Jogulamba: జోగులాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. ఈ నెల 26న అమ్మవారు నిజరూప దర్శనం

అష్టాదశ శక్తిపీఠాలో ఒకటైనా అలంపూర్‌ జోగులాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Jogulamba: జోగులాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. ఈ నెల 26న అమ్మవారు నిజరూప దర్శనం
Jogulamba Brahmotsavam
Follow us
Surya Kala

|

Updated on: Jan 23, 2023 | 7:24 AM

అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవది, తెలంగాణలో ఏకైక శక్తి పీఠం, దక్షిణ కాశీగా పిలిచే అలంపూర్‌ బాల బ్రహ్మేశ్వరస్వామి, జోగులాంబ అమ్మవారి 18వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 26 వరకూ బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. రజాకార్ల సమయంలో జోగులాంబ అమ్మవారి మూలవిరాట్‌ను బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో భద్రపరిచి, 2005లో వసంత పంచమిరోజున కొత్తగా నిర్మించిన ఆలయంలో విగ్రహ ప్రతిష్ట నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతియేటా వసంత పంచమికి ఐదు రోజులు ముందు నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారి 18 వ వార్షిక బ్రహ్మోత్సవాలను గణపతి పూజ, పుణ్యాహవాచనం, రిత్విక్ వరణం, మహా కలశ స్థాపన, యాగశాల ప్రవేశంతో ప్రారంభించారు

గతంలో వసంత పంచమి రోజున వెయ్యి కళశాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించేవారు. కానీ ఈసారి ఐదు రోజులపాటు వెయ్యి కళశాలతో నిత్యం అవగాహన పూజా కార్యక్రమాలు చేసి అభిషేకం చేస్తారు. ఇక చివరిరోజైన ఈ నెల 26వ తేదీన అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించనున్నారు. ఆ తర్వాతే అమ్మవారు భక్తులకు నిజరూప దర్శనమిస్తారని ఆలయ ఈవో, అర్చకులు తెలిపారు. అమ్మవారు ఎలాంటి బంగారు ఆభరణాలు పూలదండలు లేకుండా అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారని పేర్కొన్నారు.

తుంగభద్రానది ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ దక్షిణ కాశీగా, అలంపూర్‌ క్షేత్రం శ్రీశైలం పక్షిమ ద్వారంగా పిలవబడుతున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..