Vaikuntha Ekadashi: వెంకన్నకు స్వర్ణ కిరీటాన్ని సమర్పించిన మంత్రి హరీష్ రావు.. కోటి రూపాయలతో భక్తుల సహకారంతో తయారీ

ముక్కోటి ఏకాదశి సందర్భంగా  సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్తర వైకుంఠ ద్వార దర్శనం ఇస్తున్నారు. తెల్లవారు జామునుంచే భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి బారులు తీరారు.

Vaikuntha Ekadashi: వెంకన్నకు స్వర్ణ కిరీటాన్ని సమర్పించిన మంత్రి హరీష్ రావు.. కోటి రూపాయలతో భక్తుల సహకారంతో తయారీ
Minister Harish Rao
Follow us
Surya Kala

|

Updated on: Jan 02, 2023 | 3:21 PM

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలు అంగరంగవైభంగా ముస్తాబయ్యాయి. తెల్లవారు జామునుంచే అన్ని దేవాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. ప్రముఖ క్షేత్రాలతో సహా అన్ని ప్రధాన దేవాలయాల్లో ఉత్తర ద్వారా దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా  సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్తర వైకుంఠ ద్వార దర్శనం ఇస్తున్నారు. తెల్లవారు జామునుంచే భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఉత్తర వైకుంఠ ద్వారం ద్వారా శ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

స్వామివారికి స్వర్ణ కిరీటాన్ని సమర్పించారు. ఈ స్వర్ణ కిరీటాన్ని హరీష్ రావు, భక్తుల సహకారంతో తయారు చేయించారు. అనంతరం పాత వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి హరీష్ రావుకు ఆలయ పురోహితులు పుర్ణకుంభంతో స్వాగతం పలికి, శాలువతో సత్కరించి, వేద ఆశీర్వాదం అందజేశారు. ఈకార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..