Telugu News » Spiritual » Vastu tips in tleugu: according to vastu shastra know vastu tips for happy life
Vastu Tips: ఈ వాస్తు నియమాలను పాటించి చూడండి.. జీవితంలో సమస్యలు తగ్గి.. ఆనందం మీ సొంతం
Surya Kala |
Updated on: Jan 22, 2023 | 8:48 PM
ఇంట్లో సంతోషం, ఐశ్వర్యం, శాంతి నెలకొనాలంటే వాస్తు శాస్త్రంలో పేర్కొన్న నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి దురదృష్టాన్ని అదృష్టంగా మార్చడంలో సహాయపడే వాస్తు నివారణలను కొన్నిటిని తెలుసుకుందాం..
Vastu Tips For North
వాస్తు శాస్త్రంలో దిశలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వాస్తు ప్రకారం ఇంట్లో వాస్తుదోషం ఉంటే రకరకాల సమస్యలు ఎదురవుతాయి. ఇంటి వాస్తు దోషాలను పోగొట్టడానికి వాస్తు శాస్త్రంలో అనేక రకాల పరిహారాలు చెప్పబడ్డాయి. ఈ వాస్తు నియమాలను పాటించడం వల్ల ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి. అంతే కాకుండా ఇంట్లో సంతోషం, ఐశ్వర్యం, శాంతి నెలకొనాలంటే వాస్తు శాస్త్రంలో పేర్కొన్న నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి దురదృష్టాన్ని అదృష్టంగా మార్చడంలో సహాయపడే వాస్తు నివారణలను కొన్నిటిని తెలుసుకుందాం..
మీరు ఎంత డబ్బులు సంపాదించినా ఆ డబ్భులు ఖర్చు అవుతుంటే.. ఈ డబ్బును ఆదా చేయలేకపోతే.. ఇంటి ఆగ్నేయ దిశలో గోడల నుండి ముదురు రంగును తొలగించాలి. బదులుగా.. లేత నారింజ, గులాబీ రంగులను ఉపయోగించాలి.
అదృష్టాన్ని పెంపొందించుకోవడానికి.. ఇంట్లో ఉండే అగ్ని సంబంధిత వస్తువులను ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో ఉంచాలి. అంతేకాదు విద్యుత్ పరికరాలు పాడవకుండా లేదా వాటిని నుండి శబ్దం రాకూడదని కూడా గమనించాలి.
ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు కోసం, ఇంట్లో అతిథుల స్థానం ఉత్తరం లేదా పడమర వైపు ఉండాలి.
వాస్తు ప్రకారం ఇంట్లో మురికి, సాలెపురుగులు ఉంటే ప్రతికూల శక్తులు పెరుగుతాయి. కనుక ఇంటి ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిలోని సాలెపురుగులు, మురికిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండండి.
మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే.. క్రమం తప్పకుండా నీరు పెట్టాలి. తులసి మొక్క ఎండిపోయినప్పుడు, ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
తలుపులు .. కిటికీలు తెరిచేటప్పుడు లేదా మూసివేసేటప్పుడు శబ్దాలు వచ్చే ఇళ్లలో వాస్తుదోషం ఎక్కువగా ఉంటుంది.
ఇంట్లో గరిష్టంగా పాజిటివ్ ఎనర్జీ వచ్చే ప్రదేశం పూజా స్థలం. వాస్తు ప్రకారం పూజా స్థలం ఈశాన్యంలో ఉండాలి.
వాస్తు ప్రకారం.. ఒక వ్యక్తి ఎప్పుడూ తన పాదాలను దక్షిణం వైపు ఉంచి నిద్రించకూడదు.
ఇంట్లో వాస్తు దోషాల నివారణకు ప్రధాన ద్వారం మీద గణేష్ విగ్రహం, ఓం , స్వస్తిక్ గుర్తులు ఉండాలి.