Astro Tips: జాతకంలో ఇబ్బందులా.. రోజూ హనుమాన్ చాలీసాని పఠించి చూడండి..

జాతకంలో ఇబ్బందులున్నవారు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత హనుమాన్ చాలీసా పఠించడం వల్ల వ్యక్తుల బాధలన్నీ తీరుతాయని విశ్వాసం. నేడు హనుమాన్ చాలీసాని రోజూ పారాయణం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.. 

Astro Tips: జాతకంలో ఇబ్బందులా.. రోజూ హనుమాన్ చాలీసాని పఠించి చూడండి..
Asto Tips In Telugu
Follow us
Surya Kala

|

Updated on: Jan 27, 2023 | 10:55 AM

ప్రతి వ్యక్తి జాతకంలోనూ రోజు గ్రహాలు తమ గమనాన్ని మార్చుకుంటూ ఉంటాయి. దీంతో అతని జాతకంలో మంచి, చెడులు వంటి మార్పులు చోటు చేసుకుంటాయి. జాతక ప్రభావంతో మనిషి జీవితంలో కలిసే ఇబ్బందులను హనుమంతుడి ఆరాధనతో తొలగించుకోవచ్చు అని జోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీరాముడ భక్తుడు హనుమంతుడి పూజా, హనుమాన్ చాలీసా  పారాయణం చేయడం చాలా శ్రేయస్కరం. ఈ పారాయణంతో జీవితంలోని అన్ని ఆటంకాలు, కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత హనుమాన్ చాలీసా పఠించడం వల్ల వ్యక్తుల బాధలన్నీ తీరుతాయని విశ్వాసం. నేడు హనుమాన్ చాలీసాని రోజూ పారాయణం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

  1.  హనుమాన్ చాలీసాను రోజూ పఠించే వ్యక్తి జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని.. అతని జీవితంలో ఎటువంటి సమస్య ఉండదని ఒక నమ్మకం.
  2. హనుమాన్ చాలీసా పఠించే వ్యక్తికి శక్తి, బలం, తెలివి, జ్ఞానాన్ని ఇస్తాడు. అన్ని దుఃఖాలను దూరం చేస్తాడని విశ్వాసం
  3. హనుమంతుడిని సానుకూలతకు చిహ్నంగా భావిస్తారు. ఆంజనేయస్వామి అపారమైన శక్తి సంపన్నుడు. భయాందోళనకు దుష్ట శక్తుల ప్రభావం ఉందని భావించే సమయంలో భక్తులు హనుమాన్ చాలీసా చదవడం వల్ల ఎలాంటి భయం ఉండదు.
  4. వాయు నందనుడైన హనుమంతుడిని భక్తితో నిర్మలమైన హృదయంతో పూజించే వ్యక్తికి అన్ని వ్యాధుల నుండి విముక్తి లభిస్తుంది. ఎల్లపుడూ ఆరోగ్యంతో ఉంటాడు. హనుమంతుని ఆశీస్సులు ఆ వ్యక్తిపై ఎప్పుడూ ఉంటాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసేవారు అన్ని బంధాల నుండి విముక్తి పొంది గొప్ప ఆనందాన్ని పొందుతారు.
  7. నైతికత బలహీనంగా ఉన్న వ్యక్తి .. విశ్వాసం లోపించిన వ్యక్తి ప్రతిరోజూ హనుమాన్ చాలీసాను పఠించాలి. అతనిపై భజరంగ బలి  ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి. అతని శక్తి కూడా పెరుగుతుంది. భయం తొలగిపోతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)