AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ఇలాంటి ఆలోచన ఉన్న పిల్లలకు ఆస్తిని అప్పగించే తండ్రి తనకష్టాలను తానే కోరి తెచ్చుకున్నట్లే అన్న చాణక్య

కుటుంబ యజమాని తన సంపాదనను.. ఇతరులకు అప్పగించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చాణుక్య తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. ఎవరైనా తమ సంపద, ఆస్తులను తమ పిల్లలకు అప్పగించే ముందు జాగ్రత్తగా ఆలోచించాలని ఆచార్య చెప్పాడు

Chanakya Niti: ఇలాంటి ఆలోచన ఉన్న పిల్లలకు ఆస్తిని అప్పగించే తండ్రి తనకష్టాలను తానే కోరి తెచ్చుకున్నట్లే అన్న చాణక్య
Chanakya Niti
Surya Kala
|

Updated on: Jan 19, 2023 | 3:32 PM

Share

ఆచార్య చాణుక్యుడు తన జీవితంలో ఎక్కువ భాగం ప్రజలకు మార్గనిర్దేశం చేయడంలో గడిపాడు. ప్రతి మనిషి భర్త-భార్య, తల్లిదండ్రులు, అన్నదమ్ములు..  ఇతర సంబంధాలను ఎలా కాపాడుకోవాలి..  జీవితంలో మనం ఎలా ప్రవర్తించాలి అనే విషయాలను కూడా చాణక్యుడు తన నీతి గ్రంథంలో పేర్కొన్నాడు. చాణుక్యుడు చెప్పిన జీవన విధానాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ప్రజలు తమ జీవితంలో వాటిని అనుసరించడం ద్వారా సుఖ సంతోషాలతో జీవించవచ్చు. మనం డబ్బు ఎలా సంపాదించాలి,  ఖర్చు చేసేటప్పుడు ఏయే విషయాలను గుర్తుంచుకోవాలి అనే విషయాలను కూడా చాణక్యుడు చెప్పాడు. అంతేకాదు..కుటుంబ యజమాని తన సంపాదనను.. ఇతరులకు అప్పగించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చాణుక్య తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు.

ఎవరైనా తమ సంపద, ఆస్తులను తమ పిల్లలకు అప్పగించే ముందు జాగ్రత్తగా ఆలోచించాలని ఆచార్య చెప్పారు. ఇక్కడ  ఈరోజు చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి తన సంపద..  ఆస్తిని ఎవరికైనా అప్పగించే ముందు ఆలోచించాల్సిన విధానము..ఎవరికీ  అప్పగించాలో తెల్సుకుందాం..

ఎండిన చెట్టుకు నిప్పు పెడితే అడవి మొత్తం బూడిదగా మారుతుందని చాణక్యుడు చెప్పాడు. ఒక్క మురికి చేప చెరువు మొత్తాన్ని మురికిగా మార్చగలదు. అదే విధంగా .. జాలి దయ లేకుండా స్వార్ధం తో నిండి ఉన్న పిల్లలు కూడా ఇంటి మొత్తాన్ని నాశనం చేయగలడు. ప్రపంచం దృష్టిలో తండ్రికి పిల్లలు అత్యంత సన్నిహితులైనప్పటికీ, వాస్తవానికి స్వార్ధం నిండి ఉన్న పిల్లలు  తండ్రిని ఎప్పుడూ  దూరంగా ఉంచుతారని చాణక్యుడు చెప్పాడు.

ఇవి కూడా చదవండి

అలాంటి కొడుకు లేదా కూతురికి మీ డబ్బు లేదా ఆస్తిని అప్పగించే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించండి అని చాణక్యుడు చెప్పాడు.

జీవితంలో బంధాలు, డబ్బు ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేని కొడుకు మీ సంపదను, ఆస్తులను క్షణికావేశంలో నాశనం చేస్తాడు.

ఒక వ్యక్తి తన పిల్లలు, కుటుంబం కోసం జీవితంలో డబ్బు సంపాదిస్తాడు. ఇలాంటి నేపథ్యంలో మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు, ఆస్తులను స్వార్ధం నిండిన పిల్లలకు అప్పగించే ముందు ఆలోచించాలి.. వారికి ఆస్తులను ఇచ్చే విలువ ఉందో లేదో తెలుసుకోవాలని చాణక్య సూచించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)