Vastu Tips: ఇంట్లో అద్దం ఎక్కడ ఉంచాలో తెలుసా..? ఇలా చేస్తే అదృష్టం వరిస్తుందంట..

ఇంట్లో ఉండే అద్దం ఏ దిశలో ఉండాలి.. అనే విషయంపై కూడా నియమాలున్నాయి. అద్దం నుండి వచ్చే శక్తి ఖచ్చితంగా వ్యక్తిపై ప్రభావం చూపుతుంది. ఇంట్లో తప్పు దిశలో ఉంచిన అద్దం ప్రతికూలతను పెంచడానికి కారణమవుతుంది.

Vastu Tips: ఇంట్లో అద్దం ఎక్కడ ఉంచాలో తెలుసా..? ఇలా చేస్తే అదృష్టం వరిస్తుందంట..
Vastu Tips For Mirror
Follow us

|

Updated on: Jan 29, 2023 | 9:48 AM

వాస్తు శాస్త్రంలో..  ఇంట్లో ప్రతిదీ ఉంచడానికి ఒక స్థలాన్ని నిర్ణయించారు. ఇంట్లోని వస్తువులను వాస్తు ప్రకారం ఉంచినట్లయితే.. ఆ ఇంట్లో ఎల్లప్పుడూ సానుకూల శక్తి ప్రభావం ఉంటుంది. అద్దం మన వ్యక్తిత్వం సంగ్రహావలోకనం చూపుతుంది. ఇంట్లో ఉండే అద్దం ఏ దిశలో ఉండాలి.. అనే విషయంపై కూడా నియమాలున్నాయి. అద్దం నుండి వచ్చే శక్తి ఖచ్చితంగా వ్యక్తిపై ప్రభావం చూపుతుంది. ఇంట్లో తప్పు దిశలో ఉంచిన అద్దం ప్రతికూలతను పెంచడానికి కారణమవుతుంది. ఈ దోషం వల్ల ఇంట్లోని సభ్యులు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు.

ఇంట్లో అద్దం ఎక్కడ పెట్టుకుంటే శ్రేయస్కరమంటే..  వాస్తు శాస్త్రం ప్రకారం ఏ ప్రదేశంలోనైనా సానుకూల శక్తికి మార్గం తూర్పు నుండి పడమర వరకు ఉంటుంది. కనుక అద్దాలను ఎల్లప్పుడూ ఇంటి తూర్పు లేదా ఉత్తర గోడలపై వేలాడదీయాలి. ఇందులో ఎవరైనా అద్దాన్ని చూసుకున్నప్పుడు.. అతని ముఖం తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంటే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంటికి ఈ దిశలో అద్దం పెట్టడం వల్ల జీవితంలో పురోగతి, గౌరవం, ఆర్థిక వృద్ధి పెరుగుతుంది.

అద్దం ఎక్కడ పెట్టుకోకూదంటే..  వాస్తు శాస్త్రం ప్రకారం పడకగదిలో ఎప్పుడూ అద్దం ఉండకూడదు. భార్యాభర్తల మధ్య ప్రేమ, ఆప్యాయత తగ్గుతాయి. పడకగదిలో అద్దం ఉన్న ఇళ్లలో భార్యాభర్తల మధ్య విభేదాలు తరచుగా కలుగుతూ ఉంటాయి. కొన్ని కారణాల వల్ల ఇంట్లోని పడకగదిలో అద్దం పెట్టాల్సి వస్తే రాత్రి పడుకునే సమయంలో అద్దాన్ని బట్టతో కవర్ చేసుకోవాలి. ఈ పరిహారం నష్టాలను కొంతమేర నివారిస్తుంది.

ఇవి కూడా చదవండి

బాత్రూంలో అద్దం..  చాలా ఇళ్లలో బాత్‌రూమ్‌లో అద్దం ఉంటుంది. అందులో వ్యక్తి స్నానం చేసిన తర్వాత లేదా ఫేస్ వాష్ తర్వాత తన ముఖం చూసుకుంటాడు. వాస్తు శాస్త్రంలో.. బాత్రూమ్‌లో అద్దాలు అమర్చే సమయంలో చాలా విషయాలు గుర్తుంచుకోవాలి. అద్దం ఎప్పుడూ తలుపు ముందు ఉండకూడదు. బాత్‌రూమ్‌లో అద్దం ఉండటం వల్ల ప్రతికూల.. సానుకూల శక్తులు రెండూ ప్రవేశిస్తాయి. తలుపు ముందు అద్దం ఉంటే.. మనతో పాటు బాత్రూంలోకి ప్రవేశించే శక్తి ఇంటికి తిరిగి వస్తుంది. ప్రతికూల ప్రభావాన్ని తొలగించడానికి..  అద్దం బాత్రూంలో దాని ప్రతిబింబం బాత్రూమ్ వెలుపల కనిపించని విధంగా ఏర్పాటు చేసుకోండి.

ఎలాంటి అద్దం ఉండటం శుభప్రదమంటే..  వాస్తు శాస్త్రం ప్రకారం.. పదునైన, పగిలిన అద్దం, అస్పష్టంగా కనిపించే అద్దం అనేక సమస్యలను కలిగిస్తాయి. వాస్తు ప్రకారం, ఇంట్లో అమర్చిన అద్దం కాంతివంతంగా పెద్దదిగా ఉండాలి. గోడపై దీర్ఘచతురస్రాకారం, చతురస్రం లేదా అష్టభుజి అద్దం పెట్టుకోవడం  శ్రేయస్కరం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)