Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmamgari Matam: బ్రహ్మంగారి మఠంలో మళ్ళీ వివాదం.. ధ్వజస్తంభ ప్రతిష్టాపన రసాభాస

రెండేళ్లుగా బ్రహ్మంగారి మఠం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయంశంగా మారింది. దీనికి తోడు జనవరి 23న అర్ధరాత్రి ధ్వజస్తంభం తొలగించడంపై మఠంలోని కొందరు శిష్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి ధ్వజస్తంభం తీయకూడదని తెలిసినా ఫిట్ పర్సన్ శంకర బాలాజీ కావాలని తొలగించారు..

Brahmamgari Matam: బ్రహ్మంగారి మఠంలో మళ్ళీ వివాదం.. ధ్వజస్తంభ ప్రతిష్టాపన రసాభాస
Brahmamgari Matham Temple
Follow us
Surya Kala

|

Updated on: Feb 16, 2023 | 6:54 AM

కడప జిల్లా శ్రీవీరబ్రహ్మేంద్ర స్వామి మఠం ఆలయంలో మళ్లీ వివాదం మొదలైంది. ధ్వజస్తంభ ప్రతిష్టాపన రసాభాసగా మారింది. ఎండోమెంట్ శాఖ నియమించిన ఫిట్ పర్సన్ అధికారి మఠం నిబంధనలకు విరుద్ధంగా పాత ధ్వజస్తంభాన్ని తీసివేసి కొత్త దానిని ఏర్పాటు చేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధ్వజస్తంభ ప్రతిష్టాపన కోసం మూడు రోజుల నుంచి జరుగుతున్న ప్రత్యేక పూజ కార్యక్రమాలను దివంగత పీఠాధిపతి భార్య మారుతి మహాలక్ష్మి సహా స్థానికులు అడ్డుకోవడంతో రచ్చ మొదలైంది. పీఠాధిపతి లేకుండా ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేసే హక్కు ఫిట్ ఫర్సన్‌కు లేదన్నది మారుతి మహాలక్ష్మి వాదన

వాస్తవానికి రెండేళ్లుగా బ్రహ్మంగారి మఠం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయంశంగా మారింది. దీనికి తోడు జనవరి 23న అర్ధరాత్రి ధ్వజస్తంభం తొలగించడంపై మఠంలోని కొందరు శిష్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి ధ్వజస్తంభం తీయకూడదని తెలిసినా ఫిట్ పర్సన్ శంకర బాలాజీ కావాలని తొలగించారు, బ్రహ్మంగారి మఠం గురుపత్నికి కనీసం సమాచారం ఇవ్వలేదంటూ శిష్యులు, భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై మఠానికి సంబంధించిన వెంకటాద్రి స్వామి, వీరభద్రయ్య స్వామి నోరు మెదపకపోవడంపై భక్తుల మధ్య చర్చకు దారితీసింది. వందల ఏళ్ల నాడు ధ్వజస్తంభం ప్రతిష్టంచే సమయంలో బంగారం, వెండి, వజ్ర వైడూర్యాలు వేయడం ఆచారం, వీటి కోసమే ఫిట్ పర్సన్ అర్ధరాత్రి తొలగించారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు, దివంగత మఠాధిపతి కొడుకులు, గురుపత్నికి సమాచారం లేదు.

ధ్వజస్తంభం శిథిలావస్థలో ఉంది, అందుకే కొత్తది ఏర్పాటు చేసేందుకు ఎండోమెంట్ కమీషనర్ అనుమతులు ఇచ్చినట్లు ఫిట్ పర్సన్ చెప్తున్నారు. ఈ విషయంపై మారుతి మహాలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు మఠానికి సంబంధించిన బిల్లులు, జీతాల చెల్లింపులకు మాత్రమే అధికారం ఉంది. ఆధ్యాత్మికంలో అధికారం లేకున్నా కావాలనే ధ్వజస్తంభాన్నిప్రతిష్ట కార్యక్రమం చేపట్టారని ఆరోపిస్తున్నారు. ఇవాళ జరగబోయే ధ్వజస్తంభ ప్రతిష్ట గురించి మాతో చర్చించలేదంటున్నారు. తానే స్వయంగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని అంటున్నారు మారుతి మహాలక్ష్మి.

ఇవి కూడా చదవండి

ఫిట్ పర్సన్ శంకర బాలాజి మాత్రం మరో వర్షన్ వినిపిస్తున్నారు. బ్రహ్మంగారి మఠం విషయంలో పిఠాధిపతి రెండో ధర్మపత్ని మారుతీ మహాలక్ష్మమ్మ కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆటంకాలు కలిగిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. మహాలక్ష్మమ్మ మఠం పరువు తీస్తున్నారు. ఆమె సమీప బంధవు పాలెపు శ్రీనివాసులు ప్రోత్సాహంతో మఠం ప్రతిష్ట దిగజార్చుతున్నారని మండిపడుతున్నారు. ధ్వజస్తంభం కూలిపోయింది కాబట్టే కొత్తది పెడుతున్నాం, మూడేళ్ల క్రితం పీఠాధిపతి ఉన్నప్పుడే తంబళ్ళపల్లె గ్రామస్తులు కొత్త ధ్వజస్తంభం ఇచ్చి ఉన్నారని శంకర బాలాజీ వివరిస్తున్నారు. ఇప్పటికే అనేక వివాదాలు, కోర్టు డైరెక్షన్‌లో నడుస్తున్న మఠంలో ఇవాళ ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..