AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jalli kattu in AP: అప్పుడే మొదలైన జల్లికట్టు సంబరాలు.. పోలీసుల వార్నింగ్‌ను లెక్కచేయకుండా నిర్వహణ

చంద్రగిరి మండలం శానంబట్లలో కొత్త సంవత్సరం తొలి రోజే జల్లికట్టు సంబరాలు ప్రారంభమయ్యాయి. పశువుల కొమ్మలకు పార్టీలు, నాయకులు సినీ హీరోల పోటోలతో బహుమతులను పలకులకు కట్టి జల్లికట్టు లో యజమానులు వదిలారు.

Jalli kattu in AP: అప్పుడే మొదలైన జల్లికట్టు సంబరాలు.. పోలీసుల వార్నింగ్‌ను లెక్కచేయకుండా నిర్వహణ
Jallikattu In Chandragiri]
Surya Kala
|

Updated on: Jan 01, 2023 | 5:21 PM

Share

తెలుగు వారి లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు షురూ అయ్యాయి. ముంగిట ముగ్గులు, ముద్దబంతులతో గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు గంగిరెద్దు ఆటలతో పల్లెల్లో సంక్రాంతి సందడి నెలకొంది. అయితే సంక్రాంతి సంబరాలు అంటే.. ఆంధ్రప్రదేశ్ లో కోడిపందాలు, తమిళనాడులో జల్లి కట్టు గుర్తువస్తాయి. అయితే జల్లి కట్టు అంటేనే ఎద్దులను మచ్చిక చేసుకోవడం.. ఇందుకు ఏ ఆయుధాన్ని ఉపయోగిచకుండా తమ నేర్పుతో ఎద్దులను లొంగదీసుకుంటారు. అయితే ఈ సాంప్రదాయ జల్లి కట్టుని తమిళనాడుతో పాటు.. ఏపీలోని చిత్తూరు జిల్లాలోని పలు గ్రామాల్లో కనుమ పండుగ నాడు నిర్వహిస్తారు.

అయితే సంక్రాంతి సంబరాల కంటే ముందుగానే చిత్తూరు జిల్లాలో జల్లికట్టు సందడి మొదలైంది. చంద్రగిరి మండలం శానంబట్లలో కొత్త సంవత్సరం తొలి రోజే జల్లికట్టు సంబరాలు ప్రారంభమయ్యాయి. గ్రామస్థులు తమ పశువులను అందంగా అలంకరించి పరుగులు పెట్టించారు. ఈ జల్లికట్టుని చూడడానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి భారీ సంఖ్యలో జనం వచ్చారు.

పరుగులు పెట్టే పశువులను నిలువరించి వాటి కొమ్మలకు కట్టిన పలకలను చేజిక్కించుకునేందుకు యువకులు మధ్య పోటీ నెలకొంది. పశువుల కొమ్మలకు పార్టీలు, నాయకులు సినీ హీరోల పోటోలతో బహుమతులను పలకులకు కట్టి జల్లికట్టు లో యజమానులు వదిలారు. పశువులను లొంగ దీసుకునే ప్రయత్నంలో యువకుల మధ్య పోటీ నెలకొంది. గ్రూపులుగా విడిపోయి జల్లికట్టు లో పలు గ్రామాల యువకులు పాల్గొన్నారు. అయితే మరోవైపు జల్లికట్టు కు అనుమతి లేదంటున్న పోలీసుల వార్నింగ్ ఇచ్చారు.. పోలీసుల హెచ్చరికలను లెక్క చేయకుండా జల్లికట్టుని నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..