Shaligram: 6 కోట్ల ఏళ్లనాటి సాలగ్రామ శిలతో సీతారాములు.. సాలగ్రామం అంటే ఏమిటి? ఎన్ని రకాలో మీకు తెలుసా..

రామమందిరంలో కొలువు దీరడానికి సీతారాములను మలిచేందుకు నేపాల్ నుంచి తీసుకుని వచ్చిన సాలగ్రామ శిలలు..   సుమారు 6కోట్ల సంవత్సరాల పురాతనమైనవగా తెలుస్తోంది. వీటిని  నేపాల్‌లోని గండకి నది నుంచి వీటిని సంగ్రహించి.. జనక్‌ పూర్ నుంచి సాలగ్రామాలను ప్రత్యేక ట్రక్కుల్లో అయోధ్యకు తరలించారు.

Shaligram: 6 కోట్ల ఏళ్లనాటి సాలగ్రామ శిలతో సీతారాములు.. సాలగ్రామం అంటే ఏమిటి? ఎన్ని రకాలో మీకు తెలుసా..
Shaligram
Follow us
Surya Kala

|

Updated on: Feb 04, 2023 | 1:37 PM

రామయ్య జన్మ స్థలం అయోధ్యలోని రామ మందిరంలో సీతారాములు కొలువుదీరే విగ్రహాల తయారీకి సాలగ్రామ శిలలను నేపాల్ నుంచి అయోధ్యకు అత్యంత భక్తి శ్రద్దలతో తీసుకుని వచ్చారు. ఈ నేపధ్యంలో సాలగ్రామ శిల అంటే ఏమిటి.. అసలు ఎందుకు సాలగ్రామం అనే పేరు వచ్చింది. దీనిలో రకాలు ఉన్నాయా అని చాలామందికి సందేహం కలుగుతోంది. అయితే ఈ సాలగ్రామం విష్ణువుకి ప్రతీక.. అంతేకాదు అత్యంత ప్రాముఖ్యం కలిగిన ఒక శిల. కలికాలంలో భక్తుల సులభంగా పూజాదికార్యక్రమాలను జరుపుకునేందుకు  నారాయణుడు సాలగ్రామ రూపం ధరించాడని దేవి భాగవతం చెబుతుంది. అందుకనే కలియుగంలో సాలగ్రామ పూజలకు అత్యంత విశిష్టత ఏర్పడింది.

అయితే రామమందిరంలో కొలువు దీరడానికి సీతారాములను మలిచేందుకు నేపాల్ నుంచి తీసుకుని వచ్చిన సాలగ్రామ శిలలు..   సుమారు 6కోట్ల సంవత్సరాల పురాతనమైనవగా తెలుస్తోంది. వీటిని  నేపాల్‌లోని గండకి నది నుంచి వీటిని సంగ్రహించి.. జనక్‌ పూర్ నుంచి సాలగ్రామాలను ప్రత్యేక ట్రక్కుల్లో అయోధ్యకు తరలించారు. ఈ రెండు సాలగ్రామాల్లో ఒకటి 26 టన్నుల బరువు ఉంది. మరొకటి 14 టన్నుల బరువు ఉన్నట్లు తెలుస్తోంది.

నేపాల్ లోని గండకీ నది సాలగ్రామ శిలలకు ప్రసిద్ధి చెందింది. ఈ సాలగ్రామం.. సాక్షత్ విష్ణుస్వరూపంగా భావిస్తారు. వీటిని  అభిషేకించిన జలం  పుణ్యమైందని.. దీనిని తీర్ధం తీసుకుంటే సర్వవ్యాధులు నివారించబడతాయని విశ్వాసం.  సకల శుభాలు కలిగి  మోక్షప్రాప్తి కలుగుతుందని ఋషివాక్కు.

ఇవి కూడా చదవండి

సాలగ్రామం వెనుక పురాణాల కథ:

విష్ణుమూర్తి .. సాలగ్రామం.. రాయి రుపాన్ని ధరించడానికి సంబంధించి పురాణాల్లో అనేక కథలున్నాయి. అందులో ముఖ్యమైనది బృంద కథ. కాలనేమికి జన్మించిన బృంద జలంధరుడు అనే రాక్షసుడిని పెళ్ళాడుతుంది. బృంద మహాపతివ్రత. జలంధరుడు తన రాక్షస ప్రవృత్తిలో అందరిని పీడిస్తుంటాడు. అంతేకాదు జలంధురుడు పార్వతీదేవిపై మొహం పెంచుకుని..  శివుని రూపంలో  ధరించి  పార్వతీదేవి వద్దకు వెళ్ళాడు. దీంతో పార్వాతి దేవి జలంధురుడిపై కోపంతో తన శ్రీ మహా విష్ణువును ఆశ్రయిస్తుంది. బృంద పాతివ్రత్యాన్ని భంగపరచమని కోరుతుంది.

బృంద పాతివ్రత్య భంగం కలిగితేనే.. లోకకంటకుడైన జలంధురుడి అంతం జరుగుతుంది. దీంతో సమస్త లోకం సుఖ సంతోషాలను కోరిన విష్ణువు.. జలంధరుని రూపాన్ని ధరించి బృందని మోసగిస్తాడు. అనంతరం  బృందకు తన నిజ రూపదర్శనం ఇస్తాడు. అసలు విషయం తెలుసుకున్న బృంద.. విష్ణుమూర్తిని శిలగా మారమని శపిస్తుంది. అలా శిల సాలగ్రామం అని పురాణాల కథ.

సాలగ్రామ శిలలు ఎంత చిన్నవిగా ఉంటె అంత విశిష్టతను కలిగి ఉంటాయి. ఈ శిలలపై ఉన్న చక్రాలను బట్టి వాటిని వివిధ పేర్లతో పిలుస్తారు.

ఒక చక్రం ఉంటే సుదర్శనమని, రెండు చక్రాలు ఉంటే లక్ష్మీనారాయణ అని, మూడు చక్రాలు ఉంటే అచ్యుతుడనీ, నాలుగు చక్రాలు ఉంటే జనార్ధుడు అనీ, ఐదు చక్రాలు ఉంటే వాసుదేవుడనీ.. ఆరు చక్రాలు ఉన్న సాలగ్రామాన్ని ప్రద్యుమ్నుడని అంటారు. అంతేకాదు  ఏడు చక్రాలు ఉంటే సంకర్షణుడు అనీ, ఎనిమిది చక్రాలు ఉంటే పురుషోత్తముడు అనీ.. తొమ్మిది చక్రలున్న సాలగ్రామాన్ని  నవవ్యూహమని.. పది చక్రాలు ఉంటే దశావతారమనీ అంటారు. ఇక సాలాగ్రామానికి పదకొండు చక్రాలు ఉంటే అనిరుద్ధుడు అని,  పన్నెండు చక్రాలు ఉంటే ద్వాదశాత్ముడు అనీ పిలుస్తారు. పన్నెండు కంటే ఎక్కువ చక్రాలు ఉన్న సాలగ్రామాన్ని అనంతమూర్తి అని పిలుస్తారు.

సాలగ్రామన్ని ఆవుపాలతోగానీ, పంచామృతంతోగానీ శుద్ధి చేసి.. నియమ నిష్టలతో పూజించాలి. ఇంట్లో పూజించే సాలగ్రామానికి నిత్యం నైవేద్యం సమర్పించాలి. కుటుంబసభ్యులు తప్ప అన్యులు సాలగ్రామన్ని దర్శించరాదు. అంతేకాదు ఈ సాలగ్రామన్ని స్త్రీలు తాకరాదన్న నియమం ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)