AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ప్రీ-వెడ్డింగ్ షూట్ లో కొత్త ట్రెండ్..! ఈ కొరియోగ్రఫీ చూశారంటే ఫిదా అవ్వాల్సిందే.. ఒక్కో స్టిల్‌ చూస్తే..

చాలా మంది కాబోయే జంటలు ఇంతకు ముందు ఎవరూ చేయని ఫోటోషూట్ చేసుకోవాలని కోరుకుంటారు. ఈ రోజుల్లో పెళ్లికి ఎంత ఖర్చవుతుందో ప్రీ-వెడ్డింగ్ షూట్‌కి కూడా అంతే ఖర్చవుతుంది. కొరియోగ్రఫీ నేర్పే వారికి కూడా భారీ డిమాండ్ ఉంది. కానీ ఇక్కడ నావికుడు స్వయంగా శిక్షణ ఇస్తున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. వైరల్‌ వీడియోలో

Viral Video: ప్రీ-వెడ్డింగ్ షూట్ లో కొత్త ట్రెండ్..! ఈ కొరియోగ్రఫీ చూశారంటే ఫిదా అవ్వాల్సిందే.. ఒక్కో స్టిల్‌ చూస్తే..
Pre Wedding Shoot
Jyothi Gadda
|

Updated on: Mar 26, 2025 | 10:14 PM

Share

కొన్ని దశాబ్దాల క్రితం పెళ్లి రోజున ఫోటోలు తీయడం చాలా ఆనందాన్నిచ్చే విషయం. కానీ క్రమంగా వివాహం తర్వాత కూడా కొన్ని ఫోటోషూట్‌లు, వీడియో షూట్‌లు జరగడం ప్రారంభించాయి. ప్రస్తుతం ట్రెండ్‌ మారింది. కాల క్రమేణా ఈ ఫోటో, ఫోటో షూట్‌ క్రేజ్‌ ఎంతగా పెరిగిందంటే.. ఇప్పుడు పెళ్లికి ముందే ఫోటోషూట్‌లు, వీడియో షూట్‌లు జరుపుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. తమకు నచ్చిన ప్రదేశాన్ని ఎంచుకుని, వివిధ భంగిమల్లో ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. చాలా మంది కాబోయే జంటలు ఇంతకు ముందు ఎవరూ చేయని ఫోటోషూట్ చేసుకోవాలని కోరుకుంటారు. కాబట్టి వారు ఈ ఫోటో షూట్‌ల కోసం కొన్ని సందర్భాల్లో ప్రమాదకర స్టంట్లు చేస్తున్నారు. కొందరు నది మధ్యలో, పర్వత శిఖరంపై… ఫోటోషూట్ కోసం వెళ్తూ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి. అయితే, ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నారని అనుకుంటున్నారు కదా.. అసలు విషయంలోకి వెళితే..

అది ఏదైనా సరే పెళ్లికి ముందు ఫోటోషూట్ తప్పనిసరిగా మారింది. దాంతో చాలా మంది కొన్ని ప్రత్యేక ప్రదేశాలను ఎంచుకుంటారు. ముఖ్యంగా కాబోయే వధూవరులు ఎక్కువగా ఫోటో షూట్‌ కోసం బీచ్‌లకు వెళ్తుంటారు. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో ఒక నావికుడు, కాబోయే వరుడితో ప్రీ-వెడ్డింగ్ షూట్ కోసం ఫోజులివ్వటం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

అయ్యాయ్యో.. ఈ వీడియో చూసిన అదేంటని ఆశ్చర్యపోకండి.. అక్కడ పెళ్లి చేసుకోబోయేది అమ్మాయి, అబ్బాయి..కానీ, ఫోటో షూట్‌ కోసం నావికుడు వరుడికి వధువును ఎలా పట్టుకోవాలో, ఎలా పోజు ఇవ్వాలో చెబుతున్నాడు. దీని అర్థం ఆ నావికుడు ఇక్కడ కొరియోగ్రఫీ చేస్తున్నాడు. రోజూ ఇక్కడికి వచ్చే ప్రజలను గమనించడం ద్వారా, వధూవరులు ఎలాంటి భంగిమలో ఉండాలో అతను నేర్చుకున్నాడు. ఈ రోజుల్లో పెళ్లికి ఎంత ఖర్చవుతుందో ప్రీ-వెడ్డింగ్ షూట్‌కి కూడా అంతే ఖర్చవుతుంది. కొరియోగ్రఫీ నేర్పే వారికి కూడా భారీ డిమాండ్ ఉంది. కానీ ఇక్కడ నావికుడు స్వయంగా శిక్షణ ఇస్తున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. వైరల్‌ వీడియోలో నావికుడి కొరియోగ్రఫీ చూసిన ప్రజలు షాక్‌ అవుతున్నారు. ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ లాగా నావికుడు శిక్షణ ఇస్తున్న తీరును ఎంతగానో ప్రశంసిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..