Ravi Pushya Yoga: రవి పుష్య యోగం రోజున ఈ చర్యలు పాటించండి .. మీ ఇంట అంతా శుభమే.. డబ్బుకు లోటు ఉండదని నమ్మకం..

ఏ శుభ కార్యానికైనా రవి పుష్య యోగం ఉత్తమంగా పరిగణించబడుతుంది. రాముడు కూడా ఈ నక్షత్రంలో జన్మించాడని.. అందుకే ఈ నక్షత్రానికి మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉందని చెబుతారు. ఈ యోగంలో చేసే ఏ పని అయినా చాలా శుభ ఫలితాలను ఇస్తుంది.

Ravi Pushya Yoga: రవి పుష్య యోగం రోజున ఈ చర్యలు పాటించండి .. మీ ఇంట అంతా శుభమే.. డబ్బుకు లోటు ఉండదని నమ్మకం..
Ravi Pushya Yoga
Follow us
Surya Kala

|

Updated on: Feb 04, 2023 | 11:42 AM

మాఘమాసం పౌర్ణమి ఈ ఏడాది ఆదివారం అంటే 5 ఫిబ్రవరి 2023న వచ్చింది. అంతేకాదు మాఘ పౌర్ణమి రోజున రవిపుష్య యోగం ఏర్పడనుంది. మాఘ పూర్ణిమ నాడు ఉదయం 7.07 నుండి మధ్యాహ్నం 12.13 గంటల వరకు రవిపుష్య యోగం ఉంటుంది. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. మొత్తం 27 నక్షత్రాలలో 8వ స్థానంలో పుష్య నక్షత్రం ఉంటుంది. ఈ నక్షత్రం చాలా  శుభప్రదమైనదిగా  పరిగణించబడుతుంది. ఈ నక్షత్రం ఆదివారం నాడు వచ్చినప్పుడు, వార , నక్షత్రాల కలయికతో ఏర్పడే యోగాన్ని రవి పుష్య యోగం అంటారు. ఈ యోగం ఏర్పడిన సమయంలో ఏదైనా కొత్త పనిని ప్రారంభించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.

మరోవైపు, మీ జాతకంలో చంద్రుడు అనుకూలంగా లేకున్నా.. మానసికంగా చికాకులు ఎదుర్కొంటున్నా.. టెన్షన్-డిప్రెషన్ తో ఇబ్బందులు పడుతున్నా.. మాఘ పూర్ణిమ రోజున కొని నివారణ చర్యలు చేపట్టండి. చంద్రోదయ సమయంలో ఆవు పచ్చి పాలలో పంచదార, బియ్యం కలిపి అర్ఘ్యం సమర్పించండి. అనంతరం  ” ఓం స్త్రాం స్త్రీం స్త్రీం సః చంద్రమసే నమః” అనే మంత్రాన్ని జపించండి.

రవి పుష్య నక్షత్ర యోగంలో ఈ వస్తువును తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన వస్తువులు పుష్య నక్షత్రంలో పసిడి, వెండి వంటి వస్తువుల కొనుగోలుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ నక్షత్ర లోహం బంగారం.. కనుక ఈ యోగంలో బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అంతేకాదు స్థిరాస్తి, భూమి, ఇల్లు, వాహనం కొనుగోళ్లు, ఇతర ప్రదేశాలలో ఈ యోగ సమయంలో పెట్టిన పెట్టుబడులు దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇస్తాయి. అంతే కాదు, వెండి, దుస్తులు, వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలు కూడా ఈ శుభ యోగంలో శుభప్రదంగా పరిగణించబడుతుంది. కొత్త పనిని ప్రారంభించేందుకు కూడా ఈ యోగం శుభప్రదంగా పరిగణింపబడుతుంది.

ఇవి కూడా చదవండి

రవి పుష్య యోగం ప్రాముఖ్యత ఏ శుభ కార్యానికైనా రవి పుష్య యోగం ఉత్తమంగా పరిగణించబడుతుంది. రాముడు కూడా ఈ నక్షత్రంలో జన్మించాడని.. అందుకే ఈ నక్షత్రానికి మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉందని చెబుతారు. ఈ యోగంలో చేసే ఏ పని అయినా చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. అయితే ఈ యోగంలో వివాహం చేయకూడదు. పురాణాల ప్రకారం… పార్వతిదేవి శాపం కారణంగా పుష్య నక్షత్రంలో వివాహం అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది.

 ఈ యోగంలో ఆర్ధిక ఇబ్బందులు తీరాలంటే..  ఈ నక్షత్రంలో శ్రీయంత్రాన్ని ఇంటికి తీసుకురండి. అనంతరం ఈ యంత్రాన్ని పచ్చి పాలు, గంగాజలంతో శుద్ధి చేయండి. ఇంట్లోని పూజగదిలో ఎర్రటి పట్టు వస్త్రంపై ఈ యంత్రాన్ని ఏర్పాటు చేసుకోండి. అనంతరం కుంకుమతో శ్రీ యంత్రాన్ని అలంకరించి .. నైవేద్యంగా  మిఠాయిని సమర్పించండి..  శ్రీ సూక్తాన్ని 21 సార్లు పఠించండి. ఇలా చేయడం ఇంట్లో ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడవు.. డబ్బుకు లోటు ఉండదని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో
నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..
నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..
జియో రూ.175కే ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్‌.. ఉచితంగా 12 ఓటీటీ యాప్స్
జియో రూ.175కే ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్‌.. ఉచితంగా 12 ఓటీటీ యాప్స్
పన్నెండేళ్ల బాలిక బౌలింగ్‌కి ఇంటర్నెట్ ఫిదా!
పన్నెండేళ్ల బాలిక బౌలింగ్‌కి ఇంటర్నెట్ ఫిదా!
టికెట్ ఏదైనా యాప్ ఒక్కటే..!
టికెట్ ఏదైనా యాప్ ఒక్కటే..!
కొత్త బడ్జెట్ లో ఆదాయపు పన్ను మినహాయింపును పెంచుతారా..?
కొత్త బడ్జెట్ లో ఆదాయపు పన్ను మినహాయింపును పెంచుతారా..?
అమ్మా నీకు హ్యాట్సాఫ్..ఆ తల్లి ఐడియాకు ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..
అమ్మా నీకు హ్యాట్సాఫ్..ఆ తల్లి ఐడియాకు ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..
విదురుడు చెప్పిన ఈ ఐదు విషయాలు పాటించండి.. జీవితం సుఖ సంతోషాలతో..
విదురుడు చెప్పిన ఈ ఐదు విషయాలు పాటించండి.. జీవితం సుఖ సంతోషాలతో..