Lord Shiva: శివ శివా ఇదేంటయ్యా.. ఆరవ ద్వాదశ జ్యోతిర్లింగంమాదే అంటూ నీకోసం తగవుపడుతున్న రెండు రాష్ట్రాలు..
హిందువులు శివుడిని మూర్తి రూపంతోపాటు లింగరూపంలోను పూజిస్తారు. అయితే మూర్తి రూపంకన్నా లింగ రూపమే ప్రధానమైనదిగా విశ్వసిస్తారు. లింగంలో కైలాసనాథుడి స్వరూపం వెలుగుతుంటుందని భక్తుల నమ్మకం. భూమ్మీద మొత్తం 64 జ్యోతిర్లింగాలు ఉన్నాయని శైవులు విశ్వసిస్తారు.
శివరాత్రి పండుగ పూట..ఆ శివుడికే తలబొప్పి కట్టే వివాదం రాజుకుంది.. భీమశంకరుడు మావాడంటే మావాడని.. అసోం, మహారాష్ట్ర ప్రభుత్వాలు రచ్చకెక్కాయి.. 12 ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఆరవ ద్వాదశ జ్యోతిర్లింగంపైనే ఈ గొడవంతా.. భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోనే ఉందని ఓ వాదన. కాదు అసోం శివుడే భీమశంకరుడని అసోం సీఎం అభిప్రాయం. ఏది నిజం..ఎవరు చెప్పేది వాస్తవం. ఆరవ జ్యోతిర్లింగం తమ రాష్ట్రంలోనే ఉందంటూ అస్సాం ప్రభుత్వం చేసిన ప్రకటనపై మహారాష్ట్ర కారాలు మిరియాలు నూరుతోంది. హిందువులు శివుడిని మూర్తి రూపంతోపాటు లింగరూపంలోను పూజిస్తారు. అయితే మూర్తి రూపంకన్నా లింగ రూపమే ప్రధానమైనదిగా విశ్వసిస్తారు. లింగంలో కైలాసనాథుడి స్వరూపం వెలుగుతుంటుందని భక్తుల నమ్మకం. భూమ్మీద మొత్తం 64 జ్యోతిర్లింగాలు ఉన్నాయని శైవులు విశ్వసిస్తారు. అయితే ద్వాదశ జ్యోతిర్లింగాలుగా పిలువబడే 12 లింగాలు పరమ పవిత్రమైనవిగా భావిస్తారు. వివిధ ప్రదేశాలలో వెలసిన ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒక్కోచోట ఒక్కో పేరుతో పిలుచుకుంటారు. ఇవన్నీ మహాశివుని భిన్న రూపాలుగా భక్తులు కొలుస్తారు. మల్లికార్జునుడు(శ్రీశైల క్షేత్రం), సోమనాథేశ్వరుడు(గిర్, గుజరాత్), మహాకాళేశ్వరుడు (ఉజ్జయిన్, యుపి), ఓంకారేశ్వరుడు (మధ్యప్రదేశ్), కేదార్‌నాథ్(ఉత్తరాఖండ్), భీమశంకరం(పుణె, మహారాష్ట్ర), కాశీ విశ్వనాథుడు(వారణాసి, యుపి), త్రయంబకేశ్వర్(నాసిక్, మహారాష్ట్ర), బైద్యనాథ్(దేవ్‌ఘర్, జార్ఖండ్), నాగేశ్వర(వ్వారక, గుజరాత్), రామనాథస్వామి(రామేశ్వరం), ఘృష్ణేశ్వర్ (ఔరంగాబాద్, మహారాష్ట్ర) ఉన్నాయి.
కాకపోతే..మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా గువాహటిలోని పమోహి వద్ద డాకిని పర్వతాలపై వెలసిన భీమశంకర జ్యోతిర్లింగాన్ని భక్తులు సందర్శించాలని ఆహ్వానిస్తూ అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వ శర్మ యాడ్స్ ఇచ్చారు..మహారాష్ట్రలోని కొన్ని పత్రికల్లో సైతం ఈ ప్రకటనలు కనిపించాయి. ఇదే వివాదానికి కారణం.. ఈయాడ్స్‌పై మహారాష్ట్రలోని శివ భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
1/2 Leave aside industries BJP wants to snatch away even Bhagwan Shiv from Maharashtra. Now BJP Assam govt claims that the sixth Jyotirlinga of Bhimashankar is situated in Assam & not in Maharashtra’s Pune district. We strongly condemn this highly preposterous claim. pic.twitter.com/hiSUCTUYRK
— Sachin Sawant सचिन सावंत (@sachin_inc) February 14, 2023
ప్రాచీన గ్రంధాల ప్రకారం మహారాష్ట్రలోని పుణెలో వెలసిన జ్యోతిర్లింగమని ఆలయ ట్రస్టీ, ప్రధాన పూజారి మధుకర్ గవండే స్పష్టం చేశారు. అస్సాం ముఖ్యమంత్రి జారీచేసిన ప్రకటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వివరణ ఇవ్వాలని ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి డిమాండు చేసింది.
భీమేశ్వర ఆలయం భీమా నది ఒడ్డున ఉందని, భీమా నది పుణెలో ఉందని ఎన్‌సిపి ఎంపి అమోల్ కల్హే అన్నారు. మహారాష్ట్రలోని పరిశ్రమలను లాక్కుంటున్న బిజెపి ఇప్పుడు మహారాష్ట్రలోని ఆధ్యాత్మిక సంపదను కూడా కొల్లకొట్టేందుకు నిర్ణయించుకుందని మరో ఎన్‌సిపి ఎంపి సుప్రియా సూలె విమర్శించారు. పరిశ్రమలనే కాక మహారాష్ట్ర నుంచి మహాశివుడిని కూడా చేజిక్కించుకోవాలని బిజెపి భావిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ సావంత్ విమర్శించారు. ఆరవ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పుణెలో కాక అస్సాంలో ఉందని అస్సాం ప్రభుత్వం ప్రకటిస్తోందని, ఈ అసంబద్ధ వాదనను తాము పూర్తిగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు.
అస్సాంలో భీమా నది లేదు, సహ్యాద్రి పర్వతం లేదు, ఎవరు ఏం చెప్పినా అది జరగని పని.. భీమశంకరుడు పూణే జిల్లాలోనే ఉన్నాడని, భీమశంకర్‌లో వచ్చే మహాశివరాత్రికి పెద్ద పండుగ అని శివమహాన్ పురాణంలో రాశారని శైవ భక్తులు చెబుతున్నారు. హిమంత సర్కార్ అస్సాంలోని కామ్రూప్‌కు చెందిన భీమశంకర్‌ను ఆరవ జ్యోతిర్లింగంగా ప్రచారం చేశారు..ఇది చాలా పెద్ద తప్పిదమని..దీనిపై వెంటనే అస్సాం ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలని పలు హిందూ సంఘాలు, శివ భక్తులు డిమాండ్ చేస్తున్నారు. శివరాత్రి పర్వదినం ముందు ఈ గొడవేంటో ఆ శివుడికే తెలియాలి..
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..