Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Shivaratri: మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్.. మహా శివరాత్రి శ్రీశైల పాదయాత్ర ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నదంటే..

ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి 18వ తేదీ శనివారం వచ్చింది. దీంతో శివ క్షేత్రాల్లో ప్రసిద్ధి చెందిన శ్రీశైలం దర్శనం కోసం భక్తులు పాదయాత్రగా వెళ్లారు. ఈ నేపథ్యంలో మహా శివరాత్రి శ్రీశైల పాదయాత్ర 2023 కు  ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Maha Shivaratri: మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్.. మహా శివరాత్రి శ్రీశైల పాదయాత్ర ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నదంటే..
Srisailam Temple
Follow us
Surya Kala

|

Updated on: Jan 26, 2023 | 9:04 AM

హిందువుల క్యాలెండర్ లో ప్రతి నెల వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అని అంటారు. మాఘమాసం కృష్ణ పక్ష చతుర్దశి రోజున వచ్చే శివరాత్రిని మహా శివరాత్రి అంటారు. ఈ మహాశివరాత్రి హిందువుల పండుగల్లో ప్రశస్తమైనది. ప్రతి సంవత్సరం మాఘ మాసం బహుళ చతుర్దశి..  చంద్రుడు..  శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రలో ఉన్న సమయంలో మహా శివరాత్రి వస్తుంది. శివుడు శివరాత్రి రోజునే  లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. అంతేకాదు శివ, పార్వతుల వివాహం జరిగిన రోజు.. దీంతో హిందువులు ఈ పండగను అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహిస్తారు. ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి 18వ తేదీ శనివారం వచ్చింది. దీంతో శివ క్షేత్రాల్లో ప్రసిద్ధి చెందిన శ్రీశైలం దర్శనం కోసం భక్తులు పాదయాత్రగా వెళ్లారు. ఈ నేపథ్యంలో మహా శివరాత్రి శ్రీశైల పాదయాత్ర 2023 కు  ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ శ్రీశైల పాదయాత్ర కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురం నుండి మాహపాదయత్ర ఈ ఏడాది ఫిబ్రవరి నెల 11 వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఓం నమః శివాయః అంటూ భక్తులు మల్లన్న క్షేత్రానికి కాలినడకతో 45 కిలోమీటర్ల మేర పయనం అవుతారు. ఈ పాదయాత్రకు కొన్ని వందల చరిత్ర ఉంది. భక్తులు అనేక నియమ నిబంధనలను పాటిస్తూ.. మల్లన్న భ్రమరాంబాలను మహాశివరాత్రి రోజున దర్శించుకోవడానికి బయలుదేరుతారు.

భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన నియమాలు.. ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక శైవ క్షేత్రం శ్రీశైలంకి కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాచీన నడక దారి ఉంది. ఈ పవిత్రమైన దారిలో శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్యులు, శ్రీ కృష్ణ దేవరాయలు లాంటి వారు ఎందరో పయనించి.. మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో పాదయాత్రను చేపట్టే భక్తులు ఆ పవిత్ర నడక దారిలో వెళ్ళేటప్పుడు ఆ పవిత్రతను కాపాడుకుంటూ వెళ్ళాలి. ఈ పాదయాత్ర నడక దారి దేశంలో అతి పెద్ద పులుల సంరక్షణ కేంద్రమైన నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ గుండా సాగుతుంది. కనుక ఈ అడవులు పులులు చిరుతలు, ఎలుగుబంట్లు వంటి కౄర జంతువులతో పాటు అడవి కుక్కలు వివిధ రకాలైన జింకలకు నిలయం. కనుక పాదయాత్ర చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

అంతేకాదు అటవీ ప్రాంతాన్ని ప్లాస్టిక్ వ్యర్థాలతో నింపవద్దని అటవీశాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తూ ఉంటారు. భక్తులు చేసే పాదయాత్రలో నడకడారిలో అనేకమంది దాతలు అన్నదానం, జలదానం చేస్తుంటారు. ఈ యాత్రలో వెంకటాపురం నాగలూటీ పెద్దచెరువు భీముని కొలను కైలాస ద్వారం వద్ద అన్నదానం ఉంటుంది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ పాదయాత్ర జరుగుతుంది కనుక విపరీతమైన చలి ఉంటుంది. కనుక తగిన ఏర్పాట్లు చేసుకుని భక్తులు పాదయాత్ర చేపట్టాలి.శివయ్య నామస్మరణతో అయన రక్షణలో పాదయాత్ర చేసి.. మల్లన్న క్షేత్రనికి చేరుకొని మహాశివరాత్రి రోజున భోళాశంకరుడిని దర్శించుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..