మూఢనమ్మకాలకు మూడు నెలల పసికందు బలి.. చిన్నారి పొట్ట చుట్టూ ఇనుప కడ్డీతో 51 సార్లు వాతలు..

ఆస్పత్రికి వచ్చిన అధికారులు చిన్నారి తల్లిదండ్రులను విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో వెంటనే వారు చర్యలు చేపట్టారు. చిన్నారిని ఖననం చేసిన

మూఢనమ్మకాలకు మూడు నెలల పసికందు బలి.. చిన్నారి పొట్ట చుట్టూ ఇనుప కడ్డీతో 51 సార్లు వాతలు..
Baby
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 04, 2023 | 1:06 PM

తల్లిదండ్రుల మూఢనమ్మకానికి 3 నెలల పసి పాప బలైపోయింది. ఈ అమానవీయ సంఘటన సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. న్యుమోనియాతో బాధపడుతున్న 3 నెలల పసికందుకు గిరిజన తల్లిదండ్రులు చేయించిన చికిత్సకు చిన్నారి ప్రాణాలకు మీదకు తెచ్చింది. వారి గిరిజన సంఘం ఆచారం ప్రకారం, ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, ఇనుప కడ్డీని వేడి చేసి శరీరంలోని వేరే భాగంలో ఉంచుతారు. అదేవిధంగా చిన్నారి పొట్టపై వేడి రాడ్ తో గుచ్చటం ఆనవాయితీగా వస్తోంది. మధ్యప్రదేశ్‌లోని షాడోల్ జిల్లాలోని గిరిజనుల ప్రాబల్య ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని గిరిజన జనాభాలో, న్యుమోనియా మరియు ఇలాంటి ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి వేడి ఇనుప కడ్డీ చికిత్స పద్ధతి ఉంది.

ఈ క్రమంలోనే గిరిజన ప్రాంతమైన షాదోల్‌ జిల్లాలోని సింగ్‌పుర్‌ కథౌటియా గ్రామానికి చెందిన మూడు నెలల చిన్నారి నిమోనియా బారినపడింది. చిన్నారికి శ్వాస తీసుకోవడంలో కూడా తీవ్ర ఇబ్బందిగా మారింది. దీంతో తల్లిదండ్రులు పాపను వైద్యుల వద్దకు తీసుకెళ్లకుండా స్థానికంగా ఉన్న మంత్రగాళ్లకు చూపించారు. ఈ క్రమంలో మంత్రగాళ్లు పాప పొట్ట చుట్టూ.. కాల్చిన ఇనుప రాడ్డుతో 51 సార్లు వాతలు పెట్టారు. పాప పరిస్థితి మరింత దిగజారింది. దీంతో వారు పసికందును స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. నిమోనియాకు సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువై చిన్నారి మృతి చెందింది. పాపకు తల్లిదండ్రులు అంత్యక్రియలు పూర్తి చేశారు.

అయితే అనారోగ్యంతో బాధపడుతున్న తొలిదశలో చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించి ఉంటే.. ఆ చిన్నారి బతికి ఉండేదని వైద్యులు తెలిపారు. శిశువు కడుపుపై ​​కాల్చిన గాయాల గమనించిన వైద్యులు..రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి అధికారులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి వచ్చిన అధికారులు చిన్నారి తల్లిదండ్రులను విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో వెంటనే వారు చర్యలు చేపట్టారు. చిన్నారిని ఖననం చేసిన చోటుకెళ్లి.. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేసేందుకు చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..