Rahul Gandhi: రాహల్ విమానానికి అనుమతి నిరాకరించారా?.. వారణాసి ఎయిర్‌పోర్ట్ అధికారుల వివరణ ఇది..
విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరించారని కాంగ్రెస్ ఆరోపించగా.. దానిని విమానాశ్రయ అధికారులు ఖండించారు. అయితే రాహుల్ గాంధీ రాకపై ఎలాంటి ముందస్తు సమాచారం లేదని వారణాసి విమానాశ్రయ డైరెక్టర్ ఆర్యమ సన్యాల్ పిటిఐకి తెలిపారు.

రాహుల్ గాంధీ కాంమెట్స్‌కు విమానాశ్రయ అధికారులు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ విమానానికి సోమవారం అర్థరాత్రి లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరించారని కాంగ్రెస్ ఆరోపించగా.. దానిని విమానాశ్రయ అధికారులు ఖండించారు. అయితే రాహుల్ గాంధీ రాకపై ఎలాంటి ముందస్తు సమాచారం లేదని వారణాసి విమానాశ్రయ డైరెక్టర్ ఆర్యమ సన్యాల్ పిటిఐకి తెలిపారు. గాంధీ విమానాన్ని ల్యాండింగ్ చేసేందుకు అనుమతి నిరాకరించారనే ఆరోపణలను డైరెక్టర్ ఖండించారు. ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యే ప్లాన్ క్యాన్సిల్ అయిందని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కి చెప్పామని సన్యాల్ తెలిపారు. రాహుల్ స్వయంగా వారణాసికి వెళ్లడాన్ని రద్దు చేసుకున్నారు. అతని చార్టర్డ్ ఎయిర్‌లైన్ గత రాత్రి వారణాసి విమానాశ్రయానికి వారి రద్దు గురించి తెలియజేశారు.
ఇదిలావుంటే, మాజీ కాంగ్రెస్ చీఫ్ మంగళవారం కమల నెహ్రూ మెమోరియల్ హాస్పిటల్‌లో జరిగే కార్యక్రమంలో ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించాల్సి ఉందని రాయ్ తెలిపారు.కేరళలోని వాయనాడ్ నుంచి తిరిగి వస్తుండగా ఇక్కడి బాబత్ విమానాశ్రయంలో రాహుల్ గాంధీ విమానం దిగాల్సి ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ రాయ్ మంగళవారం ఆరోపించారు. తాను, ఇతర పార్టీ నాయకులు తమ నాయకుడిని రిసీవ్ చేసుకోవడానికి విమానాశ్రయంలో ఉన్నామని.. అయితే “చివరి నిమిషంలో” రాహుల్ విమానాన్ని ల్యాండ్ చేయడానికి అనుమతించలేదని రాయ్ ఆరోపించారు. ఆ తర్వాత గాంధీ దేశ రాజధానికి తిరిగి వెళ్లిపోయారని తెలిపారు.
రాహుల్ గాంధీ వారణాసి పర్యటనను కేంద్రం అడ్డుకుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించించిన సంగతి తెలిపిందే. వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్ పోర్టులో ఆయన ఫ్లైట్ ల్యాండ్ కాకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని ఆరోపించింది. కేంద్ర పెద్దల ఒత్తిడి కారణంగానే ఎయిర్ పోర్టు అధికారులు ఫ్లైట్ ల్యాండింగ్ కు అనుమతించలేదని కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ విమర్శించారు. భారత్ జోడో యాత్ర చేసిన నాటి నుంచి ప్రధాని మోడీలో ఆందోళన మొదలైందని, అందుకే ఇప్పుడు రాహుల్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ భయం కారణంగానే బీజేపీ ప్రభుత్వం రాహుల్ ఫ్లైట్ను అనుమతించకుండా అడ్డుకున్నారని విమర్శించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం