Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆర్జిత సేవ టికెట్లు లక్కీ డిప్ ద్వారా కేటాయింపు.. బుక్ చేసుకోండి ఇలా..

ఫిబ్రవరి నెలోని 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ ఆర్జిత సేవా టికెట్లను లక్కీ డిప్ ద్వారా కేటాయించనున్నారు. ఈ మేరకు ఈ తేదీలకు సంబంధించిన ఆర్జిత సేవా లక్కీ డిప్ టిక్కెట్లు ఈనెల 8వ తేదీ ఉదయం 10 గంటలనుంచి 10వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చనని టీటీడీ పేర్కొంది

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆర్జిత సేవ టికెట్లు లక్కీ డిప్ ద్వారా కేటాయింపు.. బుక్ చేసుకోండి ఇలా..
Tirumala Rush
Follow us
Surya Kala

|

Updated on: Feb 08, 2023 | 8:44 AM

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటను రిలీజ్ చేయనుంది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు టీటీడీ అందుబాటులో ఉంచనుంది. ఫిబ్రవరి నెలోని 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ ఆర్జిత సేవా టికెట్లను లక్కీ డిప్ ద్వారా కేటాయించనున్నారు. ఈ మేరకు ఆర్జిత సేవా లక్కీ డిప్ టిక్కెట్లు ఈనెల 8వ తేదీ ఉదయం 10 గంటలనుంచి 10వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చనని టీటీడీ పేర్కొంది. అనంతరం ఈ టికెట్లను ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా భక్తులకు కేటాయించనున్నారు. అలాగే అదే తేదిల ఆర్జిత సేవా టిక్కెట్లు ఈనెల 08 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అందుబాటులో ఉంచనున్నారు.

వీటితో పాటు క‌ల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజ‌ల్‌సేవ‌, సహస్ర దీపాలంకరణ తదితర వర్చువల్ సేవల దర్శన కోటా టికెట్లను  ఈనెల 09వ తేదీ ఉదయం 10 గంటలనుంచి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయనున్నారు. . భ‌క్తులు ఆన్‌లైన్‌లో శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల‌ను బుక్ చేసుకోవాల‌ని టీటీడీ సూచించింది. అధికారిక వెబ్‌సైట్‌ https://ttdsevaonline.com లో సందర్శించి బుక్‌ చేసుకోవచ్చునని టీటీడీ తెలిపింది.

ఇవి కూడా చదవండి

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శ్రీవారికి మరోసారి రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. శ్రీవారి సర్వ సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. కాగా సోమవారం తిరుమల శ్రీవారిని 71,496 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,908 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.33 కోట్లు వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..