February Transit 2023: ఫిబ్రవరిలో ఈ 3 గ్రహాల గమనంలో మార్పులు.. ఈ రాశులకు డబ్బే డబ్బు.. అందులో మీరున్నారా
2023 ఫిబ్రవరిలో మూడు ప్రధాన గ్రహాల రాశుల్లో మార్పులు జరగనున్నాయి. ఈ గ్రహాలు సూర్యుడు, బుధుడు, శుక్రుడు. ఫిబ్రవరి నెలలో ఈ మూడు గ్రహాల రాశులు మారడం వల్ల కొన్ని రాశుల వారు లాభాలను.. కొన్ని రాశుల వారు నష్టాలను ఎదుర్కోవాల్సి రావచ్చు.
జ్యోతిషశాస్త్రం ప్రకారం తొమ్మిది గ్రహాలు ఎప్పటికప్పుడు తమ గమనాన్ని మార్చుకుని రాశులను మార్చుకుంటూ ఉంటాయి. వీటి మార్పు ప్రజలందరి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 2023 ఫిబ్రవరిలో మూడు ప్రధాన గ్రహాల రాశుల్లో మార్పులు జరగనున్నాయి. ఈ గ్రహాలు సూర్యుడు, బుధుడు, శుక్రుడు. ఫిబ్రవరి నెలలో ఈ మూడు గ్రహాల రాశులు మారడం వల్ల కొన్ని రాశుల వారు లాభాలను.. కొన్ని రాశుల వారు నష్టాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఫిబ్రవరి నెలలో ఏయే మూడు గ్రహాలు తమ రాశిని మార్చుకోబోతున్నాయో ఈరోజు తెలుసుకుందాం..
బుధుడు సంచారం: ఫిబ్రవరి నెలలో.. అన్ని గ్రహాల్లో మొదటిది. యువరాజు హోదా కలిగిన బుధుడు తన రాశిని ఫిబ్రవరిలో మార్చుకోనున్నాడు. వేద జ్యోతిషశాస్త్ర గణన ఆధారంగా.. బుధుడు 7 ఫిబ్రవరి 2023న శనీశ్వరుడు అధినేత అయిన మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రాశిలో ఇప్పటికే సూర్యుడు ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో.. సూర్యుడు-బుధుడు ఒకే రాశిలో ఉండటం వల్ల, బుధాదిత్య యోగం శుభ కలయిక ఉంటుంది. బుధుడు ఫిబ్రవరి 27 వరకు శని తన సొంత రాశి అయిన మకరరాశిలో ఉండనున్నాడు. అప్పుడు కుంభరాశిలో సంచరించనున్నాడు. ఫిబ్రవరిలో బుధాదిత్య యోగం ఏర్పడటం వల్ల మేష, వృషభ, కర్కాటక, కన్యా, తుల, కుంభ రాశుల వారికి ఈ రాశి మార్పు శుభప్రదం అవుతుంది. ధనలాభానికి మంచి అవకాశాలున్నాయి.. జీవితంలో పురోగతి ఏర్పడుతుంది.
సూర్య సంచారము: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. సూర్యుడు ప్రతి 30 రోజులకు ఒకసారి తన రాశిని మార్చుకోనున్నాడు. సూర్యుడిని అన్ని గ్రహాలకు రాజు అంటారు. ఫిబ్రవరి 13న.. గ్రహాల రాజు సూర్యుడు.. శనీశ్వరుడు అధిపతి అయిన కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఒకే రాశిలో సూర్యుడు, శని కలయిక ఒక నెల రోజుల పాటు ఉండనుంది. తండ్రి కొడుకులైన సూర్యుడు .. శని ఒకరితో ఒకరు శత్రుత్వం కలిగి ఉంటారన్న సంగతి తెలిసిందే.. సూర్యుడు శని రాశిలోకి ప్రవేశించినప్పుడు కొన్ని రాశుల వారు నష్టాలను చవిచూడాల్సి రావచ్చు.
శుక్రుడు సంచారం: శుక్రుని రాశి మార్పు కొందరికి శుభప్రదం. శుక్రుడు ఆనందాన్ని, భౌతిక సుఖాలను ఇస్తాడు. శుక్రుడు ఫిబ్రవరి 15, 2023న కుంభ రాశి ప్రయాణాన్ని నిలిపివేసి.. బృహస్పతి అధిపతి అయిన మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. బృహస్పతి ఇప్పటికే మీనరాశిలో ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో.. మీనరాశిలో శుక్రుడు.. బృహస్పతి కలయిక కొన్ని రాశుల వ్యక్తులకు ఆనందం, శ్రేయస్సును ఇస్తుంది. జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం, మేషం, వృషభం, కర్కాటకం, మిథునం, సింహం, మకరం, కుంభం, మీనం రాశుల వారు అకస్మాత్తుగా ఆర్ధిక లాభాలను అందుకోనున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)