- Telugu News Photo Gallery Animal lovers all over the country saying No to Valentines Day and Yes to Cow Hug Day
Cow Hug Day: వాలెంటైన్స్ డే వద్దు.. కౌ హగ్ డే ముద్దు..! దేశవ్యాప్తంగా జంతుప్రేమికుల సందడి
మనుషులు, జంతువుల మధ్య అనుబంధాన్ని పెంచడానికి, ప్రకృతితో మమేకం కావడానికి కౌ హగ్ డేను పాటిస్తున్నారు జంతు ప్రేమికులు. గోవును హత్తుకోవడం వల్ల ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది.
Phani CH |
Updated on: Feb 14, 2023 | 1:09 PM

మనుషులు, జంతువుల మధ్య అనుబంధాన్ని పెంచడానికి, ప్రకృతితో మమేకం కావడానికి కౌ హగ్ డేను పాటిస్తున్నారు జంతు ప్రేమికులు. గోవును హత్తుకోవడం వల్ల ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. అది ఓ థెరపీలా పని చేస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు.

గోవు ప్రేమికులంతా వాలెంటైన్స్ డే బదులు కౌ హగ్ డేగా జరుపుకోవాలని కేంద్రం ప్రకటించి వెనక్కు తగ్గిన సంగతి తెలిసిందే. మమతా బెనర్జీ వంటి నేతలు, విపక్షాలు విరుచుకుపడటంతో ఆపై ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

ప్రశాంతంగా గోశాలకు వచ్చి, గోవుల్ని హత్తుకొని... మనసు కుదుట పరుచుకుని వెళ్లండంటున్నారు గోశాలల యజమానులు. గోవుల్ని హత్తుకోవడం వల్ల ఒంటరితనం, దిగులు లాంటివి తగ్గుతున్నాయని చెబుతున్నారు వాళ్లు.

నెదర్లాండ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో గోవులను హత్తుకునే ఆచారం దశాబ్దాలుగా కొనసాగుతోంది. డచ్ ప్రావిన్స్‌లో చాలా కాలం క్రితమే ఈ విధానాన్ని ప్రారంభించారు.

కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తిలో 600 పుంగనూరు ఆవులతో కౌ హగ్ థెరపీని నిర్వహిస్తున్నారు. నాడిపతి రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వాహకులు డా.కృష్ణంరాజు ఆధ్వర్యంలో జరిగే ఈ థెరపీకి పెద్ద ఎత్తున జంతు ప్రేమికులు హాజరై ఆవులను హగ్ చేసుకుంటున్నారు.

హైదరాబాద్ తార్నాక డివిజన్ మానికేశ్వరి నగర్‌లో గోమాతను హగ్ చేసుకున్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య. గోమాతను పూజించాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కావ్య.

హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్‌లో గో హగ్ డేను ఘనంగా నిర్వహించారు. ప్రేమికుల దినోత్సవం వద్దు..గో హగ్ డే ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఆవుల ఆత్మీయ ఆలింగనమే మన సంస్కృతి అంటున్నారు గోరక్షకులు.

కౌ హగ్ డేను పురస్కరించుకుని తిరుపతిలఆవును ఆలింగనం చేసుకున్నారు బీజేపీ నేతలు. గీతాంజలి స్కూల్ లో గో మాతకు పూజలు చేసిన టిటిడి బోర్డు సభ్యుడు మురం శెట్టి రాములు..గో విశిష్టతను విద్యార్థులకు వివరించారు.

వాలెంటెయిన్స్ డేను కాదని కౌ హగ్ డేను పాటించాలన్న నిర్ణయం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ ట్యాంక్ బండ్ గోశాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు.





























