Pan Leaf Farmers: రైతన్న కంటతడి పెట్టిస్తోన్న తమలపాకు.. అర్ధాకలితో అలమటిస్తున్న తమలపాకు రైతులు

పూజకైనా.. పెండ్లికైనా.. ఆ ఆకు లేనిదే పని జరగదు. తమలపాకు తాంబూలం పవిత్రంగా భావిస్తుంటారు. అంతేకాదు ఆ ఆరోగ్య సమస్యలకు కూడా చక్కటి పరిష్కారం. ఇప్పటికీ చాలామంది భోజనం తర్వాత తమలపాకు నమలడం మాత్రం మరిచిపోరు. కానీ ఆ తమలపాకు సాగుపై ఆధారపడి ఆ గ్రామాల రైతులకు ఇప్పుడు కష్టం వచ్చి పడింది

Pan Leaf Farmers: రైతన్న కంటతడి పెట్టిస్తోన్న తమలపాకు.. అర్ధాకలితో అలమటిస్తున్న తమలపాకు రైతులు
Betel Leaf Farmers
Follow us
Surya Kala

|

Updated on: Feb 11, 2023 | 8:47 AM

ఆ ప్రాంతం నుంచి దేశం నలుమూలల తమలపాకు రవాణా అవుతుంది. తరతరాలుగా తమలపాకు పంటె వాళ్ళ జీవనాధారం. ఇష్టదైవంతో సమానంగా ఆ సాగు చేస్తూ ఉంటారు అక్కడే రైతులు. కిల్లి తో నోరు పండితే చాలు కడుపు నిండినంత ఆనందం వారిది. కానీ ఇప్పుడు వాళ్లకే కష్టం వచ్చి పడింది. గిట్టుబాటు ధరకు తోడు తెగుళ్లు తమలపాకు రైతన్న కంటతడి పెట్టిస్తోంది. దీంతో ఇటు సాగు వదులుకోలేక.. అటు వేరే వృత్తి చేసుకోలేక అర్ధాకలితో అలమటిస్తున్నారు తమలపాకు రైతులు.

పూజకైనా.. పెండ్లికైనా.. ఆ ఆకు లేనిదే పని జరగదు. తమలపాకు తాంబూలం పవిత్రంగా భావిస్తుంటారు. అంతేకాదు ఆ ఆరోగ్య సమస్యలకు కూడా చక్కటి పరిష్కారం. ఇప్పటికీ చాలామంది భోజనం తర్వాత తమలపాకు నమలడం మాత్రం మరిచిపోరు. కానీ ఆ తమలపాకు సాగుపై ఆధారపడి ఆ గ్రామాల రైతులకు ఇప్పుడు కష్టం వచ్చి పడింది. గిట్టుబాటు ధర లేకపోవడం, కోతుల బెడద సరే సరి.. ఇప్పుడు తెగులు ఈ సీజన్లో రైతుల కంటతడి పెట్టిస్తుంది.

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం లో సాగు అయిన తమలపాకు అంటే దేశంలోనే చాలా రాష్ట్రంలో ప్రసిద్ధి. ఎక్కడ ఎంత పంట పడినా పాయకరావుపేటలోని తమలపాకు కు ఉండే డిమాండ్ వేరు. అట్లకోట, మంగవరం, సత్యవరం, మాసాపేట, రాంబద్రపురం గ్రామాల్లో సుమారు 4వేల ఎకరాల్లో తమలపాకు సాగు జరుగుతుంది. 70వ దశకంలో ఇక్కడ ఆ సాగు ప్రారంభమైంది. కొద్ది కాలానికి ఇక్కడ రైతులు గుంటూరు జిల్లాకు పొన్నూరు వలస వెళ్లారు. అక్కడ కూడా తమలపాకు సాగు చేసి సొంత గ్రామం పై ప్రేమతో తిరిగి ఆయా గ్రామాలకు వచ్చేసారు. అప్పటి నుంచి నిర్విరామంగా తమలపాకు పంట సాగు చేస్తూ…. జీవనం సాగిస్తున్నారు ఇక్కడ రైతులు.

ఇవి కూడా చదవండి

పాయకరావుపేట మండలంలో సాగైన ఈ తమలపాకులు… అత్యధికంగా మహారాష్ట్రకు వెళుతుంది. దేశమా అనే వివిధ రాష్ట్రాలకు కూడా ఇక్కడే పంట రవాణా అవుతుంది. దీంతో పంటకు మంచి రేటు రావడంతో ఎకారాకు 2వేల వరకు మోదా కట్టలు దిగుబడి వచ్చేవి. వాడికి ఎగుమతి చేసి వచ్చే రాబడితో పొట్ట పోసుకునేవారు ఇక్కడే రైతులు. ఆశించిన స్థాయి కంటే లాభాలు కూడా వస్తూ ఉండటంతో ఆ పండవైపు మొగ్గు చూపారు. ఆ తర్వాత కాలంలో పంటకు తెగులు వారిని కష్టాల్లో కి నట్టేసింది. దిగుబడి రానురాను తగ్గిపోయింది. అయినా ఇక్కడ రైతులు తమలపాకు పంటలు వదలలేదు. ఏ స్థాయికి దిగబడి పడిపోయింది అంటే.. ఎకరాకు కనీసం 200 కట్టల కూడా రావడంలేదని వాబోతున్నారు ఇక్కడ రైతులు.

ప్రతి ఏటా ఏడాది చివరికి వచ్చేసరికి వారి దిగులు మరింత పెరుగుతుంది. ఎందుకంటే అక్కడ నుంచి పంటకు తెగులు ప్రారంభమవుతుంది. ఏడది అంతా పంట ఎపుగా పెరిగిన.. డిసెంబర్ నుంచి మొదలైన తెగులు మూడు నాలుగు నెలలపాటు కొనసాగుతుంది. దిగుబడి రాక… గిట్టుబాటు లేక నష్టపోతున్నారు రైతులు. దీనికి తోడు కోతుల బడదా వీరిని వెంటాడుతోంది. రవాణా చార్జీలో సైతం పెరిగిపోవడంతో దిగుమతి రాక అప్పులు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని వాపుతున్నారు రైతులు. వేరే పంట వేసుకునే చేతకాక.. వలసల వైపు చూస్తున్నారు. తర తరాలుగా ఉన్న ఈ తమలపాకుల సాగు… కొనసాగాలంటే, తమ ఆకలి బాధలు తిరలంటే ప్రభుత్వం తమపై కనికరం చూపాలని కోరుతున్నారు ఇక్కడి రైతాంగం. అధికారులు ఈ రైతుల గోడ విని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Reporter: Khaja

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే