Visakhapatnam: ఏజెన్సీ రైతులు అధిక లాభాలు పొందేందుకు శాస్త్రవేత్తల కృషి.. ఆంధ్రా కాశ్మీరంలో విదేశీ పూల సాగు

విశాఖ ఏజెన్సీ రైతులు అధిక ఆదాయం పొందేందుకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ అమలు చేస్తున్నారు. గిరిజనులు గంజాయి సాగు వైపు వెళ్లకుండా అధిక ఆదాయం వచ్చే పూలు, ఇతర పంటల సాగుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు శాస్త్రవేత్తలు.

Visakhapatnam: ఏజెన్సీ రైతులు అధిక లాభాలు పొందేందుకు శాస్త్రవేత్తల కృషి.. ఆంధ్రా కాశ్మీరంలో విదేశీ పూల సాగు
Tulips In Visakha Agency
Follow us
Surya Kala

|

Updated on: Dec 29, 2022 | 2:37 PM

దట్టంగా కమ్ముకున్న పొగమంచు…! కురుస్తున్న మంచు తుంపరులు.. అతిచల్లని గాలులు… పూల సోయగాలు… ఆకుపచ్చని హరితారణ్యం అందాలు. అంతా ప్రకృతి సోయగాల మయం. వెరసి అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణం… అదేనండి ఆంధ్ర కాశ్మీరం.! ఇప్పుడు అక్కడ విదేశీ పూల సోయగాలు గుబలిస్తున్నాయి. రంగురంగుల పూలు ఆకర్షిస్తున్నాయి. చింతపల్లిలో శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా చేపట్టిన విదేశీ పూల సాగు సత్ఫలితాలను ఇస్తోంది. గిరిజనుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తోంది. ఇంతకీ మనసు దోచే ఆ విదేశీ ఆ పూల సాగు గురించి వివరాల్లోకి వెళ్తే..

కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా ప్రసిద్ధి చెందిన చింతపల్లి అడవి ప్రాంతంలో వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తల కృషి ఫలిస్తుంది. ప్రకృతి సోయగాలు.. శీతల వాతావరణం.. యాపిల్ డ్రాగన్ ఫ్రూట్ లాంటి ఫలాలకు ఈ ప్రాంతంలో పురుడు పోసింది. కాగా ఇప్పుడు విదేశీ పూల సాగుకు అనుకూలిస్తుంది.

అల్లూరి సీతారామరాజు జిల్లాకు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తలమానికంగా నిలవనుంది. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయ అభివృద్ధికి పరిశోధన కేంద్రం ఎనలేని కృషి చేస్తోంది. మొన్నటి వరకు నూతన వంగడాలపైనే పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు ఇప్పుడు వివిధ రకాల పూల సాగును కూడా ప్రయోగాత్మకంగా చేపడుతున్నారు. మంచి ఫలితాలు వస్తుండడంతో గిరిజన రైతులను ప్రోత్సహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విజువల్స్..

ఇవి కూడా చదవండి

చింతపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో విదేశీ పూల సాగు గుబలిస్తోంది. గ్లాడియోస్, లెలియం , జెర్బెరాలో వైట్‌హౌస్, సన్‌వ్యాలీ ఫోర్స్‌ తదితర రకాల పూలను ప్రయోగాత్మకంగా సాగు చేపట్టి మంచి దిగుబడులు సాధించారు. గత ఏడాది ఎల్లో, పావియా, లిల్లీ రకాలను ఏషియాటిర్ లిల్లీయంలో పావియా రకాన్ని తీసుకువచ్చి ఇక్కడ పరిశీలించారు. విజయవంతమైన ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది ఏషియాటిక్ లిలీయం, ఓరియాటిక్ లిలీయం అనే రెండు రకాలను ఏషియోటిక్ లిలీయంలో ఆర్బాటిక్స్, పావియా పెరాన్, యిరానో ఇటువంటి రకాలను రోమియో, టెరాకో, మోంటినో రకాలు.. ఏషియాటిక్ లిలీయంలో ఒకే రంగు పువ్వులు పూస్తాయన్నారు. ఓరియంటల్ లిలీయంలో రెండు, మూడు రకాల రంగుల పూలు పూస్తాయన్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు.

మార్కెట్‌లో ఈ అలంకరణ పూలకు మంచి డిమాండ్‌ ఉంది. దేశంలోనే ప్రధాన నగరాలు ఇతర రాష్ట్రాల నుంచి కట్‌ ఫ్లవర్లను దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పూలసాగుపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. విశాఖ ఏజెన్సీ రైతులు అధిక ఆదాయం పొందేందుకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ అమలు చేస్తున్నారు. గిరిజనులు గంజాయి సాగు వైపు వెళ్లకుండా అధిక ఆదాయం వచ్చే పూలు, ఇతర పంటల సాగుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు శాస్త్రవేత్తలు.

సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ ప్రాజెక్టులో ప్రధాన పంట అయిన పూల సాగుకు శాస్త్రవేత్తలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆంధ్రకశ్మీర్‌ లంబసింగి, ఆంధ్ర ఊటి అరకు పర్యాటకపరంగా దినదినాభివృద్ధి చెందుతున్నది. పర్యాటకుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. విశాఖ ఏజెన్సీకి వంద నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఆర్థిక రాజధాని విశాఖపట్నం ఉంది. దీంతో గిరిజన రైతులు పూల సాగు చేపడితే మార్కెటింగ్‌ కూడా సులభమవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పరిశోధన స్థానంలో ఎకరం విస్తీర్ణంలో వివిధ రకాలు(రంగులు) గ్లాడియోలస్‌, తులిప్‌, గులాబీతోపాటు మరో కొన్ని రకాల పూల మొక్కలను సాగుచేనున్నారు. పూల సాగును పూర్తిగా ఆర్గానిక్‌ పద్ధతిలోనే చేపడున్నారు.

ప్రస్తుతం ప్రయోగత్మకంగా చేపట్టిన విదేశీ పూలసగు విజయవంతంగా సాగుతుండడంతో… గిరిజన రైతులకు ఈ పూల సాగును పరిచయం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఐదేళ్లలో ఏజెన్సీ వ్యాప్తంగా పూల సాగును విస్తరింపజేయాలనేది శాస్త్రవేత్తల లక్ష్యం. ఇదేగాని జరిగితే ఆంధ్ర కాశ్మీరం కాస్త.. పూల సాగులతో కాశ్మీర్ వేలిగా మారబోతోంది.

Reporter: khaja

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్