Magha Purnima 2023: మాఘ పూర్ణిమన రవి పుష్య యోగం.. రేపు చేసే నదీస్నానానికి, దానానికి విశిష్ట ఫలం.. రెట్టింపు లాభం

ఈ ఏడాది మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 5వ తేదీన వచ్చింది. అంతేకాదు రేపు రవి పుష్య యోగం ఏర్పడింది. ఈ యోగం ఉదయం 07:07 నుండి మధ్యాహ్నం 12:13 వరకు ఉంటుంది.

Magha Purnima 2023: మాఘ పూర్ణిమన రవి పుష్య యోగం.. రేపు చేసే నదీస్నానానికి, దానానికి విశిష్ట ఫలం.. రెట్టింపు లాభం
Magha Purnima
Follow us

|

Updated on: Feb 04, 2023 | 1:07 PM

హిందూ క్యాలెండర్ ప్రకారం.. ప్రతి నెలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మాసాన్ని , వాతావరణాన్ని అనుసరిస్తూ..  పూజ, పారాయణం, దానధర్మాలు ఉంటాయి. తెలుగు క్యాలెండర్ ప్రకారం..  మాఘ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మాఘ పూర్ణిమ అంటారు. ఈ ఏడాది మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 5వ తేదీన వచ్చింది. అంతేకాదు రేపు రవి పుష్య యోగం ఏర్పడింది. ఈ యోగం ఉదయం 07:07 నుండి మధ్యాహ్నం 12:13 వరకు ఉంటుంది. మతపరంగా మాత్రమే కాదు.. ఆధ్యాత్మిక దృక్కోణంలో కూడా మాఘ పూర్ణిమకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.  అంతేకాదు ఈరోజున చేసే స్నానం, దానం, పూజ ఫలవంతంగా పరిగణించబడుతుంది. ఈ నేపథ్యంలో మాఘ పూర్ణిమ ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.

మాఘ పూర్ణిమ తిథి హిందూ పంచాంగం ప్రకారం.. మాఘ మాసం పౌర్ణమి తిథి..  ఫిబ్రవరి 4వ తేదీ రాత్రి 09:29 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 5వ తేదీ రాత్రి 11:58 వరకు ఉంటుంది. సనాతన ధర్మం ప్రకారం.. పగలు తిథిని పరిగణలోకి తీసుకుని మాఘ పూర్ణిమ 5 ఫిబ్రవరి 2023న  జరుపుకుంటారు.

మాఘ పూర్ణిమ ప్రాముఖ్యత సనాతన ధర్మం ప్రకారం మాఘమాసంలో స్నానం, ధ్యానం, పూజలు చేయడం వల్ల విష్ణువు చాలా సంతోషిస్తాడు. సాధకుడు ఆనందం, సంపద, సంతానం, మోక్షాన్ని పొందుతాడు. హిందూ పంచాంగం ప్రకారం..మాఘ మాసానికి మాఘ నక్షత్రం పేరు పెట్టారు. పురాణాల  ప్రకారం.. మహావిష్ణువు మాఘ పూర్ణిమ తిథి రోజున గంగాజలంలో నివసిస్తాడు. దేవతలు, దేవతలందరూ భూమిపై మానవ రూపం దాల్చి, స్నానం చేసి, పూజలు చేసి, ప్రయాగరాజ్ సంగమం వద్ద దానధర్మాలు చేస్తారు. ఈ కారణంగానే మాఘమాసంలో కల్పవచనం చేయడం, మాఘ పూర్ణిమ నాడు గంగాస్నానం చేయడం వల్ల అన్ని రకాల కోరికలు నెరవేరి మోక్షప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. మాఘ పూర్ణిమ రోజున నది స్నానం చేసి దానం చేయడంతోపాటు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమః’ అని జపిస్తూ ఉండాలి.

ఇవి కూడా చదవండి

మాఘ పూర్ణిమ వ్రతం, పూజ  ప్రాముఖ్యత మాఘ పూర్ణిమ రోజున నది స్నానం, దానధర్మాలు, మతపరమైన ఆచారాలు, ఉపవాసం, జపం చేసే సంప్రదాయం ఉంది. ఈ రోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేయడం, పూర్వీకులకు తర్పణం ఇవ్వడం.. వారి పేరుతొ దానం చేయడం నిరుపేదల ఆకలి తీర్చడం అత్యంత ఫల ప్రదం. మాఘ పూర్ణిమరోజున వ్రతమాచరించి.. దానధర్మాలు చేస్తే.. విష్ణువు, లక్ష్మిదేవిల అనుగ్రహం కలుగుతుంది. వీరి  ఆశీర్వాదబలంతో కోరిన కోర్కెలు నెరవేరుతాయి.

మాఘ పూర్ణిమ రోజున.. సూర్యోదయానికి ముందే నిద్రలేచి, పవిత్ర నదిలో స్నానమాచరించండి. అనంతరం సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి.. విష్ణువు మంత్రాలను నిరంతరం జపించండి. కొంతసేపు ధ్యానం చేయండి. పేదవారికి, బ్రాహ్మణులకు అన్నదానం చేసి దానధర్మాలు చేయండి. మాఘ పూర్ణిమ నాడు గ్రహ దోషాల నివారణ కోసం పూర్వీకులను తలచుకుంటూ పేద బ్రాహ్మణుడికి లేదా ఆకలి అన్నవారికి దానం ఇవ్వండి. అంతేకాదు రేపు తప్పనిసరిగా నల్ల నువ్వులను దానం చేయండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)