East Godavari: 8 కాళ్లతో జన్మించిన గేదె దూడ.. బ్రహ్మంగారు చెప్పిన వింతే అంటూ చూడడానికి ఎగబడుతున్న జనం..

అసలు ఎప్పుడూ జరగనివి.. ఊహించినవి కనిపించినప్పుడు అద్భుతం అనిపిస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి వింతలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. అటువంటి సమయంలో పోతులూరి వీర బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లు జరిగాయని కామెంట్ చేయడం సహజం కూడా

East Godavari: 8 కాళ్లతో జన్మించిన గేదె దూడ.. బ్రహ్మంగారు చెప్పిన వింతే అంటూ చూడడానికి ఎగబడుతున్న జనం..
Rare Calf In East Godavari
Follow us
Surya Kala

|

Updated on: Dec 23, 2022 | 3:21 PM

సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా వెంటనే నెట్టింట్లో ప్రత్యక్షం అవుతుంది. ప్రకృతి లో జరుగుతున్న కొన్ని పరిణామాలు.. కొన్ని వింతలు వింటే ఆశ్చర్యం కలిగే.. కొన్ని సార్లు షాక్ కు గురి చేస్తాయి. పంది కడుపున వింత జీవి పుట్టడం.. ఆవు పంది పిల్లకు పాలు ఇవ్వడం వంటి రక రకాల వింతలు సమాజంలో నిత్యం ఎక్కడో చోట  జరుగుతూనే ఉంటాయి. అసలు ఎప్పుడూ జరగనివి.. ఊహించినవి కనిపించినప్పుడు అద్భుతం అనిపిస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి వింతలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. అటువంటి సమయంలో పోతులూరి వీర బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లు జరిగాయని కామెంట్ చేయడం సహజం కూడా.. తాజాగా అలాంటి వింత సంఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలలో వింత ఘటన చోటుచేసుకుంది. గోకవరం మండలం మురళినగర్‌కు చెందిన ఓ రైతు ఇంట్లో వింత దూడ జన్మించింది. దేవిశెట్టి రత్నాజీ అనే రైతు ఇంట్లో ఓ గేదెకు 8 కాళ్లు కలిగిన దూడ జన్మించింది. ఈ వింత దూడను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. రెండు వెన్నుముకలు, 8 కాళ్లు, ఒకే తలతో జన్మించిన ఈ దూడను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కాగా దూడను పరీక్షించిన వైద్యులు జన్యుపరమైన లోపాల కారణంగానే ఇలాంటి దూడలు పుడతాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..