Tirumala: శ్రీవారి ఆలయ బంగారు తాపడం పనులను వాయిదా.. కారణం ఏంటో తెలిపిన టీటీడీ చైర్మన్..

శ్రీవారి ఆలయ బంగారు తాపడం పనులను వాయిదా వేస్తున్నట్లుగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ..

Tirumala: శ్రీవారి ఆలయ బంగారు తాపడం పనులను వాయిదా.. కారణం ఏంటో తెలిపిన టీటీడీ చైర్మన్..
Tirumala Ananda Nilayam
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 27, 2023 | 11:25 AM

తిరుమల శ్రీవారి ఆలయ బంగారు తాపడం పనులను వాయిదా పడ్డాయి. ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు వాయిదా వేస్తున్నట్లుగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ.. గోవిందరాజస్వామి ఆలయంలో బంగారు తాపడం పనులు రెండు సంవత్సరాలు అయినా ఇంకా పూర్తి కాలేదని.. శ్రీవారి ఆలయానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా పనులు వేగవంతంగా నిర్వహించేందుకు గ్లోబల్ టెండర్లు పిలవాలని భావిస్తున్నామన్నారు. ఆరు నెలల కాల పరిమితిలో టెండర్ల ప్రకియ పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తాన్నామన్నారు. ఇదిలావుంటే, రథసప్తమికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామన్నారు.

బంగారు తాపడం పనులకు బంగారంను భక్తులు కానుకగా ఇచ్చిన దానినే ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వైకుంఠ ద్వారా దర్శనాలలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. పది రోజులపాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచుతాంమని చెప్పారు.

గత రెండేళ్ల కాలంలో స్థానికులకు ప్రాధాన్యత ఇచ్చిన విధంగానే ఈ ఏడాది సైతం తిరుపతిలో స్ధానికుల కోసం కౌంటర్లు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం