AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virgo Yearly Horoscope: కొత్త ఏడాదిలో కన్య రాశివారికి జనవరి నుంచి డిసెంబర్ వరకూ ఏ నెలలో ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకోండి..

ఏప్రిల్ 22 తర్వాత గురు-చండాల్ దోషం ఏర్పడుతుంది. అక్టోబర్ చివరలో, రాహువు మీనంలోకి ప్రవేశిస్తాడు. కేతువు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా ఈ రాశివారు కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు.

Virgo Yearly Horoscope: కొత్త ఏడాదిలో కన్య రాశివారికి జనవరి నుంచి డిసెంబర్ వరకూ ఏ నెలలో ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకోండి..
Virgo Yearly Horoscope
Surya Kala
|

Updated on: Jan 01, 2023 | 5:55 PM

Share

కొత్త ఏడాదిలో అడుగు పెట్టాం.. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమకు ఈ ఏడాది ఏ విధంగా ఉంటుందని ఆలోచిస్తారు. తమ రాశిఫలాలపై దృష్టి సారిస్తారు. ఈ  సంవత్సరం కన్యా రాశి వారికి శుభవార్తలను అందిస్తుంది. వీరు సంవత్సరం పొడవునా అదృష్టం  ప్రయోజనం పొందుతారు. ఆనందంగా జీవిస్తారు. కన్యా రాశి వారికి శని సంచారం మిశ్రమంగా ఉంటుంది. జనవరి 17 న, కుంభరాశిలో శని సంచారం ఎనిమిదవ ఇంట్లో ఉంటుంది. శని రాశి మారడం వల్ల ఈ రాశి వారికి ఉద్యోగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. లాభాలు ఆర్జిస్తారు. ఏప్రిల్‌లో.. బృహస్పతి సంచారం ఈ రాశి వ్యక్తుల రాశిచక్రంలో ఏడవ స్థానంలో ఉంటుంది. దీని కారణంగా వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది.

ఏప్రిల్ 22 తర్వాత గురు-చండాల్ దోషం ఏర్పడుతుంది. అక్టోబర్ చివరలో, రాహువు మీనంలోకి ప్రవేశిస్తాడు. కేతువు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా ఈ రాశివారు కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. భాగస్వామ్యంలో కొన్ని అడ్డంకులు ఏర్పడవచ్చు. కన్యా రాశి వారికి 2023 జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

జనవరి– జనవరి నెల ఈ రాశివారికి మంచిది. కెరీర్ పరంగా మంచి విజయాలు సాధిస్తారు. వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందవచ్చు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంలో సమస్యలు రావచ్చు.

ఇవి కూడా చదవండి

ఫిబ్రవరి– ఈ నెల వీరికి విజయాన్ని, సుఖాలను అందిస్తుంది. ధన లాభాలకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. 2023వ సంవత్సరంలోని ఈ మాసం విద్యార్థులకు మంచి విజయాన్ని అందిస్తుంది. ప్రేమ విషయంలో అనుకూలత ఉంది.

మార్చి – వ్యాపారంలో పురోగతి ఉంటుంది. అనేక కొత్త పథకాల్లో పురోగతి ఏర్పడుతుంది. ప్రభుత్వ పనుల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఈ నెలలో ఈ రాశివారు భూమి లేదా ఇంటి ఖరీదు చేసే పయత్నాలు ఫలిస్తాయి.

ఏప్రిల్– ఈ మాసంలో గురు-చండాల దోషం ఏర్పడటం వల్ల కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ధన నష్టం వల్ల మనసికంగా ఇబ్బందులు తలెత్తవచ్చు. శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయించవచ్చు. కుటుంబ జీవితంలో ఇబ్బందులు ఏర్పడవచ్చు.

మే– కన్యా రాశి వారికి ఈ నెలలో కొత్త ఉద్యోగ అన్వేషణ పూర్తి అవుతుంది. గతంలో కంటే ఎక్కువ ఆదాయం పొందగలుగుతారు. మీరు ఈ నెలలో కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లవచ్చు. కోర్టులో ఏవైనా వివాదాలు పెండింగ్‌లో ఉన్నవారు పరిష్కరించుకోవచ్చు. అయితే, నెలాఖరులో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి.. అతిగా ఎవరినీ నమ్మవద్దు . మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు.

జూన్– జూన్ నెల మీకు సృజనాత్మక పనులలో విజయం లభిస్తుంది. ఉద్యోగాల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. అవివాహితులకు.. వివాహం విషయంలో ముందు అడుగు పడే అవకాశం ఉంది. డబ్బు విషయంలో మంచి అవకాశాలు పొందుతారు.

జూలై– ఈ నెల మీ గౌరవాన్ని పెంచుతుంది. ప్రభావవంతమైన వ్యక్తులను సంప్రదించడం ద్వారా మీ చాలా పనులు త్వరగా విజయవంతమవుతాయి. ఈ నెలలో ఉద్యోగస్తులకు అనేక బంగారు అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు ఈ మాసం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అయితే ఈ నెలలో మీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.

ఆగష్టు– ఈ నెలలో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. అయితే ఆ కష్టాలు తాత్కాలికమే.. ప్రయత్నాలలో మంచి విజయం లభిస్తుంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల మద్దతు లభిస్తుంది. మీ ఆర్థిక సమస్యలన్నింటినీ తొలగించి.. ధనలాభాన్ని పొందుతారు.

సెప్టెంబర్– ఈ నెలలో ఈ రాశివారు మాటలను అదుపులో ఉంచుకోవాలి. సంయమనం , సహనం ప్రదర్శించవలసి ఉంటుంది. సెప్టెంబర్ నెలలో ఈ రాశివారు ఆర్థికంగా బలంగా ఉంటారు. ఆకస్మికంగా డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ నెలలో  అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి.

అక్టోబరు– ఈ నెలలో మీ కుటుంబంలో కొన్ని అనుకోని సంఘటనలు జరగవచ్చు. 2023 సంవత్సరంలో ప్రేమికులకు చాలా బాగుంటుంది. ఉద్యోగం, వ్యాపారం చేసే వ్యక్తులు లాభాల కోసం మరిన్ని అద్భుతమైన అవకాశాలను పొందుతారు.

నవంబర్ – ఈ రాశివారు ఈ నెలలో ఎక్కువ ప్రయాణం చేయవలసి ఉంటుంది. పూర్వీకుల ఆస్తిలో కొనసాగుతున్న వివాదం పరిష్కరించబడుతుంది,. మంచి లాభాలను పొందవచ్చు. సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నెలాఖరులో కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది.

డిసెంబర్ – 2023 సంవత్సరం చివరి నెలలో ఈ రాశివారికి గౌరవం, సంపద పెరుగుతుంది. అకస్మాత్తుగా డబ్బు పొందవచ్చు.  మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. సంవత్సరం చివరిలో.. వీరి శక్తి పెరుగుతుంది. మీరు తీసుకునే అన్ని నిర్ణయాలు ప్రశంసలను అందుకుంటాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)