ఇంట్లో తరచూ కనిపించే బల్లి..! అలా కనపడితే దేనికి సంకేతమో తెలుసా ?

అలా కనిపిస్తే ఎంతో శుభసూచకమని అలా కనిపించడం వల్ల సంపద వృద్ధి చెందుతుందని పండితులు తెలియజేస్తున్నారు. ఇక నూతన గృహ ప్రవేశం చేసే సమయంలో మనకు ఇంట్లో బల్లులు కనబడితే అవి పెద్ద వారి రాకను సూచిస్తుందని అర్థం. ఇలా పూర్వీకులు మన ఇంటికి వచ్చినట్లు సంకేతం.

ఇంట్లో తరచూ కనిపించే బల్లి..! అలా కనపడితే దేనికి సంకేతమో తెలుసా ?
Lizards
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 04, 2023 | 2:15 PM

సాధారణంగా ఇంట్లో బల్లి కనిపిస్తే చాలామంది భయపడుతుంటారు. గట్టిగా కేకలు వేస్తారు. నిజానికి బల్లి ఏమాత్రం భయపెట్టే జీవికాదు.. కానీ బల్లిని చూడగానే చాలా మందికి భయం కలుగుతుంది. అయితే ఎవరికీ తెలియని ఒక విషయం ఏమిటంటే బల్లి ఎంతో శుభకరమైనది.. ఇది మన ఇంట్లో తిరగటం వల్ల సంపద పెరుగుటకు కారణమవుతుందని పండితులు తెలియజేస్తున్నారు. ఇలా బల్లులు మన ఇంట్లో దేవుడి గదిలో కనిపిస్తే ఎంతో శుభసూచకమని అలా కనిపించడం వల్ల సంపద వృద్ధి చెందుతుందని పండితులు తెలియజేస్తున్నారు. ఇక నూతన గృహ ప్రవేశం చేసే సమయంలో మనకు ఇంట్లో బల్లులు కనబడితే అవి పెద్ద వారి రాకను సూచిస్తుందని అర్థం. ఇలా పూర్వీకులు మన ఇంటికి వచ్చినట్లు సంకేతం.

అంతేకాకుండా నూతన గృహ ప్రవేశం చేసే సమయంలో చనిపోయిన బల్లులు కనిపిస్తే అది అశుభానికి సంకేతం అని అర్థం. ఇక చాలామందికి కలలో కూడా బల్లులు కనిపిస్తుంటాయి ఇలా కలలో బల్లి కనిపించడం మీరు దాన్ని తరమాలని ప్రయత్నిస్తున్నా పారిపోతుంటే మీరు తొందరలోనే ఏదో శుభవార్త వింటారని అర్థం. ఇక ఆలయంలో లేదా దేవుని గుడిలో బల్లి కనిపించినట్టయితే ధనం, సంతోషాన్ని ఇస్తుందట. అంతేకాదు ఇంట్లో వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలకు చిహ్నమట. ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరుస్తుందని వేదపండితులు చెబుతున్నారు. పేర్కొంటున్నారు. భవిష్యత్ లో ఎదురయ్యే కొన్ని సంఘటనలను కూడా బల్లులు సూచిస్తాయట. దీపావళి రోజు ఇంట్లో బల్లి కనిపిస్తే శుభ సూచకం. బల్లి లక్ష్మీదేవిని సూచిస్తుంది అంటారు. దీపావళి రోజు బల్లి కనిపిస్తే త్వరలోనే ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం.

బల్లులు పొట్లాడుకుంటే చూడడం అస్సలు మంచిది కాదట. కలలో మీరు బల్లిని పట్టుకోవాలని ప్రయత్నించినట్టయితే.. అది పారిపోతే మంచిదని నమ్ముతుంటారు. ముఖ్యంగా రెండు బల్లులు పొట్లాడుకుంటుంటే అసలు చూడకూడదట. అలా చూస్తే అశుభాలు కలుగుతాయని నమ్మకం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..