Andhra Pradesh: నడిరోడ్డుపైన పడగవిప్పిన నాగుపాము.. అరగంట పాటు ఎక్కడికక్కడే నిలిచిన ట్రాఫిక్

నాగుపాము ఇలా పడగవిప్పి రోడ్డుకు అడ్డంగా ఉండటంపై చర్చనీయాంశంగా మారింది. దోర్నాల సమీపంలోని పెద్దారవీడు మండలం బద్విడు చెర్లోపల్లి వద్ద నాగుపాము నడిరోడ్డుపై పడగ విప్పింది.

Andhra Pradesh: నడిరోడ్డుపైన పడగవిప్పిన నాగుపాము.. అరగంట పాటు ఎక్కడికక్కడే నిలిచిన ట్రాఫిక్
Snake Hulchul On The Road
Follow us

|

Updated on: Dec 29, 2022 | 3:56 PM

నడిరోడ్డుపై ఓ నాగుపాము పడగవిప్పి బుసకొట్టింది. అర గంట పాటు ఎక్కడి వారిని అక్కడే ఆపేసింది. జనం అలికిడి విన్నా.. అదరలేదు, బెదరలేదు. అలాగే ఉండిపోయింది. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రకాశం జిల్లా దోర్నాల – మార్కాపురం ప్రధాన రహదారిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. శ్రీశైలం సమీపంలోని నల్లమల అడవుల్లో తాచుపాములు ఎక్కువగా ఉంటాయి. అప్పుడప్పుడూ రోడ్ల వెంట వాహనదారులకు తారసపడుతుంటాయి. అయితే, ఇలా పడగవిప్పి రోడ్డుపైనే తిష్టవేయడం మాత్రం ఇదే తొలిసారి.

నడిరోడ్డుమీద పాము 

నాగుపాము ఇలా పడగవిప్పి రోడ్డుకు అడ్డంగా ఉండటంపై చర్చనీయాంశంగా మారింది. దోర్నాల సమీపంలోని పెద్దారవీడు మండలం బద్విడు చెర్లోపల్లి వద్ద నాగుపాము నడిరోడ్డుపై పడగ విప్పింది. వాహనదారులు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే బుసలు కొట్టింది. అర గంట తర్వాత ఆ సర్పం అడవి దారి పట్టగా.. కాసేపటికి ట్రాఫిక్ క్లియర్ అయ్యింది. అయితే గతంలో జరిగిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..