AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Libra Yearly Horoscope: ఈ ఏడాది ఈ రాశి రాజకీయనాయకులకు ప్రజల ఆదరణ.. జనవరి నుంచి డిసెంబర్ వరకూ ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

ఏప్రిల్ 22 న..  బృహస్పతి తన రాశిని మార్చుకున్నప్పుడు తుల రాశివారికీ ఓ గొప్ప వరం.. అని చెప్పవచ్చు. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలు ఉంటాయి. అదే సమయంలో.. ఈ ఏడాది చివరిలో రాహు-కేతువుల రాశి మార్పు కూడా జీవితంలో పెద్ద మార్పును తీసుకొచ్చే అవకాశం ఉంది.

Libra Yearly Horoscope: ఈ ఏడాది ఈ రాశి రాజకీయనాయకులకు ప్రజల ఆదరణ.. జనవరి నుంచి డిసెంబర్ వరకూ ఫలితాలు ఎలా ఉన్నాయంటే..
Libra Yearly Horoscope
Surya Kala
|

Updated on: Jan 01, 2023 | 8:45 PM

Share

తుల రాశి వారిపై గత రెండున్నరేళ్లుగా కొనసాగుతున్న శని ప్రభావం 2023వ సంవత్సరంలో తొలగిపోతుంది. దీంతో శని ఈ రాశివారికి మేలు చేస్తాడు. శని రాశిలో మార్పు కారణంగా.. ఈ రాశి వ్యక్తుల జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. సంవత్సరం ప్రారంభంలో ఈ రాశివారు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే ఏప్రిల్ 22 న..  బృహస్పతి తన రాశిని మార్చుకున్నప్పుడు తుల రాశివారికీ ఓ గొప్ప వరం.. అని చెప్పవచ్చు. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలు ఉంటాయి. అదే సమయంలో.. ఈ ఏడాది చివరిలో రాహు-కేతువుల రాశి మార్పు కూడా జీవితంలో పెద్ద మార్పును తీసుకొచ్చే అవకాశం ఉంది. 2023 సంవత్సరం రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు శుభ ఫలితాలను అందిస్తుంది. అదృష్టం కలిసి వస్తుంది.. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు.

శనీశ్వరుడు శుభ ప్రభావంతో ఈ రాశివారు ఏడాది పొడవునా విజయాన్ని కొనసాగిస్తారు. అయితే ఈ రాశివారికి రహస్య శత్రువులు పెరుగుతారు. మిమ్మల్ని కించపరిచే ఒక్క ప్రయత్నాన్ని కూడా వృధా చేయరు. అయినప్పటికీ వీరు ఎలాంటి నష్టాన్ని చవిచూడరు. ఏప్రిల్ 22 తర్వాత బృహస్పతి మీనరాశికి రావడం వల్ల ఉద్యోగ-వ్యాపార ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. ఉపాధి కోసం చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. అక్టోబరు నుండి రాహుకేతువుల రాశి మారడం వల్ల ఈ రాశివారు చాలా ప్రయాణాలు చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూలంగా నిర్ణయాలు వస్తాయి. తులారాశి వారికి 2023 జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉంటుందో జ్యోతిష్కుల విశ్లేషణను తెలుసుకుందాం..

జనవరి – 2023 సంవత్సరం మొదటి నెల, శనీశ్వరుడు తన రాశిని మార్చుకుంటాడు. ఈ మార్పు శుభప్రదం అవుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్,  వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. ఈ నెలలో కొత్త వాహనం కొనుగోలు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

ఫిబ్రవరి– తులారాశి వారికి 2023 సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది. విజయాల పరంపర కొనసాగుతుంది. కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు ఏర్పడవచ్చు. అయితే భయపడాల్సిన అవసరం లేదు.. కొన్ని రోజులు మాత్రమే ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

మార్చి– ఈ నెలలో మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు. ఉద్యోగ, వ్యాపారాల్లో అధిక శ్రమ పడాల్సి రావచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు. ఈ మాసంలో పిల్లల కోరికలన్నీ నెరవేరుతాయి. మరోవైపు, ప్రేమకు సంబంధించిన విషయాలలో మీ భాగస్వామి నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది.

ఏప్రిల్– ఈ నెల తులారాశి వారికి అద్భుతమైన నెలని చెప్పవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంటుంది. బృహస్పతి రాశిలో మార్పు ఈ రాశివారిపై శుభ దృష్టిని కలిగి ఉంటుంది. ఈ మాసం వైవాహిక జీవితంలో ఆనందం, శాంతితో నిండి ఉంటుంది. ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది.

మే– ఈ నెల ఈ రాశి వ్యక్తుల జీవితంలో గౌరవం పెరుగుతుంది. ఈ నెలలో సృజనాత్మక పనులలో మంచి విజయాన్ని పొందుతారు. ఆరోగ్య పరంగా ఈ మాసం కొంత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

జూన్– ఈ నెలలో మీరు కొంత ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. అయితే తమ నైపుణ్యం, తెలివితేటలతో మీరు ఈ నష్టాన్ని త్వరగా భర్తీ చేస్తారు. ఈ నెల గౌరవప్రదమైన నెల అవుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగం లభిస్తుంది.

జూలై- ఈ నెల ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. డబ్బు సంపాదించడానికి మంచి అవకాశం లభిస్తుంది. ఈ నెలలో ఈ రాశి వ్యక్తులు విదేశాలకు వెళ్లవచ్చు. ఈ నెలలోఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చు.

ఆగష్ట్ – ఈ నెలలో ఈ రాశివారు కొన్ని ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కుటుంబంలో విభేదాలు తలెత్తవచ్చు . పనిలో ఆటంకాలు ఏర్పడతాయి. వ్యాపార పరంగా ఈ నెలలో కొంత నష్టం రావచ్చు.

సెప్టెంబర్ – ఈ నెలలో మీరు ఉద్యోగం,వ్యాపార రంగాల్లోని వారు మంచి విజయాన్ని పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది.

అక్టోబర్– విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసే  ఈ రాశి వ్యక్తులకు మంచి ప్రయోజనం ఉంటుంది. దేశాలకు వెళ్లడానికి అవకాశం అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.

నవంబర్– ఈ నెలలో వీరు గ్రహాల వల్ల మంచి లాభాలను పొందుతారు. శుభం కలుగుతుంది. మాసం అంతా అనుకున్న విజయం సాధిస్తారు. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు.

డిసెంబర్– ఆర్థిక పరంగా ఈ నెల శుభప్రదంగా ఉంటుంది. ప్రజల మద్దతు పొందుతారు. ధన లాభాలకు అద్భుతమైన అవకాశాలు ఏర్పడతాయి. అయితే ఆరోగ్య పరంగా ఈ మాసం కొంత ఆందోళనతో కలిగిస్తుంది. పూర్వీకుల ఆస్తులు పొందే అవకాశం ఉంది. ఆర్థికంగా బలంగా ఉంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)