Vaikunta Ekadashi: వైకుంఠ ఏకాదశి రోజున చిన వెంకన్న నిజ రూప దర్శనం.. మేల్చాట్ ఏక వస్త్రంతో నేతి దీప కాంతిలో భక్తులకు దర్శనం..

ముక్కోటి ఏకాదశి సందర్భంగా ద్వారకా తిరుమల ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఏకాదశి ముందు రోజు సాయంత్రం నుంచి ఏకాదశి మధ్యాహ్నం వరకూ భక్తులకు చిన వెంకన్న నిజరూప దర్శనం ఇస్తారు.

Vaikunta Ekadashi: వైకుంఠ ఏకాదశి రోజున చిన వెంకన్న నిజ రూప దర్శనం.. మేల్చాట్ ఏక వస్త్రంతో నేతి దీప కాంతిలో భక్తులకు దర్శనం..
Dwaraka Tirumala Temple
Follow us
Surya Kala

|

Updated on: Jan 01, 2023 | 8:08 PM

ముక్కోటి ఏకాదశి రోజున భక్తులకు ఆలయాల్లోని స్వామివార్లను ఉత్తర ద్వార దర్శనం చేసుకునే అలవాటు. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ క్షేత్రం ద్వారకా తిరుమలలో వైకుంఠ ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది. చిన్న తిరుపతిగా పిలుచుకుంటూ శ్రీవారిని భక్తు శ్రద్దలతో కొలిచే భక్తులు మేల్చాట్ ఏక వస్త్రంతో ఉన్న స్వామివారిని దర్శించుకోవచ్చు.

అవును ముక్కోటి ఏకాదశి సందర్భంగా ద్వారకా తిరుమల ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఏకాదశి ముందు రోజు సాయంత్రం నుంచి ఏకాదశి మధ్యాహ్నం వరకూ భక్తులకు చిన వెంకన్న నిజరూప దర్శనం ఇస్తారు. అంటే నూతన సంవత్సరం జనవరి 1వ తేదీ  సాయంత్రం నుంచి రేపు (జనవరి 2వ తేదీ) మధ్యాహ్నం వరకు నిజరూప దర్శనం ఇస్తారు. స్వామివారు అలంకారాలు అన్నీ తీసేసి, విద్యుత్ దీపాల వెలుగులు లేకుండా.. బంగారు అంచుతో మేల్చాట్ ఏక వస్త్రం ధరించి నేతి దీప కాంతిలో భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ మేల్చాట్ ఏక వస్త్రం ఏటా తిరుపతి నుంచి వస్తుంది. నేతి దీప కాంతిలో బంగారు వర్ణంలో కనిపించే స్వామిని చూడడనికి రెండు కళ్ళు చాలవని భక్తులు అంటారు.

కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి నిజరూప దర్శనం చేసుకునే సమయంలో కనురెప్పలు మూతవేయడం మరచిపోతాయి.  స్వామివారి నిజ రూప దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడు.. ఆహా.. ఏమి నా భాగ్యం అనుకుంటారు. రేపు ముక్కోటి సందర్భంగా  సాయంత్రం వరకు ఉత్తర ద్వార దర్శనం.. నిజ రూప దర్శనం ఇస్తున్నారు. ప్రతి భక్తుడు స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని ద్వారకాధీశుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..