AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagoba Jatara: ముగిసిన నాగోబా జాతర.. సుమారు 6 లక్షల మంది భక్తుల హాజరు.. 22 తెగలకు ప్రసాదం పంపిణీ

ఈ యేడాది నాగోబా జాతరకు సుమారు 6 లక్షలకుపైనే భక్తులు వచ్చినట్లు అంచనా వేశారు. జాతర ముగియడంతో మెస్రం వంశీయులు నాగోబా ఆలయ పక్కన ప్రత్యేకంగా సమావేశమై, మండ గాజిలి పూజలు నిర్వహించారు.

Nagoba Jatara: ముగిసిన నాగోబా జాతర.. సుమారు 6 లక్షల మంది భక్తుల హాజరు.. 22 తెగలకు ప్రసాదం పంపిణీ
Nagoba Jatara
Surya Kala
|

Updated on: Jan 29, 2023 | 9:17 AM

Share

ఆదివాసీల కుంభమేళ నాగోబా జాతర ముగిసింది. వారం రోజులపాటు పూజలందుకున్న నాగోబా దేవతకు మండగాజిలి పూజలతో ముగించారు. అక్కడి నుంచి మెస్రం వంశీయులు శ్యాంపూర్‌ బుడుందేవ్‌ పూజలకు బయల్దేరి వెళ్లారు.  ఆదిలాబాద్‌జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని గోండు గిరిజనతెగకు చెందిన మెస్రం వంశస్తులు జరిపే అతి పెద్ద గిరిజన మేళ నాగోబా జాతర. ఈ జాతర ఆదివాసీల ఐక్యతను చాటుతుంది. అప్పటి వరకూ చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉండే ఆదివాసీ, గోండ్, కోలామ్, పరదాస్, మెస్రం వంశీయులంతా ఈ జాతరలో ఒక్కచోటికి చేరుతారు. వీరంతా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, బీహార్ రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్యలో కెస్లాపూర్‌కు చేరుకోవడంతో జాతర సందడి నెలకొంది

ఈనెల 21న అర్థరాత్రి గంగాభిషేకంతో మొదలైన నాగోబా జాతర, ప్రజాదర్బార్‌, బేటింగ్‌ల వంటి ప్రధాన ఘట్టాలతో 28వ తేదీ వరకూ వైభవంగా కొనసాగింది. మట్డితో మెస్రం ఆడపడుచులు చేసిన ఏడు రకాల పాముల పుట్టలను జాతర సమయంలో ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. దీంతో నాగోబా అనుగ్రహం కలుగుతుందని మెస్రం వంశీయులతో పాటు ఆదివాసులు నమ్ముతారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఆదివాసీ భక్తులు సంప్రదాయం ప్రకారం వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. చివరిరోజు కావడంతో నాగోబా దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. నాగోబా దర్శనం తర్వాత ఎడ్లబండ్లలో వచ్చిన గిరిజనులు, జాతర ముగియడంతో తమ స్వాగ్రామానికి బయల్దేరారు.

ఈ యేడాది నాగోబా జాతరకు సుమారు 6 లక్షలకుపైనే భక్తులు వచ్చినట్లు అంచనా వేశారు. జాతర ముగియడంతో మెస్రం వంశీయులు నాగోబా ఆలయ పక్కన ప్రత్యేకంగా సమావేశమై, మండ గాజిలి పూజలు నిర్వహించారు. నాగోబా దేవత పూజలకు తీసుకొచ్చిన మట్టి కుండలను, ప్రసాదాలను మెస్రం వంశీయుల్లోని 22 తెగల వారికి పంపిణీ చేశారు. నాగోబా దేవుడికి సంప్రదాయ పూజలు ముగిసిన తర్వాత మెస్రం వంశస్థులు ఉట్నూరు మండలం శ్యాంపూర్‌ బుడుందేవ్‌ పూజలకు బయల్దేరారు.

ఇవి కూడా చదవండి

సంస్కృతి మరువని గిరిజనానికి నాగోబా జాతర నిలువెత్తు నిదర్శనం. ఈ ఏడాది సొంత డబ్బులతో నిర్మించుకున్న ఆలయంలో జాతర వైభవంగా జరిగింది. మెస్రం వంశంలో ఉన్న 22 తెగల్లో కేవలం మడావి, మర్సుకోల, పుర్కా, మెస్రం, వెడ్మ, ఫంద్రా, ఉర్వేత ఇంటి పేర్లతో ఉన్న మెస్రం వంశీయులకే ప్రదాన పూజకు అర్హత ఉన్నట్లు చెబుతారు గిరిజన పెద్దలు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..