Horoscope Today: ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. ఇంట్లో శుభకార్యం.. శనివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?
ఆర్థిక లావాదేవీలు వల్ల కొన్ని మంచి ప్రయోజ నాలు అనుభవానికి వస్తాయి. కొందరు మిత్రు లను నమ్మి మోసపోయే అవకాశం ఉంది. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
కొన్ని ప్రయత్నాలు సఫలం అవుతాయి. అశ్విని, భరణి నక్షత్రాల వారు అనుకున్నవి సాధిస్తారు. ఆర్థికంగా కొద్ది కొద్దిగా పురోగతి చెందుతారు. తొందరపడి నిర్ణయాలు మార్చుకోవద్దు. ఉద్యోగంలో లక్ష్యాలు పెరుగుతాయి. అధికారులు మీ మీద అతిగా ఆధారపడటం జరుగుతుంది. కుటుంబ పరంగా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు చేతికి అందిస్తుంది. కొన్ని ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెడతారు. వృత్తి ఉద్యోగాల్లో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు ఉంటాయి. రోహిణి నక్షత్రం వారు మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించుకుంటారు. వ్యాపార రంగంలోని వారు కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆర్ద్ర, పునర్వసు నక్షత్రాల వారు శుభవార్త వింటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. కొందరు సన్నిహితులకు అండగా నిలబడతారు. ఉద్యోగంలో అనుకోకుండా మేలు జరుగుతుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి నిపుణులు బాగా బిజీ అయిపోతారు. ఇతరుల ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితులు చాలావరకు చక్కబడతాయి. కొద్దిగా ప్రయత్నిస్తే వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారంలో లాభాలు పెరగడానికి అవకాశం ఉంది. ఐటీ రంగంలోని వారు మంచి ఆఫర్లు అందుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ముఖ్యమైన పనులలో శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత పనులను వాయిదా వేయటం మంచిది కాదు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని కుటుంబ విషయాలు చికాకు పెడతాయి. ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవు తాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుం టారు. వ్యాపారంలో కొద్దిపాటి లాభాలు గడిస్తారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
గట్టి పట్టుదలతో కొన్ని వ్యక్తిగత పనులను పూర్తి చేస్తారు. అదనపు ఆదాయం కోసం చేస్తున్న ప్రయత్నాలు కొద్దిగా సఫలం అవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులకు కళ్లెం వేయటం మంచిది. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభవార్త అందిస్తుంది. విశాఖ నక్షత్రం వారికి అదృష్ట యోగం పడుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల్లో సానుకూలమైన మార్పు చోటు చేసుకుంటుంది. ఉద్యోగంలో ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం కొంతవరకు కుదుటపడుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. మీ మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. స్వాతి నక్షత్రం వారు లబ్ధి పొందుతారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
అవసరానికి డబ్బు అంది ఒకటి రెండు అవస రాలు తీరుతాయి. వాగ్దానాలు చేయటానికి, హామీలు ఉండటానికి ఇది సమయం కాదు. జేష్ట నక్షత్రం వారికి కలిసి వస్తుంది. వారి మాటకు విలువ పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఉద్యోగం మారటం కొంచెం కష్టం అవుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు మార్పు చెందే అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
మీ లక్ష్యాలు నెరవేరడానికి ఇది మంచి సమయం. కొద్ది ప్రయత్నంతో మీరు అనుకున్నది సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగంలో మీ ప్రతిభకు అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. పూర్వాషాడ వారు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. మరో ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. పని ఒత్తిడి కారణంగా ఇబ్బంది పడతారు. ధనిష్టా నక్షత్రం వారికి అవకాశాలు కలిసి వస్తాయి. కొందరు స్నేహితులకు దూరంగా ఉండటం మంచిది. బంధువుల కారణంగా కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఉచిత సేవలకు, అనవసర ఖర్చులకు అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు అదృష్టం పడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కొంతమంది మిత్రులు మీ పురోభివృద్ధికి సహాయపడతారు. ఆహార విహారాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం. ఉద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు, విలాసాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితిలో పురోగతి కనిపిస్తుంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఐటీ వంటి వృత్తి నిపుణులు ఆశించిన స్థాయిలో గుర్తింపు పొందుతారు. డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు బాగా రాణిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి డిమాండ్ పెరుగుతుంది. ఆరోగ్యం కొద్దిగా పరవాలేదు. ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదురైనా లక్ష్యాలు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..