- Telugu News Photo Gallery Spiritual photos Samatha kumbh 2023 brahmotsavam Photos on 04 02 2023 in Hyderabad Telugu spiritual Photos
samatha kumbh 2023: ఘనంగా మూడవ రోజు శ్రీరామానుజాచార్య సమతా కుంభ్-2023.. భక్తులను ఆకట్టుకుంటున్న ప్రత్యేక పూజలు.
18 దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవ ఉదయం 11 గంటలకు తిరుమంజన సేవ నిర్వహించారు.నిన్న గరుడ సేవ నిర్వహించిన 18 దివ్యదేశాల ఉత్సవ మూర్తులకు అభిషేకం నిర్వహించారు.స్వామివారికి నిన్నటి యాత్ర శ్రమ తీరడం కోసం
Anil kumar poka | Edited By: Janardhan Veluru
Updated on: Feb 06, 2023 | 6:34 PM

శ్రీరామానుజాచార్య-108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు 4-2-2023 (శనివారం)18 దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవ ఉదయం 11 గంటలకు తిరుమంజన సేవ నిర్వహించారు.

నిన్న గరుడ సేవ నిర్వహించిన 18 దివ్యదేశాల ఉత్సవ మూర్తులకు అభిషేకం నిర్వహించారు.స్వామివారికి నిన్నటి యాత్ర శ్రమ తీరడం కోసం తిరుమంజనం కార్యక్రమం చేస్తున్నారని శ్రీ చినజీయర్ స్వామి అన్నారు.

ఈ తిరుమంజనాన్ని ఏకంతంగా కాకుండా లోకాంతంగా నిర్వహిస్తున్నామన్నారు. సాధారణంగా కార్యక్రమం చూసేవాళ్లకు కొత్తగా ఉంటుందని, ఇక్కడ మాత్రం చేసేవాళ్లకు, చేయించేవాళ్లకు చూసేవాళ్లకు కూడా కొత్తగా ఉంటుందని చెప్పారు.

శ్రీరామచంద్రుడు ఇన్ని రూపాల్లో ఒకేచోట ఉండటం అనేది ఇప్పటి వరకు జరగలేదని, ఏకంగా 18 రూపాల్లో తిరుమంజనం జరపడం అనేది అరుదని అన్నారు.

ఈ క్షేత్రంలో అన్నీ కొత్తగా ఉంటాయని చినజీయర్‌స్వామి చెప్పారు.తిరుమంజనంలో భాగంగా పెరుమాళ్‌కు ముందుగా పెరుగుతో స్నానం చేయించారు, తర్వాత పాలు, తైలం, జలంతో తిరుమంజనం జరిపించారు.

ఆయుర్వేదంలో పంచకర్మ చేసేప్పుడు మనకు కూడా పాలు, గంజితో ఇలానే చేస్తారని జీయర్‌స్వామి అన్నారు. దేహానికి రకరకాల స్నానాల వల్ల కొత్త శక్తి ఏర్పడుతుందని చెప్పారు.

నిత్య కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 5:45 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం చిన జీయర్‌స్వామి ఆధ్వర్యంలో అష్టాక్షరీ మంత్రజపం జరిగింది.

భక్తులంతా అరగంటపాటు ధ్యానం చేశారు. నిత్యం మనకు అష్టాక్షరీ చేసుకునే శక్తిని ఆ స్వామి ప్రసాదించాలని చినజీయర్ అన్నారు.

ఆ తర్వాత ఆరాధన, సేవాకాలంలో భాగంగా శాత్తుముఱై జరిపించారు. అనంతరం తీర్థ, ప్రసాద గోష్టిలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు స్వయంగా చినజీయర్ స్వామివారు తీర్థం అనుగ్రహించారు.

అనంతరం స్వామివారు గోపూజ నిర్వహించారు.

శ్రీరామానుజాచార్య సమతా కుంభ్-2023 బ్రమ్మోత్సవాలకు సంబంధించిన ప్రత్యేక పూజల ఫొటోస్ అందరిని ఆకట్టుకుంటున్నాయి.