Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramalingeswara Swamy: వైభవంగా రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. నిప్పుల్లో నడిచి మొక్కులు తీర్చుకున్న భక్తులు

చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను పర్వత వాహనంపై ఉంచి మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. మెుదట వీరముష్టి వంశీయులతో పూజలు నిర్వహించి అగ్నిగుండాలను ప్రారంభించారు

Ramalingeswara Swamy: వైభవంగా రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. నిప్పుల్లో నడిచి మొక్కులు తీర్చుకున్న భక్తులు
Cheruvugattu Ramalingeswara Swamy
Follow us
Surya Kala

|

Updated on: Jan 31, 2023 | 7:11 AM

నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు శ్రీ పార్వతిసమేత జడల రామలింగేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణతో మారుమోగింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా తెల్లవారుజామున అగ్ని గుండాల కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిప్పుల్లో నడిచి భక్తులు తమ మొక్కులను చెల్లించుకున్నారు. చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను పర్వత వాహనంపై ఉంచి మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు.

మెుదట వీరముష్టి వంశీయులతో పూజలు నిర్వహించి అగ్నిగుండాలను ప్రారంభించారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరు కావడంతో తొక్కిసలాట జరగకుండా పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు హరహర శంభో నామస్మరణలతో నిప్పుల్లో నడిచి తమ భక్తిని చాటుకున్నారు. ప్రతి సంవత్సరం కళ్యాణం తరువాత తాము పండించిన పంటను స్వామి వారికి సమర్పించి అగ్ని గుండాలపై నడిస్తే తమకు తమ కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. పంటలకు చీడపీడలు సోకకుండా బాగా పంటలు పండుతాయని, ఏడాది పొడవున స్వామి వారి ఆశీస్సులు తమకు ఉంటాయని భక్తుల నమ్మకం

బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే అగ్ని గుండాల కార్యక్రమంలో తమ కోరికలు నెరవేరిన భక్తులు నిప్పుల్లో నడిచి మొక్కులు  చెల్లించు కుంటారని ఆలయ అర్చకులు చెబుతున్నారు. చేసిన పాపాలు తొలగి పోతాయని భక్తుల విశ్వాసమని ఆయన చెప్పారు. అగ్ని గుండాల కార్యక్రమంలో ఎలాంటి అపశృతి చోటు చేసుకోకపోవడంతో అధికారి యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఎక్కడిక్కడ క్యూ లైన్స్ ఏర్పాటు చేసి ఒకరి తరువాత ఒకరిని నిప్పులపై నడిచే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఇవి కూడా చదవండి

Reporter: Revan Reddy

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అన్న అంటూ పలకరించిన జపాన్ అభిమాని.. తారక్ రియాక్షన్ చూశారా..?
అన్న అంటూ పలకరించిన జపాన్ అభిమాని.. తారక్ రియాక్షన్ చూశారా..?
షాక్ అయిన మోయిన్ అలీ!
షాక్ అయిన మోయిన్ అలీ!
ఆ ట్రెండ్‌ను పట్టుకున్న వరుణ్ తేజ్‌.. మరి ఇలాగైనా సక్సెస్ అవుతారా
ఆ ట్రెండ్‌ను పట్టుకున్న వరుణ్ తేజ్‌.. మరి ఇలాగైనా సక్సెస్ అవుతారా
హీరో నితిన్‌కు క్షమాపణలు చెప్పిన ఆది పినిశెట్టి.. ఏం జరిగిందంటే?
హీరో నితిన్‌కు క్షమాపణలు చెప్పిన ఆది పినిశెట్టి.. ఏం జరిగిందంటే?
దిమ్మతిరిగే న్యూస్ ! ఫ్యాన్స్‌కు చరణ్‌ బిగ్ సర్‌ప్రైజ్
దిమ్మతిరిగే న్యూస్ ! ఫ్యాన్స్‌కు చరణ్‌ బిగ్ సర్‌ప్రైజ్
టికెట్లు కావాల్సిన వారు పూర్తి వివ‌రాల‌తో మెయిల్ పంపాల‌ని సూచ‌న‌
టికెట్లు కావాల్సిన వారు పూర్తి వివ‌రాల‌తో మెయిల్ పంపాల‌ని సూచ‌న‌
రూ.500 తెచ్చిన తంట.. ఏకంగా కిటికీ ఎక్కేసిన మహిళ
రూ.500 తెచ్చిన తంట.. ఏకంగా కిటికీ ఎక్కేసిన మహిళ
బార్లీ నీళ్లు తాగితే శరీరానికి చలువ చేయడమే కాదు..ఆడవాళ్లలో ఈసమస్య
బార్లీ నీళ్లు తాగితే శరీరానికి చలువ చేయడమే కాదు..ఆడవాళ్లలో ఈసమస్య
కొత్త కారులో రష్మిక షికారు.. ధర తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
కొత్త కారులో రష్మిక షికారు.. ధర తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
ట్రెండింగ్‌లో ఉన్న ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
ట్రెండింగ్‌లో ఉన్న ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?