నెల 11న కేసు నమోదు చేశారు. అనంతరం చామరాజనగర్‌ సీఈఎన్‌ స్టేషన్‌ పీఐ ఆనంద్‌, అతని బృందం ఆపరేషన్‌ నిర్వహించి ఖదీమ్‌ నుంచి రూ.30 వేలు దోపిడీ చేసిన నిందితుడు విశాల్‌ను అదుపులోకి తీసుకున్ని విషయం మొత్తం కక్కించారు. దీంతో కేసుకు సుఖాంతం అయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..