ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కోసం ఇలా చేసి చూడండి..! మిస్ అవొద్దు..!
వాస్తు శాస్త్రం మన జీవితంలో శుభఫలితాలను అందిస్తుంది. ఇంట్లోని ప్రతి మూలలో సరైన వాస్తు నియమాలను పాటిస్తే జీవితం శ్రేయస్సు, ఆనందంతో నిండిపోతుంది. ఇప్పుడు మనం పడకగది, ఫర్నిచర్ అమరిక, మొక్కల ప్రాముఖ్యత, స్ఫటికాల ఉపయోగం, బాత్రూమ్ డిజైన్ వంటి ముఖ్యమైన వాస్తు చిట్కాల గురించి తెలుసుకుందాం.

ఈరోజు మనం జీవితాన్ని పూర్తిగా మార్చగల కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలను తెలుసుకుందాం. ఈ చిట్కాలను అనుసరిస్తే జీవితం ఆనందం, శ్రేయస్సుతో నిండిపోతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం అనుసరించవలసిన కొన్ని ముఖ్యమైన చర్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మన జీవితంలో వాస్తు శాస్త్రం ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుంది. మనిషి జీవితంలో ఇబ్బందులను నివారించడానికి.. ఏదైనా పని ప్రారంభించే ముందు లేదా చేసే సమయంలో వాస్తు శాస్త్రంలో చెప్పిన కొన్ని నియమాలు పాటించాలి. ఈ నియమాలను అనుసరించడం వల్ల మీరు వ్యక్తిగత జీవితంలోనే కాకుండా వృత్తిపరంగా కూడా చాలా ప్రయోజనాలను పొందవచ్చు. ఈ చిట్కాలు అనుసరించడం వల్ల మీరు ఆనందం, శ్రేయస్సు, సానుకూల శక్తితో జీవించగలుగుతారు.
వాస్తు శాస్త్రం ప్రకారం పడకగదిలో అద్దం ఉంచడం మానుకోవాలి. అద్దం వల్ల ప్రతికూల శక్తి చుట్టుపక్కల వాతావరణంలోకి వచ్చే అవకాశముంది. నైరుతి దిశ వాస్తులో స్థిరత్వం, బలానికి సంబంధించినది. కాబట్టి మంచాన్ని నైరుతి దిశలో ఉంచడం వల్ల భద్రత, స్థిరత్వం పెరుగుతుంది. పడకగదిలో ఆగ్నేయ మూలలో నీటి సంబంధిత వస్తువులను ఉంచకండి. ఎందుకంటే అవి ఆర్థిక నష్టానికి దారి తీస్తాయి.
ఇంట్లో ఫర్నిచర్‌ను సక్రమంగా అమర్చడం చాలా ముఖ్యమైన విషయం. వాస్తు ప్రకారం ఫర్నిచర్ కదలడానికి వీలుగా ఉండాలి. అలాగే గదిలో శక్తి ప్రవహించేందుకు సరైన మార్గం ఇవ్వాలి. గది మధ్యలో ఫర్నిచర్ ఉంచకూడదు. దీనివల్ల శక్తి ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. ఫర్నిచర్‌ను గోడలకు ఆనించి ఉంచి మధ్యలో తగినంత స్థలం వదిలివేయాలి. అలాగే మీ లివింగ్ రూమ్ గోడపై కుటుంబ ఫోటోలను ఉంచడం వల్ల కుటుంబ బంధాలను బలపరుస్తుంది.
పువ్వులు, మొక్కలు సానుకూల శక్తికి సహజ మూలం. వాస్తు ప్రకారం ఇంట్లో పువ్వులు, మొక్కలు ఉంచడం వల్ల మంచి శక్తి ప్రవహిస్తుంది. ఈ మొక్కలు గాలిని శుద్ధి చేయడంతో పాటు ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇంట్లో వెదురు, వేప, తులసి మొక్కలు ఉంచడంతో సానుకూల శక్తిని తీసుకువస్తాయి.
స్ఫటికాలు, రత్నాలు చికిత్స లక్షణాలతో పాటు సానుకూల శక్తిని పెంచే శక్తి కలిగి ఉంటాయి. వాస్తు ప్రకారం వీటిని సరైన దిశలో ఉంచితే శక్తి మెరుగుపడుతుంది. ఉదాహరణకు అమెథిస్ట్ రత్నం ఈశాన్య దిశలో ఉంచితే శాంతి, స్థిరత్వం పెరుగుతాయి.
బాత్రూమ్, టాయిలెట్‌లు ప్రతికూల శక్తిని నివారించడానికి జాగ్రత్తగా డిజైన్ చేయాలి. బాత్రూమ్‌లో లేత రంగులను ఉపయోగించడం వల్ల సానుకూలత ఎక్కువగా ఉంటుంది. టాయిలెట్ సీటును ఎల్లప్పుడూ కప్పి ఉంచి బాత్రూమ్ తలుపును మూసి ఉంచడం శుభప్రదం.