Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Mantra: సంతోషంగా జీవించడానికి సమయం కోసం ఎదురుచూడకండి.. మీరే సందర్భాన్ని సృష్టించుకోండి..

కొన్ని వస్తువులను పొందడానికి మంచి సమయం వస్తుందని చాలాసార్లు ఎదురుచూస్తూ ఉంటారు. అయితే మంచి సమయం అనేది తనంతట తానే రాదు. అయితే కృషి, పట్టుదలతో శుభ సమయం ఏర్పడుతుంది

Success Mantra: సంతోషంగా జీవించడానికి సమయం కోసం ఎదురుచూడకండి.. మీరే సందర్భాన్ని సృష్టించుకోండి..
Life Quotes
Follow us
Surya Kala

|

Updated on: Jan 23, 2023 | 9:46 AM

మానవ జీవితం అన్ని రకాల సవాళ్లు,  పోరాటాలతో నిండి ఉంది. భూమ్మీద పుట్టిన తర్వాత జీవితాన్ని అందంగా మలచుకోవడం కోసం నిరంతరం కష్టపడుతూనే ఉంటాడు. చిన్నతనంలో చనువు కోసం అష్టకష్టాలు పడతాడు. పెద్దయ్యాక కెరీర్ కోసం కష్టపడతాడు.  చదువుకున్న తర్వాత సంపాదించడానికి చాలా కష్టపడతాడు. కెరీర్ లో స్థిరపడిన వ్యక్తి తన జీవితానికి సంబంధించిన అన్ని ఆనందాలను పొందగలడు. మనిషి జీవితం ఆనందంగా, విజయవంతంగా గడపాలంటే పనికిమాలిన విషయాల కోసం సమయాన్ని వృథా చేసుకోకుండా లక్ష్యాన్ని ఏర్పరచుకుని దాన్ని సాధించే ప్రయత్నం చేయాలని మహాపురుషులు చెబుతారు.

జీవితంలోని కొన్ని విషయాల గురించి మనం చాలాసార్లు భయపడతాము. ఎంత ప్రయత్నించినా కొన్నిటిని పొందలేమని ఆలోచించిన క్షణం, మీరు విజయం నుండి దూరం అవుతారు. అదే విధంగా.. కొన్ని వస్తువులను పొందడానికి మంచి సమయం వస్తుందని చాలాసార్లు ఎదురుచూస్తూ ఉంటారు. అయితే మంచి సమయం అనేది తనంతట తానే రాదు. అయితే కృషి, పట్టుదలతో శుభ సమయం ఏర్పడుతుంది. జీవితానికి సంబంధించిన ఇలాంటి అమూల్యమైన విషయాలను తెలుసుకోవాలంటే సక్సెస్ సూత్రాల గురించి తెలుసుకోవాల్సిందే..

  1. మానవ జీవిత లక్ష్యం దాన ధర్మం.. ఎవరైనా ఈ లక్ష్యాన్ని నెరవేర్చినట్లయితే, అతను విజయం సాధించినట్లు చెప్పవచ్చు
  2. మానవ జీవితం ఒక సైకిల్ వంటిది. మీరు జీవన సమతుల్యతను కాపాడుకోవాలంటే.. నిరంతరం శ్రమిస్తూ ఉండాలి.
  3. ఇవి కూడా చదవండి
  4. జీవితంలో సరైన వ్యక్తుల కోసం ఎప్పుడూ వెతకకండి.. మీరే సరైన వ్యక్తిగా మారండి. మిమ్మల్ని కలవడం ద్వారా వేరొకరి శోధన నెరవేరుతుందని గుర్తించండి.
  5. పెన్ను కిందికి వంగినప్పుడు మాత్రమే అందంగా, సులభంగా రాయగలదు. మనిషి జీవితం కూడా అటువంటిదే.. జీవితం  విజయవంతం కావడానికి వినయంగా ఉండండి.
  6. విశ్వాసం, తృప్తి , ఆరోగ్యం అనే మూడు విషయాలను జీవితంలో సంపాదించాలి. ఎందుకంటే విశ్వాసం ఉత్తమ సంబంధం, సంతృప్తి గొప్ప సంపద, ఆరోగ్యమే గొప్ప బహుమతి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)