Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: పొట్టుపొట్టుగా కొట్టుకున్న భర్త, ముగ్గురు భార్యలు.. కట్‌చేస్తే.. ట్విస్ట్ మామూలుగా లేదుగా..

ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అర్మాన్ మాలిక్ భార్యలు ఇద్దరూ తల్లులు కాబోతున్నారు. భార్యలు ఇద్దరూ గర్భవతిగా ఉన్నప్పుడు అతను ఇలా చేయడం పట్ల అర్మాన్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

Watch Video:  పొట్టుపొట్టుగా కొట్టుకున్న భర్త, ముగ్గురు భార్యలు.. కట్‌చేస్తే.. ట్విస్ట్ మామూలుగా లేదుగా..
Youtuber Armaan
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 04, 2023 | 2:03 PM

యూట్యూబర్ అర్మాన్ మాలిక్ తన వ్యక్తిగత జీవితం ఆధారంగా ఇప్పుడు మరింత ఫేమస్‌ అయ్యాడు.. అర్మాన్ మాలిక్ వీడియోలు యూట్యూబ్‌లో బాగా వైరల్‌ అవుతున్నాయి. అర్మాన్ తన నిజ జీవితంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఈ కారణంగా కూడా అతడు తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా మరోమారు, అంటే ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు అర్మాన్. అంతేకాదు.. మూడవ భార్యను కూడా ఏకంగా ఇంటికే తీసుకొచ్చేశాడు. ఆ తర్వాత సీన్‌ ఏం జరిగిందనే విషయంపై కూడా సరదు ఫేమస్‌ యూట్యూబర్‌ వీడియో తీసుకున్నాడు.. ప్రస్తుతం అదే వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోని చిరయు పాయల్ మాలిక్ ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. వీడియో ఆధారంగా ఏం జరిగిందంటే..

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Armaan Malik (@armaan__malik9)

అర్మాన్ మాలిక్ భార్యలు పాయల్ మాలిక్, కృతిక మాలిక్ ఇద్దరూ ఇంట్లోనే ఉంటున్నారు. అంతలోనే అర్మాన్ తన మూడవ భార్యతో ఇంటికి రావడం వీడియోలో చూడవచ్చు. అర్మాన్ తన మూడవ భార్యను చూసిన పాయల్ ఒక్కసారిగా కోపంతో ఊగిపోయింది. వెంటనే ఆమె కృతికకు కాల్ చేస్తుంది. ఇక అర్మాన్‌ వెంట వచ్చిన అతని మూడో భార్యను చూసి భార్యలిద్దరూ రెచ్చిపోయారు.

అర్మాన్ మాలిక్ మూడో భార్య గురించి తెలుసుకున్న కృతిక, పాయల్ ఆగ్రహానికి గురయ్యారు. మొదట షాక్‌లో ఉండిపోయిన ఆ ఇద్దరూ..ఆ తర్వాత కోపంతో రగిలిపోయారు. పాయల్ తన మూడవ భార్యను చంపుతామంటూ బెదిరింపులకు దిగారు. కృతిక కూడా అర్మాన్‌పై ఆగ్రహంతో విరుచుపడుతుంది. పాయల్, కృతిక అర్మాన్, అతని మూడవ భార్యపై దాడి చేసేందుకు యత్నించారు. కృతిక ఏడవడం ప్రారంభించగా, పాయల్ కళ్లు తిరిగి పడిపోతుంది.

అయితే, ఈ హై-వోల్టేజ్ డ్రామా తర్వాత, అర్మాన్ మాలిక్ ఇదంతా డ్రామా అని చెబుతాడు. కానీ, పాయల్, కృతిక మొదట నమ్మలేదు. వారిని ఇంటి నుండి బయటకు పంపిస్తామని బెదిరించారు. అర్మాన్ తమను ఆటపట్టిస్తున్నాడని నమ్మలేకపోతున్నామంటారు. అయితే, అర్మాన్ మూడోసారి పెళ్లి చేసుకోలేదు. అతను కేవలం పాయల్, కృతికను ఆటపట్టించాడానికి మాత్రమే ఇదంతా చేశాడు. వారిద్దరినీ చాలా సేపు ఇబ్బంది పెట్టిన తరువాత, అతను చివరకు వారికి అసలు నిజం చెప్పాడు, ఆపై కృతిక, పాయల్ హ్యాపీ మూడ్‌లోకి వస్తారు.. హమ్మయ్యా అనుకుంటూ..అతన్ని కౌగిలించుకుంటారు.

ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అర్మాన్ మాలిక్ భార్యలు ఇద్దరూ తల్లులు కాబోతున్నారు. భార్యలు ఇద్దరూ గర్భవతిగా ఉన్నప్పుడు అతను ఇలా చేయడం పట్ల అర్మాన్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

అయితే, కృతిక సహజంగా తల్లి కాబోతోందని, పాయల్ ఐవిఎఫ్ ద్వారా తల్లి కాబోతోందని తరువాత అతను వెల్లడించాడు. పాయల్‌కు ఒక కొడుకు కూడా ఉన్నాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..