Jupiter Transit 2023: కొత్త ఏడాదిలో రాశిని మార్చుకోనున్న బృహస్పతి.. ఈ గ్రహాలపై అనుగ్రహం.. పట్టిందల్లా బంగారమే..

2023 సంవత్సరంలో, శని, రాహు-కేతు, గురు వంటి పెద్ద గ్రహాలు తమ రాశిని మార్చుకోనున్నాయి. దేవగురువు బృహస్పతి తన రాశిని మార్చుకోవడం వల్ల 2023 సంవత్సరంలో జరిగే మార్పుల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం.. 

Jupiter Transit 2023: కొత్త ఏడాదిలో రాశిని మార్చుకోనున్న బృహస్పతి.. ఈ గ్రహాలపై అనుగ్రహం.. పట్టిందల్లా బంగారమే..
2023 Jupiter Transit
Follow us

|

Updated on: Jan 02, 2023 | 8:13 PM

కొత్త సంవత్సరం 2023 ప్రారంభమైంది. వేద జ్యోతిషశాస్త్రంలో ప్రతి సంవత్సరం రాశుల సంచారం ప్రకారం భవిష్యత్ ను అంచనా వేస్తారు. ఈ జ్యోతిష్య గణనాలు గ్రహాల రాశి చక్రంలోని మార్పులు, వాటి కదలికల మార్పులపై ఆధారపడి ఉంటాయి. 2023 సంవత్సరంలో..  చాలా చిన్న,పెద్ద గ్రహాలు తమ రాశిచక్రాలను మార్చుకోనున్నాయి. ఈ గమనం ఖచ్చితంగా స్థానికులందరిపై ప్రభావం చూపుతుంది. 2023 సంవత్సరంలో, శని, రాహు-కేతు, గురు వంటి పెద్ద గ్రహాలు తమ రాశిని మార్చుకోనున్నాయి. దేవగురువు బృహస్పతి తన రాశిని మార్చుకోవడం వల్ల 2023 సంవత్సరంలో జరిగే మార్పుల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం..

ఏప్రిల్ 2023లోరాశిని మార్చుకోనున్న బృహస్పతి  

వైదిక జ్యోతిష్యంలో బృహస్పతికి ప్రత్యేక స్థానం ఉంది. గురువు శుభ గ్రహంగా పరిగణిస్తారు. ఎల్లప్పుడూ శుభ ఫలితాలను ఇస్తుంది. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఏప్రిల్ 22, 2023న, బృహస్పతి తన సొంత రాశి మీన రాశిని వదిలి మంగళదేవుడు మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. బృహస్పతి ఒక రాశి నుండి మరొక రాశికి మారడానికి సుమారు 1 సంవత్సరం పడుతుంది. ఏప్రిల్ 22, 2023న, బృహస్పతి మేషరాశిలో సంచరిస్తున్నప్పుడు.. ఈ రాశిలో ఇప్పటికే ఉన్న రాహువుతో మైత్రి ఏర్పడుతుంది. గురు-రాహువుల కలయిక వల్ల గురు-చండాల దోషం ప్రభావితమవుతుంది.

ఇవి కూడా చదవండి

వేద జ్యోతిషశాస్త్రంలో బృహస్పతి ప్రాముఖ్యత వేద జ్యోతిషశాస్త్రంలో..  బృహస్పతి దేవతులకు గ్రహాలకు గురువుగా భావిస్తారు. అలాగే బృహస్పతి శుభ ఫలితాలను ఇచ్చే గ్రహం. బృహస్పతి గ్రహం రెండు రాశులకు అధినేత..  ధనుస్సు, మీన రాశిలకు అధిపతి గురు గ్రహం. కర్కాటక రాశిలో బృహస్పతి ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. మకర రాశి అత్యల్ప రాశిగా పరిగణించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గురువు అనుగ్రహం పొందిన వ్యక్తికి పరమైన జ్ఞానాన్ని పొందుతాడు. ఎవరి జన్మరాశిలో బృహస్పతి బలంగా ఉంటె అతని జన్మస్థానంలో పురోభివృద్ధి ఉంటుంది.

ధనుస్సు, మీన రాశులపై బృహస్పతి అనుగ్రహం  దేవగురువు బృహస్పతి ధనుస్సు , మీన రాశికి అధిపతి. దీంతో ఈ రెండు రాశులపై గురువు ఎల్లప్పుడూ తన ప్రత్యేక ఆశీర్వాదాలను ఇస్తాడు. గురువు ప్రత్యేక అనుగ్రహం కారణంగా.. ఈ రెండు రాశులకు చెందిన వ్యక్తులు వృత్తి , వ్యాపారాలలో మంచి విజయాన్ని పొందుతారు. ఉద్యోగస్థులకు పురోగతి లభిస్తుంది. గురువు అనుగ్రహంతో ఈ రెండు రాశుల వారికి సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)