Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vipreet Raj Yoga: జ్యోతిష్య శాస్త్రంలో వ్యతిరేక రాజయోగం ప్రాముఖ్యత ఏమిటి.. విమల రాజయోగంలో జన్మించిన వ్యక్తి లక్షణాలు ఏమిటంటే..

జ్యోతిష్య శాస్త్రంలో రాజయోగం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మొత్తం 30 రాజయోగాలు ఉన్నాయి.  ఈ రాజయోగాల్లో మూడు వ్యతిరేక రాజయోగాలున్నాయి.

Vipreet Raj Yoga: జ్యోతిష్య శాస్త్రంలో వ్యతిరేక రాజయోగం ప్రాముఖ్యత ఏమిటి.. విమల రాజయోగంలో జన్మించిన వ్యక్తి లక్షణాలు ఏమిటంటే..
Horoscope
Follow us
Surya Kala

|

Updated on: Jan 20, 2023 | 4:05 PM

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ప్రతి వ్యక్తి జాతకంలో అనేక శుభ , అశుభ యోగాలు ఏర్పడతాయి. జాతకంలో శుభ యోగం ఏర్పడితే.. ఆ  వ్యక్తి చాలా అదృష్టవంతుడు.. ధనవంతుడు అవుతాడు. జాతకంలో రాజయోగం ఏర్పడినప్పు.. ఆ వ్యక్తిని అతను ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్తాయికి తీసుకువెళుతుంది. రాజయోగం వల్ల మనిషి జీవితంలో డబ్బుకు, గౌరవానికి, సౌఖ్యానికి లోటు ఉండదు. జ్యోతిష్య శాస్త్రంలో రాజయోగం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మొత్తం 30 రాజయోగాలు ఉన్నాయి.  ఈ రాజయోగాల్లో మూడు వ్యతిరేక రాజయోగాలున్నాయి. ఈ మూడింటిలో వ్యతిరేక రాజయోగాల్లో హర్ష రాజయోగం, సరళ రాజయోగం,  విమల రాజయోగాలున్నాయి.

జ్యోతిషశాస్త్రంలో వ్యతిరేక రాజయోగం ప్రాముఖ్యత శుభ యోగాలలో ఎదురుగా ఉండే రాజయోగం ఒకటి. జ్యోతిష్య శాస్త్రంలో ఇది చాలా పవిత్రమైన యోగంగా పరిగణించబడుతుంది. ప్రతికూల భావాలు కలిగిన గ్రహాలు కలసి రావడం వల్ల వ్యతిరేక రాజయోగం ఏర్పడుతుంది. సరళమైన భాషలో చెప్పాలంటే.. జాతకంలో మిగిలిన రెండు గృహాల్లో ఒకదానిలో ఆరు, ఎనిమిది,  పన్నెండవ గృహాలకు అధిపతి ఉన్నప్పుడు.. వ్యతిరేక రాజయోగం ఏర్పడుతుంది. ఏ వ్యక్తి జాతకంలో ఈ వ్యతిరేక రాజయోగం ఏర్పడితే.. ఆ వ్యక్తి జీవితంలో విజయం.. పురోగతిని పొందుతాడు. వ్యతిరేక రాజయోగం 3 రకాలు. హర్ష రాజయోగం, సరళ రాజయోగం,  విమల రాజయోగం.

జాతకంలో ఆరవ ఇంటికి స్థానాధిపతి ఎనిమిదవ లేదా పన్నెండవ ఇంట్లో ఉన్నప్పుడు..  అప్పుడు హర్ష రాజయోగం ఏర్పడుతుంది. మరోవైపు జాతకంలో 8వ గృహాధిపతి 6వ, 8వ ఇంట్లో ఉన్నప్పుడు సరళ రాజయోగం ఏర్పడగా, పన్నెండవ ఇంటి అధిపతి 6వ, 8వ ఇంట్లో ఉన్నప్పుడు విమల రాజయోగం ఏర్పడుతుంది.

ఇవి కూడా చదవండి

విమల రాజయోగం వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో వ్యతిరేక రాజయోగం ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాం. 12వ గృహాధిపతి 6వ స్థానములో ఉన్నప్పుడు, వ్యక్తి చాలా తెలివైనవాడు.. అంతేకాదు తన శత్రువులపై విజయం సాధించి.. జీవితంలో మంచి సంపదను సంపాదిస్తాడు. అంతేకాదు విమల రాజయోగం కలిగిన వ్యక్తులు చాలా నిర్భయ స్వభావం కలిగి ఉంటారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, 12 వ ఇంటి అధిపతి 8 వ ఇంట్లో ఉంటే.. ఆ వ్యక్తి క్షుద్ర శాస్త్రంలో పరిజ్ఞానం కలిగి ఉంటాడు. అలాంటి వారు కష్టాల నుంచి బయటపడటం చాలా మంచిది. మరోవైపు, 12 వ ఇంటి అధిపతి 12 వ ఇంట్లో ఉన్నప్పుడు, వ్యక్తి అన్ని రకాల సుఖాలను పొందుతాడు. విమల యోగా ఉన్న వ్యక్తి స్వతంత్ర వ్యక్తి..  తనను తాను నమ్ముకుంటాడు. ఇతరులపై ఆధారపడటం ఇష్టం ఉండదు.  ఈ యోగా ప్రభావం వల్ల ఒక వ్యక్తి తన గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)