King cobra: ఊరి మధ్యలో బుసలు కొట్టిన భారీ గిరినాగు.. భయంతో పరుగులు పెట్టిన ప్రజలు
ఇటీవల అనకాపల్లితో పాటూ మరికొన్ని ప్రాంతాల్లో ఈ మధ్య కింగ్ కోబ్రాలు ప్రత్యక్షమయ్యాయి. ఇలాంటి కింగ్ కోబ్రాలు అత్యంత విషపూరితమైనవి కావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాములంటే అందరికీ హడలే. అంతదూరంలో పాము కనిపించందంటే..అక్కడ్నుంచి పరారయ్యే వాళ్లు చాలా మంది ఉంటారు. కొందరు మాత్రం ఎంతటి భయంకర పామునైనా సరే.. పట్టి గిరాగిరా తిప్పి బుట్టలో వేసుకుంటారు. మరికొందరు స్నేక్ క్యాచర్స్ మాత్రం పాములను పట్టుకుని సురక్షితంగా అడవుల్లో విడిచిపెడుతుంటారు. అయితే, అలాంటి పాముల్లో కింగ్ కోబ్రాలు, గిరినాగులు అత్యంత ప్రమాదకరమైనవి. ఏపీలోని తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలో తరచూగా కనిపించే కింగ్‌కోబ్రాలు స్థానికుల్ని హడలెత్తిస్తుంటాయి. తాజాగా అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం కోణాం ఊరి మధ్యలో కింగ్ కోబ్రా కనిపించింది. 12 అడుగుల పొడవున్న ఆ పామును చూసి స్థానికులు వణికిపోయారు.
అనకాపల్లి జిల్లాలో భారీ కింగ్ కోబ్రా హల్‌చల్ చేసింది. చీడికాడ మండలం కోనాంలోని పంట పొలాల్లో ఏకంగ 12 అడుగుల గిరినాకు జనాలను పరుగులు పెట్టించింది. ఉదయాన్నే పొలం పనుల కోసం వెళ్లిన రైతులు బుసలు కొడుతున్న కింగ్ కోబ్రాను చూసి భయంతో పరుగులు తీశారు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఇద్దరు స్నేక్ క్యాచర్స్ గిరినాగును బంధించేందుకు చాలాసేపు శ్రమపడ్డారు. ఎట్టకేలకు ఎంతో చాకచక్యంగా కింగ్‌కోబ్రాను బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. దాంతో రైతులు, స్థానికులు ఊపిరితీసుకున్నారు. వరుసగా కింగ్ కోబ్రాలు ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు.
ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలో కింగ్ కోబ్రాలు బుసలు కొడుతున్నాయి. పామాయిల్ తోటలతో పాటూ జనావాసాల్లోకి రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. విషసర్పాల సంచారంతో అవి కనిపించిన ప్రాంతాల ప్రజలు భయపడిపోతున్నారు. ఇటీవల అనకాపల్లితో పాటూ మరికొన్ని ప్రాంతాల్లో ఈ మధ్య కింగ్ కోబ్రాలు ప్రత్యక్షమయ్యాయి.
ఇలాంటి కింగ్ కోబ్రాలు అత్యంత విషపూరితమైనవి కావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ అధికారులు స్పందించి ఈ పాములను పట్టుకుని… దూర ప్రాంతాల్లో విడిచి పెట్టాల్ని కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి