AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Magha Masam: మీ జాతకంలో దోషం ఉందా.. మాఘమాసంలో శంఖాన్ని ఇలా పూజించి చూడండి..

మాఘ మాసంలో నియమ నిబంధనల ప్రకారం శంఖాన్ని పూజిస్తే మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవి కూడా ప్రసన్నులవుతారని విశ్వాసం. ఈరోజు శంఖానికి సంబంధించిన కొన్ని ఎఫెక్టివ్ రెమెడీస్ తెలుసుకుందాం.

Magha Masam: మీ జాతకంలో దోషం ఉందా.. మాఘమాసంలో శంఖాన్ని ఇలా పూజించి చూడండి..
Maghamasam 2023
Surya Kala
|

Updated on: Jan 20, 2023 | 7:38 PM

Share

తెలుగు నెలల్లో 11 వ నెల మాఘ మాసం.. ఈ మాసం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనది. ఈ మాఘమాసం ఈ ఏడాది జనవరి 22 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మాఘమాసంలో హిందూ సంప్రదాయం ప్రకారం.. నదీస్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించడం అత్యంత పవిత్రమైంది. కోటి క్రతువులు చేసినంత ఫలితం లభిస్తుందని విశ్వాసం.. అంతేకాదు ఈ మాసంలో శంఖానికి చేసే పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మాఘ మాసంలో నియమ నిబంధనల ప్రకారం శంఖాన్ని పూజిస్తే మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవి కూడా ప్రసన్నులవుతారని విశ్వాసం. ఈరోజు శంఖానికి సంబంధించిన కొన్ని ఎఫెక్టివ్ రెమెడీస్ తెలుసుకుందాం.

  1. మీరు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే.. మాఘ మాసంలో ప్రతిరోజూ శంఖాన్ని పూజించండి. మీ ఇంటిలోని పూజ గదిలో లేదా మీ పూజా స్థలంలో ఎక్కడైనా శంఖాన్ని ఏర్పాటు చేసుకుని సాంప్రదాయం ప్రకారం పూజ చేయండి. శంఖాన్ని పూజించడం వల్ల ధన, ధాన్యాలతో పాటు ఆ ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు.
  2. శ్రీమహావిష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి, దక్షిణవర్తి శంఖంలో పాలు నింపి, దానితో విష్ణువును అభిషేకించండి. ఇలా చేయడం వలన శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిలు ప్రసన్నం అవుతారు.
  3. ఎవరి జాతకంలో దోషం ఉందొ.. వారు మాఘ మాసంలో శంఖాన్ని పూజించండి. ముఖ్యంగా ఎవరి జాతకంలో శుక్ర గ్రహం బలహీనంగా ఉందో, వారు తప్పనిసరిగా శంఖ పూజ చేయాలి. అనంతరం శంఖం, బియ్యం ను తెల్లటి గుడ్డలో చుట్టి ప్రవహిస్తున్న నది నీటిలో విడిచి పెట్టండి.
  4. మాఘ మాసంలో శంఖాన్ని దానం చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వీలైతే శ్రీవిష్ణువు ఆలయానికి వెళ్లి శంఖాన్ని దానం చేయండి. ఇలా చేయడం వలన అన్ని దోషాలను తొలగిపోతాయని విశ్వాసం.
  5. ఇవి కూడా చదవండి
  6. అనేక రకాల శంఖాలు ఉన్నప్పటికీ.. మాఘ మాసంలో మాత్రం ముత్యాల శంఖానికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. ఈ శంఖాన్ని మీ అల్మరాలో సురక్షితంగా ఉంచండి. ఒక తెల్లటి బట్ట తీసుకుని శంఖాన్ని పసుపు, బియ్యం వేసి మూసివేయాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇంటిలో లక్ష్మీదేవి ఆశీర్వాదాలు ఎల్లపుడూ ఉంటాయని.. ఎప్పుడూ ధన , ధాన్యాలకు ఇబ్బంది ఏర్పడదని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)