Tirumala Drone: ఆలయం డ్రోన్ దృశ్యాల వ్యవహారం.. రాజకీయ వివాదం.. వైసీపీ- బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం

ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం తిరుమల ఆలయంపై డ్రోన్లు ఎగరవేసేందుకు అనుమతుల్లేవు. అయినా సరే కిరణ్‌ అనే ఒక వ్యక్తి ఇక్కడ డ్రోన్ ఎగరవేసి.. ఆలయ దృశ్యాలు చిత్రంచడం పెను రాజకీయ వివాదంగా మారింది. వైసీపీ- బీజేపీ మధ్య పెద్ద మాటల యుద్ధమే నడుస్తోంది. 

Tirumala Drone: ఆలయం డ్రోన్ దృశ్యాల వ్యవహారం.. రాజకీయ వివాదం.. వైసీపీ- బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం
Tirumala Drone Video
Follow us

|

Updated on: Jan 22, 2023 | 5:45 PM

తిరుమల శ్రీవారి ఆలయ డోన్ దృశ్యాల కేసులో కీలక అప్ డేట్ చోటు చేసుకుంది. ఈ దృశ్యాలు చిత్రించిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఆధ్యాత్మిక కేంద్ర తిరుమలపై డ్రోన్ ఎగరవేయడంపై నిషేధం ఉన్న నేపథ్యంలో ఇది శ్రీవారి ఆలయంపై చేస్తున్న  దుష్ప్రచారమా- కుట్రకోణమా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. మరోవైపు ఇదే విషయంపై అధికార పార్టీ వైసీపీ నేతలు..  బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం తిరుమల ఆలయంపై డ్రోన్లు ఎగరవేసేందుకు అనుమతుల్లేవు. అయినా సరే కిరణ్‌ అనే ఒక వ్యక్తి ఇక్కడ డ్రోన్ ఎగరవేసి.. ఆలయ దృశ్యాలు చిత్రంచడం పెను రాజకీయ వివాదంగా మారింది. వైసీపీ- బీజేపీ మధ్య పెద్ద మాటల యుద్ధమే నడుస్తోంది.

ఒక దశలో ఇవి త్రీడీ ఇమేజ్ లేదా గూగుల్ లైవ్ వీడియో అయి ఉండొచ్చని భావించారు. టీటీడీపై బురద జల్లే యత్నమనీ ఆరోపించారు. ఈ దిశగా టీటీడీ ఒక ప్రకట కూడా రిలీజ్ చేసింది. వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి పరిశీలిస్తామనీ అన్నారు టీటీడీ భద్రతాధికారులు. హైదరాబాద్ కు చెందిన కిరణ్ రెడ్డి అనే వ్యక్తి మొన్న ఇన్ స్టా గ్రామ్ లో ఈ వీడియో పోస్ట్ చేసినట్టు గుర్తించారు అధికారులు. గత నవంబర్ 13న అతడీ వీడియో అప్ లోడ్ చేశాడు. మొన్న ఇన్ స్టా నుంచి ఈ వీడియోను డిలీట్ చేశాడు. ఐకాన్ ఫ్యాక్ట్స్ అనే తన ఛానల్ నుంచి నిన్న డ్రోన్ షాట్స్ ను సైతం తొలగించాడు. అయితే ఇది దుష్ప్రచారమా- లేక కుట్ర కోణమా అనే అంశంపై తాము విచారణ జరుపుతామని అన్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.

శ్రీవారి ఆలయం ఒక మహిమాన్విత శక్తి క్షేత్రం. ఇక్కడ శ్రీవారు దివ్యశక్తితో ఉంటారు. అందుకే ఆలయంపై విమానాల ప్రయాణం లేదా మరేదైనా వస్తువు ఎగరవేయటం నిషిద్ధమని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే తిరుమలకు ఉగ్రవాదుల ముప్ప ఉందని నిఘా వర్గాలు పదే పదే హెచ్చరిస్తున్నారనీ. ఈఘటనకు కారకులైన వారి నుంచి.. నిర్లక్ష్యం వహించిన వారి వరకూ.. అందరిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నాయకులు. డ్రోన్ దృశ్యాల వెనకున్న శక్తులను బయట పెట్టాలని కోరుతున్నారు.

ఇంతకీ ఈ దృశ్యాల చిత్రణ ఎలా జరిగిందని ఆరా తీసిన టీటీడీ అధికారులకు.. కొన్ని విషయాలు తెలిసాయి. గతేడాది కాకులకోనలో.. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వీడియోలను చిత్రీకరించేందుకు అనుమతించింది టీటీడీ. ఆ సమయంలో శ్రీవారి ఆలయ డ్రోన్ దృశ్యాలు చిత్రించాడీ డ్రోన్ ఆపరేటర్. ఇప్పుడీ వీడియోలు బయటకు రావడంతో ఇవి గ్రాఫిక్స్, గుగూల్ వీడియో కావని తేలడంతో చర్య తీసుకున్నారు పోలీసులు. శ్రీవారి ఆలయంపై డ్రోన్ దృశ్యాల వ్యవహారంపై కిరణ్ అనే వ్యక్తిపై IPC సెక్షన్ 447 కింద కేసు నమోదు చేశారు అధికారులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..