AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holi 2023: ఈ ఏడాది హొలీ పౌర్ణమి ఏ తేదీన వచ్చిందంటే.. రంగుల పండగను జరుపుకునే శుభ ముహర్తం ఎప్పుడంటే..

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే హొలీ పండుగ ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది?  ఏ రోజున హోలికా దహనం చేస్తారు.. ఏ రోజు రంగులు ఆడతారు? ఈ పవిత్ర పండుగకు సంబంధించిన శుభ సమయం గురించి వివరాలను ఈరోజు తెలుసుకుందాం.

Holi 2023: ఈ ఏడాది హొలీ పౌర్ణమి ఏ తేదీన వచ్చిందంటే.. రంగుల పండగను జరుపుకునే శుభ ముహర్తం ఎప్పుడంటే..
Holi
Surya Kala
|

Updated on: Jan 20, 2023 | 6:18 PM

Share

హోలీ పండుగ హిందూమతంలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. వసంత కాలంలో వచ్చే ఈ రంగుల పండగను మన దేశంలో మాత్రమే కాదు.. నేపాల్, బంగ్లాదేశ్ లతో పాటు ప్రవాస భారతీయులు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున హొలీ పండగను దేశ విదేశాల్లో ఘనంగా జరుపుకుంటారు. కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే జనాలు ఆసక్తిగా హొలీ కోసం  ఎదురుచూస్తూ ఉంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే హొలీ పండుగ ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది?  ఏ రోజున హోలికా దహనం చేస్తారు.. ఏ రోజు రంగులు ఆడతారు? ఈ పవిత్ర పండుగకు సంబంధించిన శుభ సమయం గురించి వివరాలను ఈరోజు తెలుసుకుందాం.

హోలికా దహన శుభ సమయం:  పంచాంగం ప్రకారం..  ఈ సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి మార్చి 06, 2023న సాయంత్రం 04:17 గంటలకు ప్రారంభమై మార్చి 07, 2023 సాయంత్రం 06:09 గంటలకు ముగుస్తుంది. దీంతో ఈ సంవత్సరం హోలికా దహనం మార్చి 07, 2023న నిర్వహించనున్నారు.

రంగులతో ఏ రోజున ఆడుకుంటారంటే:  హోలీ పవిత్ర పండుగ రంగు, ఉత్సాహం, ఆనందానికి సంబంధించినది. రంగులను ఈ సంవత్సరం 08 మార్చి 2023న జల్లుకుంటూ హోలీని జరుపుకోనున్నారు. ఈ రోజున దేశంలోని అన్ని ప్రాంతాలలో, ప్రజలు రకరకాల రంగులతో హోలీ ఆడుకోనున్నారు.

ఇవి కూడా చదవండి

హోలీ మతపరమైన ప్రాముఖ్యత హిందూ మత విశ్వాసం ప్రకారం.. హోలీ హోలిక, ప్రహ్లాదులకు సంబంధించినది. ఈ రోజున హోలిక శ్రీ విష్ణువు పరమ భక్తుడైన ప్రహ్లాదుడిని చంపడానికి అగ్నిలో వేసినప్పుడు.. శ్రీహరి అనుగ్రహంతో ప్రహ్లాదునికి ఏమీ జరగలేదని.. అతను సురక్షితంగా బయటపడ్డాడని నమ్ముతారు. అయితే హోలిక అదే అగ్నిలో పడి బూడిదగా మారిపోయింది. హిందూ పురాణాల ప్రకారం.. హోలీకి 8 రోజుల ముందునుంచి ప్రహ్లాదుడిని హోలిక హింసించడం ప్రారంభించింది. అందుకే హోలీకా దహన్‌కు ఎనిమిది రోజుల ముందు హోలీ అష్టకం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయరు.

హోలీ అష్టకం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే..  పంచాంగ్ ప్రకారం, 2023 సంవత్సరంలో, హోలీ అష్టకం 27 ఫిబ్రవరి 2023 నుండి ప్రారంభమవుతుంది.  08 మార్చి 2023 వరకు ఉంటుంది. హిందూ విశ్వాసాల ప్రకారం..  ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు నిర్వహించరు. హోలిక ..  ప్రహ్లాదుడులకు సంబంధించిన కథ మాత్రమే కాదు.. మరొక కథ కూడా ప్రచారం లో ఉంది. దీని ప్రకారం, ఒకసారి ఇంద్రుడు కోరిక మేరకు.. మన్మథుడు  శివుని తపస్సును భంగం చేశాడు. దీంతో శివుడు కోపించి తన మూడవ కన్నుతో మన్మథుడిని భస్మం చేశాడు. మహాదేవుడు కామదేవుని భస్మం చేసిన రోజు ఫాల్గుణ మాసంలోని అష్టమి తిథి. తన భర్త మరణాంతరం.. మన్మథుడు భార్య రతి అదే రోజు నుండి వరుసగా 8 రోజులు కఠోర తపస్సు చేసి. శివయ్యను ప్రసన్నం చేసుకుంది. శివుడి వారంతో తన భర్త మన్మథుడిని తిరిగి బతికించుకుంది. ఈ ఎనిమిది రోజులను హిందూ మతంలో హోలీ అష్టకం అంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

Follow Us
వైద్యం కావాలని వచ్చి కత్తులతో నరికి చంపేశారు.. ఎక్కడంటే
వైద్యం కావాలని వచ్చి కత్తులతో నరికి చంపేశారు.. ఎక్కడంటే
హైదరాబాద్‌లో తొలిసారిగా డబుల్ డెక్కర్ కారిడార్.. ఎక్కడంటే..?
హైదరాబాద్‌లో తొలిసారిగా డబుల్ డెక్కర్ కారిడార్.. ఎక్కడంటే..?
ఉన్నట్లుండి భారీగా పడిపోయిన బంగారం ధరలు.. ఇప్పుడు ఎంతంటే..?
ఉన్నట్లుండి భారీగా పడిపోయిన బంగారం ధరలు.. ఇప్పుడు ఎంతంటే..?
రెడ్‌ డ్రెస్‌లో అదిరిపోయిన బెబో లుక్
రెడ్‌ డ్రెస్‌లో అదిరిపోయిన బెబో లుక్
ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ఏఎస్ఐ లీలలు.. అప్పట్లోనే..
ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ఏఎస్ఐ లీలలు.. అప్పట్లోనే..
పాండ్యా బ్రదర్స్ మధ్య ముదిరిన విబేధాలు? .. సాక్ష్యం ఇదే
పాండ్యా బ్రదర్స్ మధ్య ముదిరిన విబేధాలు? .. సాక్ష్యం ఇదే
ఉదయాన్నే టిఫిన్ బదులు ఇది తిని చూడండి.. దెబ్బకు బాడీ కూల్‌
ఉదయాన్నే టిఫిన్ బదులు ఇది తిని చూడండి.. దెబ్బకు బాడీ కూల్‌
ఊరికి కొత్త.. రెస్టారెంట్‌ అనుకుని చావు ఇంటికి వెళ్లిన పర్యాటకులు
ఊరికి కొత్త.. రెస్టారెంట్‌ అనుకుని చావు ఇంటికి వెళ్లిన పర్యాటకులు
వామ్మో.. కండలు తిరిగిన బాడీతో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్.
వామ్మో.. కండలు తిరిగిన బాడీతో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్.
ఆర్‌సీబీ స్టార్ ప్లేయర్ టిమ్ డేవిడ్‌కు షాక్
ఆర్‌సీబీ స్టార్ ప్లేయర్ టిమ్ డేవిడ్‌కు షాక్