Kuno National Park: భారత్‌కు మరో 12 చిరుతలు.. కునో నేషనల్ పార్క్‌లో నెల రోజుల పాటు క్వారంటైన్
దక్షిణ ఆఫ్రికా నుంచి 12 చిరుతలను మన దేశానికి తీసుకురావడానికి IAF C-17 ఎయిర్ క్రాఫ్ట్ ఈ రోజు ఉదయం హిండన్ ఎయిర్‌బేస్ నుండి బయలుదేరింది. ఈ చిరుతల తరలింపు కోసం IAF ఎటువంటి మొత్తాన్ని వసూలు చేయడం లేదు. రేపు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మంత్రి భూపేంద్ర యాదవ్ లు కునో నేషనల్ పార్క్‌లో చిరుతలను విడుదల చేస్తారు.
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చిరుత పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18న దక్షిణాఫ్రికా నుంచి రెండో బ్యాచ్ చీతాలు భారత్‌కు రానున్నాయి. మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కుకు పన్నెండు చిరుతలను రప్పిస్తున్నామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి చిరుతలు రవాణా చేయడానికి జనవరిలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇరుదేశాలు అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. భారత్ కు చేరుకున్న అనంతరం ఈ 12 చిరుతపులలను నిబంధనల ప్రకారం వాటిని నెలరోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచనున్నారు. ఈ చిరుతలు ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఇతర జంతువులకు వ్యాపించకుండా ముందు జాగ్రత్తలు తీసుకోనున్నామని చెప్పారు. ఇతర జంతువులకు దూరంగా ఒక నెల రోజుల పాటు ఈ చిరుతలు విద్యుత్ ఎన్‌క్లోజర్‌లో ఉంచుతారు.
“దక్షిణ ఆఫ్రికా నుంచి 12 చిరుతలను మన దేశానికి తీసుకురావడానికి IAF C-17 ఎయిర్ క్రాఫ్ట్ ఈ రోజు ఉదయం హిండన్ ఎయిర్‌బేస్ నుండి బయలుదేరింది. ఈ చిరుతల తరలింపు కోసం IAF ఎటువంటి మొత్తాన్ని వసూలు చేయడం లేదు. రేపు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మంత్రి భూపేంద్ర యాదవ్ లు కునో నేషనల్ పార్క్‌లో చిరుతలను విడుదల చేస్తారు.
త ఏడాది సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 72వ పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లోని నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చిరుతలతో కూడిన తొలి బ్యాచ్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎనిమిది చిరుతల్లో ఐదు ఆడ, మూడు మగ చిరుతలు. ఇవి ప్రస్తుతం కేఎన్‌పీలోని ఎన్‌క్లోజర్‌లో ఉన్నాయని.. చాలా ఆరోగ్యంగా ఉన్నాయని అధికారులు చెప్పారు. అయితే వీటిల్లో ఒకదానికి క్రియాటినిన్ స్థాయిలు పెరిగి అస్వస్థతకు గురైంది. చికిత్స అనంతరం ఆ చిరుత కోలుకుందని చెప్పారు. ప్రస్తుతం అన్ని చిరుతలు కునో నేషనల్ పార్క్‌లోని తమ పరిసరాలకు బాగా అలవాటు పడ్డాయి అని వైల్డ్‌లైఫ్ డిజి ఎస్‌పి యాదవ్ తెలిపారు.
భారతదేశంలో వేట అధికమై.. అనేక చిరుత జాతులు అంతరించిపోయాయి. దీంతో దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత చిరుతలను మళ్లీ దేశానికి పరిచయం చేస్తున్నారు. దేశంలోని చివరి చిరుత 1947లో ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో మరణించింది. ఈ జాతి 1952లో భారతదేశం నుండి అంతరించిపోయినట్లు ప్రకటించబడింది
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..