AP CM Jagan: త్వరలో విశాఖకు రాజధాని తరలింపు.. బీచ్ రోడ్డులో సీఎం జగన్ అధికారిక నివాసం..!

Surya Kala

Surya Kala |

Updated on: Feb 07, 2023 | 8:34 AM

సీఎం జగన్‌ మోహన్ రెడ్డి సహా పలువురు మంత్రులు సైతం కొంతకాలంగా విశాఖ వేదికగా పాలన చేపట్టనున్నామని చెబుతూ వస్తున్నారు. అయితే రాజధాని తరలింపుపై అధికారికంగా ప్రకటన వెలువడనప్పటికీ.. ప్రభుత్వ పెద్దల నుంచి మాత్రం అధికారులకు ఆదేశాలను ఇస్తున్నట్లు సమాచారం. 

AP CM Jagan: త్వరలో విశాఖకు రాజధాని తరలింపు.. బీచ్ రోడ్డులో సీఎం జగన్ అధికారిక నివాసం..!
Cm Jagan
Follow us

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని అమరావతి పై రగడ కొనసాగుతూనే ఉంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి.. సీఎంగా జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన అనంతరం.. ఏపీకి మూడు రాజధానులని ప్రకటించింది.. అమరావతి, కర్నూలు, విశాఖ పట్నంలను ఏపీ రాజధానులుగా ప్రకటించింది. తాజాగా మరో అడుగు ముందుకేసి వైసీపీ సర్కార్ తన పాలనను విశాఖకు తరలించడానికి రంగం సిద్ధం చేస్తోంది. రాజధాని తరలింపు పనులను వేగవంతం చేసింది. ఇప్పటికే రాజధానిని విశాఖకు తరలిస్తున్నామని.. అక్కడ నుంచే తాను త్వరలో పాలన చేపట్టనున్నామని ఇటీవల సీఎం జగన్ దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో  స్థానిక జిల్లా యంత్రాంగం తరలింపుపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

సీఎం జగన్‌ మోహన్ రెడ్డి సహా పలువురు మంత్రులు సైతం కొంతకాలంగా విశాఖ వేదికగా పాలన చేపట్టనున్నామని చెబుతూ వస్తున్నారు. అయితే రాజధాని తరలింపుపై అధికారికంగా ప్రకటన వెలువడనప్పటికీ.. ప్రభుత్వ పెద్దల నుంచి మాత్రం అధికారులకు ఆదేశాలను ఇస్తున్నట్లు సమాచారం.  దీంతో అధికారులు ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాసానికి అనువుగా ఉండే ప్రాంతాన్ని ఇప్పటికే నిర్ణయించినట్లు.. బీచ్ రోడ్ లో అనువైన ఇంటికోసం అధికారులు సీక్రెట్ గా వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంవీపీ న్యాయ విద్యా పరిషత్తు పక్క నుంచి రోడ్డుని వెడల్పు చేయడం కోసం పనులు చేపట్టారు. దీంతో ఇక్కడే పక్కాగా సీఎం ఇల్లు ఉండనుందని టాక్ వినిపిస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే.. వచ్చే నెలలో సీఎం నివాసం విశాఖకు మార్చనున్నారట.. మార్చి 22, 23 తేదీల్లో ముఖ్యమంత్రి గృహ ప్రవేశం ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయాన్నీ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu